Tuesday, 6 February 2024

శ్రీమద్భాగవతము, (1 ),

 





"పలికెడిది భాగవత మట,

పలికించువిభుండు రామభద్రుం డట నే,

బలికిన భవహర మగు నట,

పలికెద వే రొండుగాథ పలుకగ నేలా?,""

సత్యం     పరం     ధీమహి..

""భాగవతము శ్రవణం చేస్తేబాగుపడతాము.కారణము అయ్యది కల్పవృక్షము. దీనిని శ్రద్దగా చదివితే కైవల్యం సాధిస్తాము. భాగవతులమైన మన కోరిక గమ్యము కైవల్యపథమే.

"" భాగవత స్థుతి చేసి తర్వాత భాగవతమహాత్మ్యము చెప్పుకొని తదుపరి భాగవత కథలు కొన్ని వివరించుకుందాము.

"" లలితస్కంధము,కృష్ణమూలము, శుకలాపాభిరామము,మం,

జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్,సుందరో,

జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబు నై,

వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్విజశ్రేయ మై"""

"" ఆత్మదేవుడనే వాడు సద్భ్రాహ్మణుడు..అతని భార్య పేరు దుందులి.వీరికి సంతానము లేదు. ఒక మహర్షి ఆత్మదేవుని మొరవిని మంత్రించి ఒక పండునిచ్చి భార్యకిమ్మాంటాడు.కానీ సంతాన పోషణయందు ఆసక్తిలేని దుందులి

ఆ పండును గోవుకి పెడుతుంది.ఆవు గర్భం ధరిస్తుంది. దుందులి కపట గర్భం నటించి తన చెల్లెలు ప్రసవించిన కొడుకుని ఇంటికి తీసుకొని వస్తుంది.ఆవుకి పుట్టిన మానవాకారము ఆవు చెవులతోపుడతాడు.అతనికి "గోకర్ణుడని" భార్య తెచ్చిన బాలునికి""దుందుకారుడని పేర్లు పెడతారు. గోకర్ణుడు సకల విద్యలు నేర్చుకుంటాడు. గారబమువల్ల దుందుకారుడు వ్యసనాలపాలై ఆస్థినంతటిని ఖర్చు చేస్తాడు.ఆ వ్యథతో దంపతులిద్దరూ మరణిస్తారు.దుందుకారుడు వ్యసనాలపాలై  వేశ్యల చేతిలో హతమవుతాడు.అకాలమరణ కారణముగ ప్రేత రూపము ధరించి తిరుగాడుతుంటాడు.

గోకర్ణుడు ఎన్ని తీర్థాలలో తమ్మునికి తర్పణాలు వదిలినా ప్రేత రూపము పోకపోవటము చూచి "సూర్యభగవానుని" ప్రార్థిస్తాడు.దానికి సూర్యుడు"" మునుల సమక్షములో "భాగవతసప్తాహ యజ్ఞము"" నిర్వహించమనగా గోకర్ణుడు అలా చేయగా శ్రద్ధగా వెదురుబొంగును ఆశ్రయించుకొని భాగవతాన్ని విని శ్రవణ మననాలవల్ల దుందుకారుడు  దివ్యపురుషుల ద్వార స్వర్గము చేరుకుంటాడు.బాగవతాన్ని శ్రధ్దగా శ్రవణ మననాలతో ఎవరైతే వింటారో వారికి కైవల్యము సిధ్దిస్తుంది.

సాధకులారా!  భాగవత కథలు చదువుచు చదివించుచు శ్రవణ మననాలు చేస్తు శ్రధ్దాభక్తులతో   రేపటినుండి ఈ భాగవత కథల యజ్ఞములో భాగస్వాములు కాగలందులకు ప్రార్థిస్తున్నాను.

హరయే నమః   శ్రీ కృష్ణాయ నమః.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment