Friday 15 March 2024

శ్రీమద్భాగవతము,

 


""నడుములు  వీగియాడ, జిరునవ్వులు నివ్వటిలంగ, హారముల్,

సుడివడ, మేఖలల్ వదల, జూడ్కి మెరుంగులు సర్వ, ఘర్మముల్,

వొడమ, గురుల్ చలింప, శృతిభూషణముల్ మెరయున్, సకృష్ణ లై,

పడతుక లాడుచుం జెలగి పాడిరి మేఘతటిల్లతాప్రభన్,"",

ప్రాయోపవేశ దీక్షలో యున్న పరీక్షిత్తు శ్రీశుకులను ఆసక్తిగా రాసలీలలు గురించి విపులముగ చెప్పమని ప్రార్థించగా,శ్రీశుకులు ఓ రాజా! స్వామి రాసలీలను విశ్లేషించటము అనితర సాధ్యమయ్యా! బహుశ మా తండ్రి గారైన బాదరాయణులకి అది సాధ్యము కావచ్చు.ఆ పరమేష్టికి  ఈ రాసలీలలు గురించి పూర్తిగా విదితమే. జగదాచార్యడైన నారదమహర్షి   ఆశీర్వచనాల వల్ల నాకు కొంత సాధ్యపడినంత విశ్లేషిస్తాను వినవయ్య.

ఓ రాజా! ఈ రాసలీలాప్రవేశము కోసము సాక్షాత్తు పరమేశ్వరుడు మరియు నారదమహర్షి తపించారు.కానీ వారిలో "" పరాత్పరుని మహదాంశ ఉండబట్టే వారికి ప్రవేశము నిరాకరించబడింది. కానీ ఉద్ధవునికి మరియు నారదునికి రాసలీలలకి ప్రవేశము నిరాకరింపబడ్డా  స్వామి వారికి ఆ సమయములో తమ దర్శనభాగ్యము కల్పించారు.

""మీ పొదలమాటున లేడుగదమ్మా"" యని అలమటించిన గోపికల సౌభస అహంకారము నశించి  పరమభాగవతులుగ మారిపోయారు.ఓ రాజా! సృష్టిలో పురుషుడు పరమాత్మ ఒక్కడే. మిగతావారందరు స్త్రీలే. రాసలీలలకి శక్తి రాధ. భక్తికి శక్తి రాధ. పరమేశ్వరునుండి క్రిందకు ప్రవహించేది ధార. ఆ ధారే పరమాత్మ వైపు మళ్లింపబడితే అది రాధ.

.""ఇదే ఇదే కృష్ణతత్వము""

.ఆ తత్వములో పరమాత్మ గోపికలు రాసలీలలు ప్రారంభించారు.స్వామి గోపికలందరిని ఒక పెద్ద రాస మండలముగ ఏర్పాటుచేసాడు. విచిత్రముగ ప్రతి గోపికలనడుమ తాను ఉండే విధముగ అనేక రూపాలను తాను స్వయంగా ధరించాడు.

అహో ఏమా దృశ్యము." హరికి హరికి నడుమ ఒక గోపిక"".

ఓ రాజా! ఆ చిన్ని బాలకృష్ణుడు గోపికలతోజరిపే రాసలీలలని ఆకాశమార్గమునుండి గంధర్వులందరు సతీ సమేతముగ వీక్షించారు. ఆ సమయములో గోపికలు పైవిధముగ ఆ రాసమండలములో శరీరాంగాలు అలంకారభూషణాలు విచిత్రముగ మెరుస్తున్నాయి.ఒకతెకు హారాలు తెగి చిక్కలతో చికాకు పడుతున్నది.మరొకతె తనకు బిడియము తొంగి చూస్తుంటే స్వామి కొంటెగా నవ్వారు.మరొకతకి శరీరము చెమటపట్డింది.సరిగా ఈ సమయములో స్వామి ఆధ్యాత్మిక రాసలీల ప్రారంభించారు.

.హరయే నమః  శ్రీకృష్ణాయ నమః.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment