Wednesday, 20 March 2024

కోరుకొండ తీర్థం :

 


ఎత్తైన కొండచుట్టూ కోరుకొండ గ్రామంలో ఏవైపు నుంచి చూసినా దేవాలయం కనిపిస్తూ సుందర దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. కొండపైనున్న ఈ ఆలయంలోని స్వయంభు నృసింహుడు పరమ శాంతమూర్తి. లఘుమూర్తిగా రాతి గూడులో ఈ స్వామి దర్శనమిస్తాడు. నేటికీ కొండపైకి ఎటువంటి రవాణా సదుపాయం లేదు. కాలిబాటనే వెళ్లవలసి ఉంటుంది. కోరుకొండ దర్శనానికి కొండ ఎక్కడం మంచి ఆధ్యాత్మిక అనుభవం. ముఖ్యంగా గోదావరి తీరప్రజలకు కోరుకొండ తీర్ధంలో పాల్గొనడం పరమానందదాయకం. కోరుకొండ దేవరకు మొక్కు చెల్లిస్తే ఎటువంటి ఆపదనుంచి అయినా రక్షిస్తాడని ప్రతీతి. పరాశర మహర్షి కారణంగా ఇక్కడ లక్ష్మీసమేతంగా నరసింహస్వామి కొలుపుదీరాడు. అందుకే ఈ కొండను పరాశరగిరి అని పిలుస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్న కోరుకొండ లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని 12వ శతాబ్దంలో రెడ్డిరాజులు అభివృద్ధి చేశారు. ఇక్కడి గోడలపై చెక్కిన శిల్పాలు రమణీయంగా ఉంటాయి. నాయకరాజుల రాజధాని రేకపల్లికి కోరుకొండకి దగ్గరి సంబంధాలుండేవి. ముమ్మడి నాయకులు ఈ ప్రాంతాన్ని 

పరిపాలించారు. వారంతా కోరుకొండ స్వామిని సేవించినవారే!

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment