Sunday 17 March 2024

భగవానుడు…. హృదయ నివాసి!

 

                 


ఈశ్వరస్సర్వ భూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి

 పాండవులలో  పెద్దవాడైన యుధిష్ఠిరుడు  కౌరవ ప్రముఖుడైన  దుర్యోధనునితో  జూదమాడటానికి అంగీకరించాడు.

ద్యూత  క్రీడలో  నెమ్మది నెమ్మదిగా  తన రాజ్యాన్ని  తమ్ముళ్ళను ఓడిపోయాడు. చివరగా  ద్రౌపదినే పణంగా పెట్టి  ఓడిపోయాడు.

దుర్మార్గపు  బుద్ధితో  దుర్యోధనుడు ద్రౌపదిని  రాజదర్బారుకు పిలిపించి, ఆమెను అవమానపరచటానికై దుశ్శాశనుడు  ద్రౌపదీ  వస్త్రాపహరణం చేయసాగాడు.

ఆమె పాండవులవైపు  తిరిగి  రక్షించమని ప్రార్థించింది. ఆమెకు సహాయపడాలని  మనసులలో  ఉన్నా ఏమీ చేయలేని దుస్థితిలో  వారున్నారు.

ఒక్క  భగవంతుడే  తనకు దిక్కని భావించి ద్రౌపది ఇలా  ప్రార్థించింది:

"కృష్ణా! ద్వారకావాసీ! నీవెక్కడున్నావయ్యా? నన్ను  కావవయ్యా! త్వరగా వచ్చి నా మానాన్ని  కాపాడు  స్వామీ! అని ప్రార్థించింది.

ఆమెకు సహాయపడటానికి  భగవంతుడు కొన్ని క్షణాలు తీసుకున్నాడు. 

ద్రౌపది  తన కష్టంనుండి  గట్టెక్కింది. ఆ తరువాత  తనను కాపాడటానికి  తత్ క్షణమే రాకుండా  కొన్ని క్షణాలు ఆలశ్యంగా  ఎందుకు వచ్చావని ద్రౌపది  శ్రీకృష్ణుని  ప్రశ్నించింది.

అప్పుడు  కృష్ణపరమాత్మ ఇలా  సమాధానమిచ్చాడు:

"నీవు నన్ను "ద్వారకావాసీ" అని సంబోధించావు. అందువలన  నీ ముందు ప్రత్యక్షమవటానికి  కొంత సమయం  తీసుకొన్నాను.

నేను ద్వారక నుండి  రావాలి కదా! నీవు నన్ను ‘హృదయ నివాసీ’ అని సంబోధించినట్లయితే నేను తప్పకుండా  వెంటనే  నీ సహాయానికి వచ్చేవాడిని".

వ్యాసమహాభారతంలోని  కథకు కొన్ని  విషయాలు జోడించినా, భగవంతుడు మనవద్దే  ఉన్నాడనీ, ఆ విషయాన్ని మర్చిపోతే  మనకు నష్టమనీ ఈ కథ సూచిస్తోంది.

సహజంగా  భగవంతుడు వైకుంఠంలోనో, కైలాసంలోనో ఉన్నాడని ప్రజలు భావిస్తుంటారు. వాస్తవానికి జీవుల లోపలనుండి, చైతన్యాన్ని  సమకూర్చేది ఆయనే.

*బృహదారణ్యకోపనిషత్తు ఇలా  చెప్తోంది :

బుద్ధిలో  నివసిస్తూ, బుద్ధిలో  అంతర్భాగమై, బుద్ధికి అంతుపట్టకుండా, బుద్ధియే దేహంగా ఉంటూ, లో నుండి బుద్ధిని  అదుపులో  ఉంచే అతడే అంతర్యామి, అంతరంగిక పాలకుడు, నాశనం లేని మీ ఆత్మే అతడు."

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment