19 మార్చి 2024
మంగళవారము MARCH 19
మేషం🐐
అశ్వని1,2,3,4,(చూ,చే,చో,లా)భరణి 1,2,3,4,(లీ,లూ,లే,లో) కృతిక 1,(ఆ)
ఉద్యోగ యత్నాలను వేగంగా సాగిస్తారు.చిన్ననాటి మిత్రుల ముఖ్య సమాచారం రావచ్చు. కొత్త పరిచయాలతో మీలో ఉత్సాహం పెరుగుతుంది.
ఆర్థిక వ్యవహారాలను మరింత చక్కదిద్దుకుంటారు.
దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారంలో కొంత విజయం. కాంట్రాక్టులను పొందడంలో విజయం సాధిస్తారు.
ఉద్యోగుల విధి నిర్వహణపై మరింత దృష్టి పెడతారు.రాజకీయ నిరీక్షణ ఫలిస్తుంది
వృషభం🐂
కృతిక 2,3,4(ఈ,ఊ,ఏ),రోహిణి1,2,3,4(ఓ,వా,వీ,వూ) , మృగశిర1,2,(వే,వో)
ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు రుణాలు చేస్తారు.
ఆకస్మిక ప్రయాణాలు సంభవం.బంధువులు, మిత్రులతో విభేదాలు నెలకొంటాయి.
ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ ముందుకు సాగండి. అనుకున్నది సాధించడంలో కొన్ని అవాంతరాలు. ముఖ్యమైన పనులలో వేగం తగ్గుతుంది. ఉద్యోగులకు విధి నిర్వహణలో కొన్ని సమస్యలు.
విద్యార్థులకు అందిన అవకాశాలు కూడా జారిపోతాయి. మహిళలకు కుటుంబ సభ్యుల సహాయసహకారాలు అందుతాయి
మిథునం👩❤️👨
మృగశిర 3,4 (కా,కి), ఆరుద్ర 1,2,3,4(కు, ఘ, ఙ, ఛ) పున్వరసు1,2,3(కే,కో, హా)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.
చిరకాల కోరిక నెరవేరుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు.
ఆలోచనలపై ఒక అంచనాకు వస్తారు.
వాహనాలు, ఆభరణాలు కొంటారు.ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు తొలగుతాయి.
రాజకీయవేత్తలు వారు కొన్ని ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థులకు అవకాశాలు లభించవచ్చు.
మహిళలకు ఆస్తి లాభ సూచనలు.
కర్కాటకం🦀
పున్వరసు 4(హి),పుష్యమి1,2,3,4(హు,హే,హో,డా) అశ్లేష 1,2,3,4 (డీ, డు, డే, డో)
కొత్త వ్యక్తుల పరిచయం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. అదనపు రాబడి ఉంటుంది. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
సింహం🦁
మఘ 1,2,3,4(మ, మి, ము, మే), పుబ్భ 1,2,3,4 (మో, ట, టి, టు) ఉత్తర1 (టె),
ఆకస్మిక ధన లాభం కలిగి అవసరాలు తీరతాయి.
కార్యక్రమాలు మరింత వేగంగా పూర్తి చేస్తారు.
బంధువులతో విభేదాలు సర్దుకుని సఖ్యత ఏర్పడుతుంది.
ప్రముఖులతో పరిచయాలు.
ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
కన్య🙎♀️
ఉత్తర2,3,4(టొ, ప, పి), హస్త 1,2,3,4 (పు,షం,ణ, ఠ) చిత్త 1,2(పె, పొ)
ముఖ్యమైన వ్యవహారాలను విజయపథంలో సాగిస్తారు.
ఆర్థిక పరిస్థితి అంచనాల ప్రకారం ఉంటుంది. అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు.
ఇంటాబయట సమస్యలు.
ఆప్తుల నుంచే విమర్శలు రావడం ఇబ్బంది కలిగించవచ్చు.వ్యాపారస్తులు, కొత్త ఇబ్బందులు తప్పవు.
ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కవచ్చు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు కొన్ని కష్టాలు ఎదుర్కొంటారు. విద్యార్థులు తమ లక్ష్యాల పై దష్టి పెడతారు.
మహిళలకు కుటుంబ సభ్యులతో కలహాలు.
తుల⚖️
చిత్త 3,4 (ర,రి), స్వాతి 1,2,3,4(రు, రె, రో,త), విశాఖ1,2,3, (తి, తు, తే)
ఆర్థిక ఇబ్బందులతో కొంత సతమతమవుతారు.
మీ ప్రతిపాదనల పై కుటుంబంలో వ్యతిరేకత ఉంటుంది.
ఆకస్మిక ప్రయాణాలు.ఇంటాబయటా కొంత ఒత్తిడులు ఎదుర్కొంటారు..
కొంత అలసట, అనారోగ్య సూచనలు. ఇంటి కొనుగోలుపై సందిగ్ధత.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు చికాకులు.
ఉద్యోగులకు విధి నిర్వహణలో స్వల్ప అవాంతరాలు.మహిళలకు కుటుంబ సమస్యలు.
విద్యార్థులకు అంతగా కలిసిరాదు.
వృశ్చికం🦂
విశాఖ 4(తో), అనురాధ 1,2,3,4 (న, ని,ను, నే),
జ్యేష్ఠ 1,2,3,4,(నో, య, యి, యు)
ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. బంధువులతో తగాదాలు. అంచనాలు తారుమారు. సన్నిహితుల నుంచి అపవాదులు. వ్యాపారాలలో చికాకులు తప్పవు. ఉద్యోగులకు అదనపు పనిభారం.
ధనుస్సు🏹
మూల1,2,3,4,(యె,యో, బ,బి)పూర్వాషాడ1,2,3, 4
(బు, ధ, భ, ఢ) ఉత్తరాషాడ 1(బె)
అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. భూ వివాదాలు నెలకొంటాయి. రాబడి కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు కష్టసాధ్యమే. ఉద్యోగులకు చికాకులు.
మకరం🐊
ఉత్తరషాఢ 2,3,4,( బో, జ, జి)శ్రవణం 1,2,3,4,
(జు, జే, జో, ఖ)ధనిష్ట 1,2(,గ, గి)
ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు.
దూర ప్రయాణాలు.
ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ఇంతకాలం పడ్డ శ్రమ ఫలించ నిరాశ చెందుతారు.
ఆర్థిక వ్యవహారాలు అంతగా కలసిరావు.బంధువులతో విభేదాలు ఏర్పడవచ్చు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సామాన్యస్థితి.
ఉద్యోగస్తులు ఒత్తిడులను ఎదుర్కొంటారు.
విద్యార్థులకు పట్టుదలతో శ్రమించాలి.
మహిళల అంచనాలలో పొరపాట్లు.
కుంభం⚱️
ధనిష్ట 3,4 (గు, గె), శతభిషం 1,2,3,4(గొ, స, సి, సు)
పూ||భా||1,2,3(సె, సో, ద),
ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉండి అప్పులు చేస్తారు.
సన్నిహితుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.పరిస్థితుల ప్రభావంతో ప్రయాణాలు రద్దు చేసుకుంటారు.
వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపడం మంచిది.వ్యాపారస్తులు చిక్కులు.ఉద్యోగులకు ఊహించని మార్పులు.రాజకీయవేత్తలు, వ్యవసాయదారులకు కొత్త సమస్యలు.
విద్యార్థులకు చికాకులు పెరుగుతాయి.మహిళలకు నిరుత్సాహం.
మీనం🐟
పూ||భాధ్ర||4,(ది) ఉ||భా||1,2,3,4 (దు, శం, ఝ, థ),
రేవతి1,2,3,4, (దే, దో, చ, చి)
కుటుంబంలో చికాకులు. రాబడికి మించి ఖర్చులు. శారీరక రుగ్మతలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారాలు ముందుకుసాగవు. ఉద్యోగవర్గాలకు బాధ్యతలు మీదపడతాయి.
No comments:
Post a Comment