Wednesday 13 March 2024

పుత్ర గణపతి వ్రతం

 



పాల్గుణ మాసం శుక్ల పక్ష చతుర్థి పుత్ర గణపతి వ్రతం సందర్భంగా... 

పుత్ర సంతానం కోసం “పుత్ర గణపతి వ్రతం”

భాద్రపద శుద్ధ చవితి నుండి సరిగ్గా 180 రోజులు అంటే ఆరు నెలలు గడిచే సరికి ఫాల్గుణ శుద్ధ చవితి వస్తుంది. ఆనాటికి వినాయక చవితికి గణపతి నక్షత్ర సమూహం సూర్యాస్తమయం కాగానే ఉదయిస్తుంది. వేదంలో చెప్పిన సూత్రం ప్రకారం-ఆనాడు కూడా పూజ్యదేవత గణపతే. అందుకే ధర్మశాస్త్రకారకులు ఆనాడు “పుత్ర గణపతి వ్రతం” అన్నారు.

పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయక చవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఫాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. మంచి సంతానం కోసం, సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారు అని పురాణాలు చెబుతున్నాయి.  చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వలన సంతానం కలుగుతుంది అని నమ్మకం.

“పుత్ర గణపతి వ్రతం”పుత్రగణపతి వ్రతం అంతరార్ధం

శ్రీ పుత్ర గణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి)

‘‘సాక్షాత్‌ రుద్ర ఇవాపరః’’ అన్నట్లుగా జగదంబ అనుగ్రహముతో జన్మించి రుద్రానుగ్రహముతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖము పెట్టినప్పుడు జగదంబ పార్వతీ దేవిని ఆనందింప చేయుటకు పరమేశ్వరుడితో సహా దేవతలందరూ పార్వతీ ఒడిలో ఉన్న వినాయకుని స్తుతించిన స్తుతిని విన్న అమ్మ వారు ఎవరైతే ఈస్తుతిని గౌరీ సమేత గణపతిని ఫాల్గుణ శు।।చవితి యందు పఠించి నువ్వులు, బెల్లము నివేదన చేసి ప్రసాదముగా స్వీకరిస్తారో అట్టి భక్తులందరికీ నాకే విధముగా అయితే పుత్రశోకము తొలగి పుత్రవృద్ధి కలిగినదో అదేవిధముగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశవృద్ధి జరుగునని జగదంబ పార్వతి వరమిచ్చెను.

అట్టి జగదంబ సమేత పుత్రగణపతి అనుగ్రహముపొందుటకు ఈ పుత్రగణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి) పారాయణము చేయడం వలన వంశ దోషములు తొలగి శక్తి యుక్తలు కలిగిన పుత్రులు జన్మించునని వరాహపురాణ వచనము. మొదట ఈస్తోత్రముతో డుంఢి రాజు అను కాశీరాజు పుత్రగణపతిని ఆరాధించి సత్ఫలితములను పొందెను. అత్యంత అధ్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం.

వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు . మంచి సంతానం కోసం, సంతానం లేని వల్లూ సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారు అని పురాణాలూ చెబుతున్నాయి. చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వల్ల సంతానం కలుగుతుంది అని నమ్మకం.

పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం ఫాల్గుణ శుద్ధ చవితి ప్రత్యేకతగ కనిపిస్తూ వుంటుంది. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటారు. పుత్ర సంతానం కావాలనుకునే వాళ్లు ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ‘పుత్రగణపతి వ్రతం’ ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం ఫాల్గుణ శుద్ధ చవితి ప్రత్యేకతగ కనిపిస్తూ వుంటుంది. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటారు. పుత్ర సంతానం కావాలనుకునే వాళ్లు ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ‘పుత్రగణపతి వ్రతం’ ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

వారసుడు కావాలనే కోరిక … తమ తరువాత ఆడపిల్లల బాగోగులు చూసుకోవడానికిగాను ఒక మగ సంతానం కావాలనే ఆశ కొంతమందిలో బలంగా కనిపిస్తూ వుంటుంది. ఈ విషయంగా ఎక్కువకాలం నిరీక్షించవలసి వచ్చినప్పుడు, పుత్ర గణపతి వ్రతం జరుపుతుంటారు. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి … గడపకి పసుపురాసి కుంకుమ దిద్ది .. గుమ్మానికి తోరణాలుకట్టి .. పూజామందిరాన్ని అలంకరించాలి.

ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను … పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది.

పూర్వం మహారాజులు … చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్లంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తరువాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్లు భావించేవాళ్లు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్లు పుత్ర సంతానం కోసం ఆరాటపడే వాళ్లు. ఇందుకోసం వాళ్లు ‘ఫాల్గుణ శుద్ధ చవితి’ రోజున ‘పుత్ర గణపతి’ వ్రతాన్ని ఆచరించే వాళ్లు.

అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు ప్రస్తావిస్తున్నాయి.

ఇక రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయినా … రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయినా ‘పుత్రగణపతి వ్రతం’ మాత్రం నాటి నుంచి నేటి వరకూ ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి, పరిశుభ్రమైన పట్టువస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో కలశస్థాపన చేసి … శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్రగణపతి వ్రత కథను చదువుకుని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.

ఇంచుమించు వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తమకి పుత్ర సంతానం కావాలని పూజా సమయంలోనే స్వామివారికి దంపతులు అంకితభావంతో చెప్పుకోవాలి. బుద్ధిమంతుడు … జ్ఞానవంతుడు … ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి. ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతికాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతారు.

ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ఉండాలి. మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకితభావంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతికాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

అత్యంత అధ్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద్ధ చవితి రోజున అనగా రేపు 8 సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం లభిస్తుంది.

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం

Ph: 9666602371         -          

No comments:

Post a Comment