Friday 15 March 2024

తిలకం ధారణ వల్ల శాస్త్రీయ ప్రాముఖ్యత

 

తిలకం ప్రాముఖ్యత: నుదురు ముఖం కేంద్ర బిందువు. ఇది ఒక వ్యక్తిలో అంతర్ దృష్టి , ఆధ్యాత్మికత ప్రాంతాన్ని శాసిస్తుంది. రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని ఆజ్ఞా చక్రం లేదా మూడో నేత్రం అని కూడా అంటారు. ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుని దర్శించగలరని హిందువుల విశ్వాసం. అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమ ధరిస్తారు.ఇక్కడే అన్ని నాడుల కేంద్రం ఉంటుందని భారతీయ సంస్కృతి లో గురువుల నమ్మకం. ఈ కనుబొమ్మల మధ్యలో వేలితో బొట్టు పెట్టుకునేప్పుడు నొక్కడం ద్వారా శరీరంలో అన్ని నాడులు చైతన్యవంతం అవుతాయి. గంధపు తిలకాన్ని నుదుటిపై ధరించడం వలన పాపాలు తొలగిపోతాయని, జీవితంలో అన్ని అడ్డంకుల నుండి రక్షణ లభిస్తాయని.. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. తిలకం ధరించడం వలన పాపాలు తొలగిపోతాయని వివాహిత స్త్రీ తన భర్తకి దీర్ఘాయువు నిస్తుందని విశ్వాసం.
నుదిటిమీద పెట్టుకునే బొట్టు చెడు దృష్టి నుంచి రక్షిస్తుందని విశ్వాసం. ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతుంది. ఇది గ్రహ ప్రభావాలను శాంతపరుస్తుంది. అంతర దృష్టి శక్తిని పెంచుతుంది. కొన్నిసార్లు.. కొందరు తమ మెడ దగ్గర తిలకం ధరిస్తారు. ఇలా చేయడం వలన భావ వ్యక్తీకరణ శక్తిని మెరుగుపరుస్తుంది.
కుంకుమ దేనితో తయారు చేయబడుతుందంటే?
పూజ చేసే సమయంలో కుంకుమ ధరిస్తారు. దేవుడికి పసుపు, కుంకుమతో పూజలను చేస్తారు. పసుపు ఆరోగ్యాన్ని, ప్రకాశాన్ని అందిస్తుంది. ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. కుంకుమ పొడిని పసుపు.. సున్నంతో తయారు చేస్తారు. కుంకుమ ధరించిన వారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే ప్రస్తుతం కుంకుమను రసాయనాలతో తయారు చేస్తున్నారు. చాలామంది ప్లాస్టిక్ బిందీలను ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్‌ స్టిక్కర్స్ ను నుదిటమీద ధరించడం మంచిది కాదు. విభూతి లేదా కుంకుమ లేదా పసుపు ధరించడం వలన ఆత్మపై ప్రభావం చూపుతుంది. దేవాలయాల్లో తీవ్రమైన ప్రాణిక ప్రకంపనలు ఉంటాయి. వాటిని మనం స్వీకరించలేము. కనుకనే ఆలయాల్లో విభూతి, కుంకుమ ఇస్తారు. ఇవి ఆలయ వాతావరణం నుండి శక్తిని గ్రహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.. తద్వారా మీరు దానిని గ్రహించవచ్చు.
ఇడా, పింగళ, సుషుమ్నా నాడి సంగమమైన మన నుదిటి మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంది. తిలకం (బొట్టు) ఎల్లప్పుడూ అజ్ఞా చక్రంపై జరుగుతుంది, దీనిని మన స్పృహ కేంద్రంగా కూడా పిలుస్తారు. శాస్త్రీయ దృక్కోణంలో, గంధపు తిలకం దరఖాస్తు మనస్సులో శాంతి, తాజాదనం మరియు చల్లదనాన్ని కలిగి ఉంటుంది. దీంతో మెదడులోని సెరటోనిన్, బీటాఎండార్ఫిన్ అనే రసాయనాలు బ్యాలెన్స్ చేసి మేధస్సును పెంచుతుంది. తిలకం ధారణ చేసుకునేటప్పుడు, మనం తలపై చేతులు ఉంచుతాము, తద్వారా మన కిరీటం చక్రంపై సానుకూల శక్తి సేకరించబడుతుంది మరియు మన ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి.
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment