Monday, 18 March 2024

 

శ్రీ భగవానువాచ

ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ |

ఆత్మన్యేవాత్మనా తుష్ట: స్థితప్రజ్ఞస్తదోచ్యతే ||

ప్రతి పదార్థం

శ్రీ భగవానువాచ – శ్రీకృష్ణభగవానుడు పలికెను; ప్రజహాతి – విడుచునో; యదా – ఎప్పుడు; కామాన్ – ఇంద్రియభోగ కోరికలను; సర్వాన్ – అన్నివిధములైన; పార్థ – ఓ పృథాకుమారా; మనోగతాన్ – మానసిక కల్పితములైన; ఆత్మని – విశుద్ధమైన ఆత్మస్థితి యందే; ఏవ – నిశ్చయముగా; ఆత్మనా – విశుద్ధమైన మనస్సుచేత; తుష్ట: - తృప్తినొందినవాడై; స్థితప్రజ్ఞ: - దివ్యస్థితి యందు నేలకోనినవాడు; తదా – అప్పుడు; ఉచ్యతే – చెప్పబడును.

అనువాదము

శ్రీకృష్ణభగవానుడు పలికెను: ఓ పార్థా! మనుజుడు ఎప్పుడు మానసిక కల్పితములైన సర్వకామములను త్యజించునో మరియు ఆవిధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మ యందు తృప్తినొందునో అప్పుడతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. 

భాష్యము

కృష్ణభక్తి యందు పూర్ణుడైనట్టివాడు (భక్తియోగమునందు పూర్ణుడు) మహర్షుల సర్వసద్గుణములను కలిగియుండగా, దివ్యమైన ఆధ్యాత్మికస్థితిలో నిలువలేనటువంటివాడు ఎటువంటి సద్గుణములను కలిగియుండజాలడని శ్రీమద్భాగవతము నిర్ధారించుచున్నది. అట్టివాడు మానసికకల్పనాపరుడగుటయే అందులకు కారణము. కనుకనే మనోజనితమైన సర్వవిధ కామములను మనుజుడు త్యజింపవలెనని ఇచ్చట తెలుపబడినది. వాస్తవమునకు అట్టి ఇంద్రియ కోరికలు బలవంతముగా అణచబడలేవు. కాని మనుజుడు కృష్ణభక్తిలో నియుక్తుడైనంతనే ఇంద్రియసంబంధ కోరికలు ఎట్టి బాహ్యయత్నము లేకుండా అప్రయత్నముగా అణిగిపోగలవు. కనుక ప్రతియొక్కరు ఎటువంటి సంకోచము లేకుండా కృష్ణభక్తిభావన యందు నియుక్తులు కావలెను. ఏలయన అదియే దివ్యచైతన్యస్థాయిని తక్షణమే చేరుటకు సహాయభూతమగుచున్నది. మహాత్ముడైనవాడు తనను శ్రీకృష్ణభగవానుని నిత్యదాసునిగా గుర్తించి సదా తృప్తుడై నిలిచియుండును. దివ్యస్థితి యందు నెలకొనిన అటువంటి మనుజుడు తుచ్చమైన ఇంద్రియపర కోరికలను కలిగియుండక శ్రీకృష్ణభగవానుని నిత్యసేవనమనెడి తన సహజస్థితిలో సదా ఆనందమగ్నుడై యుండును.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment