దైవనిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుందన్నది ఓ విశ్వాసం.
భవిష్యత్తు ఎలా ఉండనుందో సామాన్యులు ఎవరికీ తెలియదు.
కాలాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరు. ఓ అదృశ్యశక్తి కాలాన్ని నడిపిస్తుందని భావించడం తప్పు కాదు.
మానవుడు అనిశ్చిత భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నాడు. అతడి కార్య కుశలత పరిమితమైనది. మంచిని పంచడంవల్ల మంచే తిరిగి వస్తుందన్నది ప్రామాణిక సత్యం.
ఒకరు ఏం చేస్తే ఆనందం కలుగుతుందో అదే ఆచరించి ఆనందం అందివ్వవచ్చు. నేలకు కొట్టిన రబ్బరు బంతిలాగా ఆనందం తప్పక మన దరి చేరుతుంది.
శాంతియుత జీవనం సాధ్యమైనప్పుడు స్పర్ధలతో పనేమిటి? శిష్ట రక్షణ దైవ వాగ్దానం! దుర్బలురు సైతం ఆనందంగా బతికేందుకు సహాయపడటం దైవానికి ప్రీతిపాత్రం.
మంచిని అందించి మంచిని తిరిగి పొందడం మానవత్వానికి సంకేతం. ఆ బాటన పయనించి విశ్వమానవ కల్యాణ కేతనాన్ని ఎగురవేద్దాం.
No comments:
Post a Comment