Monday, 18 March 2024

వ్యూహ లక్ష్మీ మహా మంత్రం (Vyuha Lakshmi maha Mantram)

 




ఓం శ్రీ ఓం నమః ఓం పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః

ప్రతి శుక్రవారం 108 సార్లు తగ్గకుండా జపం చేస్కోవాలి. లేదా 41 రోజులు నియమంగా జపం చేస్కొనే వారు ఎక్కడ మొదలు పెడితే అక్కడే ముగించాలి.(వ్యూహ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలం మీద కొలువై ఉంటుంది.)                                  *********తిరుమలలో శ్రీవారి దేవాలయంలో గర్భాలయంలో వెలసిన మూలవిరాట్టు వక్ష స్థలంలో మహాలక్ష్మి యొక్క ప్రతిమ ప్రతిష్టించబడి ఉంటుంది. అందుకే వైకుంఠ నాధుడ్ని శ్రీనివాసుడు గా పిలుస్తారు.ఈ శ్రీ మహాలక్ష్మినే వ్యూహలక్ష్మి అని తంత్ర శాస్త్రంలో పేరు. ఇది ప్రపంచంలో ఏ దేవాలయంలో లేని తంత్ర శాస్త్ర విశేషమైన కార్యక్రమం.. ఒకానొక సంధర్భంలో స్వామి వారు ఎవరు అనే ధర్మసందేహం కలిగిన రోజుల్లో భగవత్ రామానుజుల వారే స్వామి వారు సాక్షాత్తు వైకుంఠ నాధుడని, వైకుంఠం నుండి భూలోకంలో ఆచ్ఛావతార మూర్తిగా అవతరించారని, స్వామి వారికి శంఖు చక్రాలను ఏర్పాటు చేసి పచ్చకర్పూరంతో నామంపెట్టి వక్షస్థలంలో వ్యూహాలక్ష్మి ప్రతిమను ఏర్పాటు చేశారని పురాణాలు చెబుతున్నాయి.

వక్షస్థలంలో మహాలక్ష్మి ఉండటం వల్లే శుక్రవారాలలో శ్రీమన్నారాయణునికి అభిషేకం నిర్వహించాలని కూడా రామనుజులవారే ఆరంభించారని శిలాశాసనాలలో పేర్కొనబడ్డాయి. అంతే కాకుండా జియాంగార్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, శ్రీవారి కైంకర్యంకోసం తొలి జీయర్ మఠాన్ని కూడా ఆనాడే స్థాపించారని, ఈ సంప్రదాయం. ఇది నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. అలా శ్రీవారి వక్షస్థలంలో ఈ వ్యూహాలక్ష్మి ఉండటం వల్లే స్వామివారి కి జన, ధన ఆకర్షణ విశేషంగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే.

ఈ వ్యూహ లక్ష్మిని వర్ణిస్తూ విభుజా అంటారు.. సాధారణంగా చతుర్భుజాలతో దర్శన భాగ్యం కలిగించే మహాలక్ష్మి శ్రీవారి వక్షస్థలంలో ఉండగా మూడు భుజాలతోనే దర్శనం ఇస్తారు కనుక త్రిభుజా అని పిలుస్తారు. శ్రీవారితో ఉన్నప్పుడు నాలుగు భుజాలతో పద్మాలు అలంకరించుకుంటే పద్మాసనంగా పద్మంలో కూర్చున్నట్టుగా మనకు దర్శనమిస్తారు.

 ఈ వ్యూహలక్ష్మి కి ప్రతి శుక్రవారం నాడు పసుపుతో అభిషేకం జరుగుతుంది. అభిషేకం తర్వాత అమ్మవారిని అలంకరిస్తారు, స్వామి వారికి కూడా అభిషేకం తర్వాత పచ్చకర్పూరం అలంకరిస్తారు. అనంతరం స్వర్ణాభరణాలు. పుష్పమాలలతో అలంకరిచిన తరువాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు, ఈ వ్యూహలక్ష్మి ని దర్శించుకొనే భక్తులకు కోరినన్నికోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఈ వ్యూహాలక్ష్మినే స్వర్ణ లక్ష్మిగా పూజిస్తారు, మహాలక్ష్మి అమ్మవారు మాంగల్యం తో మనకు దర్శనమిస్తారు అందుకే శ్రీవత్సమని అని పిలుస్తారు. మహాలక్ష్మికి అంటే ఈ ప్రతిమకు కూడా శుక్రవారం నాడు స్వామి వారి ఏకాంతంగా శ్రీ సూక్తం గా సుగంధ ద్రవ్యంతో , చందనంతో అభిషేకం జరిపి నూతన వస్త్రాలను ధరింపజేసి స్వామి వారికి మహాలక్ష్మికి ప్రత్యేక ఆరాధనల తరువాత కర్పూర హారతి ఇస్తారు. ఈ విధంగా పూజాలందుకుంటున్న వ్యూహాలక్ష్మిని దర్శించుకున్న భక్తులందరికీ సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment