Tuesday, 12 March 2024

🙏అంతరంగప్రార్థన🙏🏻

 

 


  పరమాత్మా! బ్రహ్మ ముహూర్తంలో నన్ను అజ్ఞాన యుతమైన నిద్ర నుండి లేపుము. అట్టి పవిత్ర సమయమున అంతరంగంలో నిన్నే స్మరించు నిర్మల బుద్ధిని నాకు కలుగజేయుము.🙏🏻

పరమేశ్వరా! పర్వతాల వలె సుఖదుఃఖాలు భయపెట్టినను, చివరి శ్వాస వరకు త్రికరణశుద్ధిగా... నీ ప్రార్ధనలోనే నిలువగల శక్తి సామర్ధ్యాలను నాకు వసగుము.🙏🏻

సర్వేశ్వరా! ప్రతినిత్యమూ భక్త సాంగత్యంలో పాల్గొను భాగ్యాన్ని ఇవ్వు. నాకు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రసాదించు.🙏🏻

సర్వజ్ఞా! ఇంద్రియ భోగాలపైన, బలీయమైన వాంఛలపైన, పరిపూర్ణ విరక్తిని నాకు కలిగించు. నీవు నా హృదయంలో నిరంతరం ప్రకాశిస్తూ... గమనిస్తూ... కొలువై ఉన్నావనే జ్ఞానాన్ని ప్రసాదించు. నీతో మమేకము అగునట్టి పూర్ణ భావాన్ని కలిగించు.🙏🏻

ఈశ్వరా! తెలిసి గానీ, తెలియక గానీ ఏ ప్రాణికి నా వలన హాని జరుగని విధంగా నడుచుకొనునట్లు నన్ను అనుగ్రహించు. ఆత్మ స్తుతి, పరనిందలు అనేడి పాప కూపంలో పడకుండా నన్ను కాపాడు.🙏🏻

ప్రేమైక మూర్తీ!  ప్రేమ, కరుణ, త్యాగం నా హృదయంలో నిరంతరం నిండి ఉండే లాగున నన్ను అనుగ్రహించు.🙏🏻

హే దీనబంధూ!  దేహాభిమానాన్ని, స్వార్ధాన్ని నా నుండి తొలగించు. విషయ సుఖాలు నన్ను బంధించుచున్నవనే జాగృతి నిరంతరం నాలో ఉండేటట్లు కరుణించి నాకు త్రికరణ శుద్ధిని ఇమ్ము.🙏🏻

కరుణాసాగరా!  కీర్తి ప్రతిష్టల మీద, ధన ధాన్య సంపాదన మీద, లౌకిక భోగాలపైన నా చిత్తంలో... కాంక్ష కలుగని రీతిగా దయ చూడు.🙏🏻

సర్వాంతర్యామీ!  ఈ కనబడే ప్రపంచంలో నామరూపాలు అన్నిటియందు నీవే సత్యంగా... ఒక్కటిగా ఉన్నట్లు నాకు గోచరించే లాగున స్ఫురింప జేయుము.🙏🏻

ఓ సదానందా!  సర్వ ప్రాణుల యందు దయ, సాటి మానవుల యందు అకారణమైన సహజ ప్రేమ నాలో పొంగేలా నన్ను అనుగ్రహించు. రాగద్వేష, అసూయలు నాలో పొడసూపనీయకు తండ్రీ...🙏🏻

అచ్యుతా!  దూషణ, భూషణ తిరస్కారాల వలన నా మనసు చలించకుండునట్లు నన్ను అనుగ్రహించు. భక్త బృందంతో ఎల్లకాలము కూడి యుండునట్లు చేయుము.🙏🏻

     భగవంతుని ఇష్ట దైవ రూపంలో గానీ, గురు రూపంలో గానీ ఆరాధించుచున్న నన్ను ఆయా రూపాలతోనే అనుగ్రహించు. అన్ని రూపాలు నీవే కనుక నాలో అభేద భావం కలుగజేయుము తండ్రీ...🙏🏻

పాహిమాం....రక్షమాం..... పాహిమాం ప్రభో.🙏🏻🙏           

             సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం

Ph: 9666602371         -                         

No comments:

Post a Comment