Thursday 21 March 2024

గృహవాస్తు-శుభవాస్తు

 


ధర్మ సందేహాలు - సమాధానాలు

👉ప్రశ్న: వాస్తు పురుషుడు ఎప్పుడు జన్మించాడు ?

  జ. భాద్రపద బహుళ తదియ, మంగళవారము, కృత్తిక నక్షత్రము, వ్యతిపాత యోగము, భద్రనాకరణము గుళికతో కూడిన కాలములో వాస్తు పురుషుడు జన్మించాడు.

👉ప్రశ్న: గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు?

 1. ఈశాన్యం లొ పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.

 2. ఆగ్నేయం లొ అగ్నికి సంబందించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.

 3. నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.

 4. వాయువ్యం లొ స్వతంత్రబిలాష చిహ్నములు .

 5. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.

 6. యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.

 7. కుభేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.

 8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.

👆 ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.

👉 ప్రశ్న: దేవాలయాల వద్ద గృహ నిర్మాణం చేయడం దోషమా ?

జ. శివాలయానికి నూరు బారుల దూరం లొపల, విష్ణువాలయముకు వెనక ఇరవై బారుల దూరం లొపల, శక్తి ఆలయముకు సమీపం లొను గృహనిర్మాణం చేయకూడదు . దీనికి వ్యతిరేఖంగా గృహ నిర్మాణం జరిగితే సఖల సంపదలు నశించి కష్టాలపాలు అవుతారు. గుడి దగ్గర ఉన్న ఇళ్ళకు ఏ వైపునైనా , ఏ మాత్రమైనా గుడి నీడ పడిందంటే దరిద్రం, ప్రాణనష్టం వంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు.

👉  ప్రశ్న: ఎటువంటి స్థలం లొ గృహ నిర్మాణం చేయరాదు .

 1. గోవుల మందలు ఉండే ప్రదేశాలలోనూ .

 2. స్మశాన భూమికి సమీపం లొను .

 3. మలమూత్రాలు విసర్జించు ప్రదేశాలలోను .

 4. ఉప్పు నేలలోను, చవుడు నేలలయందు .

 5. ఎల్లప్పుడు నీటి వుటలు గల ప్రదేశాలలోను .

 6. రాతి భూముల యందు , మిక్కిలి రక్త వర్ణం గల భూమి యందు 

 7. చెరువులను పూడ్చి గృహ నిర్మాణం చేయరాదు అలా చేయడం వలన అనేకములు అయిన పంది జన్మలు ఎత్తి రౌరవాది నరకములు అనుభవించి కష్టాల పాలవుతారు .

👉  ప్రశ్న:  ఏయే గృహాలకి ఎటువంటి శంఖువు ప్రతిష్ట చేయాలి ?

జ. రాతితో కట్టే గృహానికి ఆ రాతితోనే శంఖువు తయారు చేసి శంఖుస్థాపన చేయవలెను . ఇటుకలతో కట్టిన గృహమునకు ఇటుకలతోనే శంఖువు చేసి ప్రతిష్ట చేయవలెను .గోడలు పెట్టక కర్రలతో , నిట్రాట లతో వేయు పాకలకు కర్రతో శంఖువు తయారు చేసి ప్రతిష్ట చేయవలెను . శంఖువును నవరత్న, సువర్ణ, తామ్ర , రజిత నాణేలతో , నవధన్యములతో పూజించి , స్థాపించవలెను . అన్ని రకాల గృహములకు కర్ర శంఖువు ప్రతిష్టించరాదు . కాష్ట శంఖువు భుమిలొ ఎంతకాలం ఉండునో అంతకాలం ఆ గృహం శుబప్రధంగా ఉండును. ఆ తరువాత ఆ గృహములలో నివసించువారికి కష్టాలు కలుగును.కావున కర్రతో చేసిన శంఖువు కంటే రాతితో చేసిన శంఖువు ఉత్తమం అని తెలుస్తుంది.

👉 ప్రశ్న: గృహ నిర్మాణం లొ ఇంటి కిటికీలు, ద్వారాలు ఏ విధంగా అమర్చాలి ?

జ. గృహంలో కిటికీలు, ద్వారములు సమసంఖ్యలో ఉండాలి. వేటికవే విడివిడిగా సమసంఖ్యలొ ఉండాలి. కిటికీలు సరిసంఖ్యలోను , ద్వారాలు సరిసంఖ్యలొను ఉండాలి. అలమారాల గురించి శాస్త్రం లొ ఏమీ చెప్పలేదు. వాటి ఉపయోగాన్ని అనుసరించి సరిసంఖ్యో, బేసి సంఖ్యలొ నో పెట్టుకొవాలి. వాటికి స్థల నిర్ణయం కూడా చెప్పలేదు కిటికీలు , ద్వారాలు సరిసంఖ్యలో ఉన్నా చివరన సున్నా లేకుండా ఉండాలి. అనగా 10,20,30 ఇలా చివరన సున్నా రాకూడదు. అలాగే మొత్తం గృహం లొ ఉన్న ద్వారాలు, కిటికీలు అన్ని లెక్కపెట్టాలి.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment