Sunday, 10 March 2024

ఫాల్గుణమాసం ప్రారంభం :

 


తెలుగు మాసాల్లో చిట్టచివరిది ఫాల్గుణం. ఈమాసం నరసింహస్వామి ఆరాధనకు ప్రత్యేకించినది. అన్ని ప్రసిద్ధ నృసింహ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ పాడ్యమినాడు గుణావాప్తి వ్రతం, తదియనాడు మధూక వ్రతం చేస్తారు. నాలుగోరోజును తిలచతుర్ధి అంటారు. ఆనాడు నువ్వులతో కలిపి వండిన అన్నంతో హోమం చేస్తే సర్వవిఘ్నాలు నశిస్తాయి. ఆనాడు పుత్రగణపతి వ్రతం కూడా ఆచరించాలి. పంచమినాడు అనంతపంచమి వ్రతాన్ని ఆచరించాలి. ఫాల్గుణ శుద్ధ అష్టమి లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. శుక్లపక్షంతో ప్రారంభించి ఫాల్గుణ బహుళ ద్వాదశి వరకు నృసింహారాధన చేయాలి. ఫాల్గుణ పూర్ణిమనాడు హోళీ వస్తుంది. ఆనాడు రాబోయే వసంతానికి స్వాగతం చెబుతూ వసంతోత్సవాలు జరుపుకుంటారు.

ఈ నేపథ్యంలో సంతానాన్ని ఆశించేవారు ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలు పన్నెండు రోజుల పాటు 'పయోవ్రతం' చేస్తుంటారు.

ఇక ఫాల్గుణ శుద్ధ తదియ రోజున 'మధుకతృతీయ వ్రతం' . ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 'పుత్రగణపతి వ్రతం', ఫాల్గుణ శుద్ధ అష్టమి బుధవారం రోజున 'బుధాష్టమీ వ్రతం' ,ఫాల్గుణ శుద్ధ నవమి రోజున సరస్వతీదేవిని ఆరాధిస్తూ 'ఆనంద నవమి వ్రతం' జరుపుతుంటారు.

ఇక ఫాల్గుణ శుద్ధ ఏకాదశినే 'ఆమలక ఏకాదశి' గా పిలుస్తుంటారు. ఈ రోజున ఉసిరిచెట్టు కింద విష్ణుమూర్తిని పూజించడం వలన, ఉపవాస జాగారణాలు చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది. ఇక తన తపస్సుకు భంగం కలిగించిన మన్మథుడుని శివుడు తన మూడో నేత్రంతో భస్మం చేసినది ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజునే. ఈ సందర్భంగా ఈ రోజున 'కామదహనం' జరుపుతారు. ఈ పండుగ చేసే సందడి పట్నాల్లో కన్నా పల్లెల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.

ఆ మర్నాడే అంటే ఫాల్గుణ పౌర్ణమి రోజున 'హోళికా' అనే రాక్షసి సంహారం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'హోలీ'పండుగ జరుపుతుంటారు. ఇలా సంతాన సౌభాగ్యాలను .. విజయాలను కోరుకునే వ్రతాలు, సందడిగా సంతోషాలను పంచే పండుగలతో ఈ మాసం ముందుకుసాగుతూ ఉంటుంది. నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ .. ప్రకృతి పరంగా అందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేస్తూ నిష్క్రమిస్తుంది.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment