Sunday 17 March 2024

శ్రీమద్భాగవతము,

 



"""రాసలీలలోల చిన్ని గోపాల బాలా!,

గోపాలబాలా, రాధికాలోల,

(1) బాలకృష్ణ నీలీల నే నెన్న జాల,

       జాలమేల యశోద బాలగోపాల,   "" రాస"",

( 2 l కరిరాజపాల కరుణాలవాలా,

     కనకాసుచేలా తులసీవనమాలా

                    ‌‌‌‌‌""'రాస"""'

 ( 3 l,తుంబురుగాన లోల శృంగారలీల,

        మునిజనపాల మా మొరవిన వేల,       "" రాస"""

శ్రీశుకులును  పరీక్షీత్తు ""విరహముతో తపిస్తున్న గోపికల గురించి ""ఇలా  ప్రశ్నిస్తున్నాడు.ఓ బాదరాయణపుత్రా!  పరమాత్మ ఏర్పరచిన రాసలీల భగవల్లీలయే కాదనలేము. కానీ గోపకాంతలు కూడ స్వామి చెంతకు భేధభావము లేకుండగ వచ్చారని ఎలా చెప్పగలరు? ఈ నా అనుమానము తీర్చే విధముగ వివరిస్తు దానిలోని ఆధ్యాత్మికతను తెలియచేయమని ప్రార్థించగా,శ్రీ శుకులు ఇలా చెపుతున్నారు.

ఓ రాజా! నీ అమాయకత్వానికి నాకు నవ్వు వస్తున్నది.రాసలీల భగవల్లీల యని గ్రహించిన నీవు స్వామి రాసలీలు ఏర్పాటు చేసినప్పుడు వారి వయస్సు తెలుసుకొన లేకపోతున్నావు. అప్పుడు స్వామి వయస్సు సరిగ్గా పన్నెండు సంవత్సరాలు.ఆపాటి వయస్సు గల బాలుడు ఏపాటి కామలీల సలుపగలడు?, ఇలా స్వామిపై అపనిందలకు కారణము "" కృష్ణస్తు భగవాన్ స్వయం"" అని గ్రహించలేకపోవడమే. పైన స్వామిని గోపికలు కీర్తించిన విధానము గ్రహించావా “”రాసలీలలోల చిన్ని గోపాల బాలా, గోపాల బాలా   రాధికా లోల"" స్వామి చిన్ని కన్నయ్య యని గోపికలకి  పూర్తిగ తెలుసు.

శైశవ దశలో పూతనను సంహరించాడు, శకటాసురిని,వృషభాసుర,శంఖచూడ,కేశిరాక్షసులను స్వామి సంహరించడము గమనించికూడ వారిది భగవత్స్వరూపమని తెలుసుకొన లేకపోవడము అమాయకత్వము.

వెన్నదొంగ అన్నారు. అసలు వారింట వెన్నకేమి కొదువ? వెన్న చోరత్వములో మనము గమనించ వలసినది భక్తి ప్రపత్తులనబడే ఆధ్యాత్మికతను అందించడమే స్వామి లక్ష్యము.అదే "" నవనీతచోరత్వములోని రహస్యము"".

ఇక గోపికలు బౌతికముగ ఏమి కోరి స్వామి చెంతకు వస్తారు? నీ ప్రశ్న వారికి సౌభస అహంకారము ఎందుకు కలిగిందనియే కదా?. కారణమేమిటంటే స్వామి ప్రతిజ్ఞ ""తాను భక్తుని నుండి కొంత స్వీకరించి అదే భక్తునికి కొండంత అర్పిస్తాను"".నిగూఢంగా యున్న వారిలోని  త్రివిధ తాపాలను హరించి వారిని పరమభాగవతులుగ మార్చాడు.దానివల్ల వారికి ప్రాపంచిక వికారాలన్ని మటుమాయమయ్యాయి.

రాసలీల పూర్తికాగానే స్వామి వారందరితో యమునా నదీ ప్రవేశం జరిపి గోపికలతో   """మీరందరు నిరహంకారులు పరమభాగవతులు"" సర్వేంద్రియాలద్వారా మీ ప్రేమను నాపై కురిపించారు.రాసలీలలో నా యందు( స్వామితో కాదు) రమించారు.మీ కందరకు అంతమున నా సాయుజ్యము లభిస్తుందని చెప్పి భగవల్లీల ముగించి అందరిని వారి వారి యిండ్లకు పంపివేసాడు.ఇక్కడ గోపకులు  గోపికలు ఆ రాత్రి తమ యిండ్లలో లేరన్న విషయమే గమనించలేదు. అందుకనే రాసలీల రాత్రి "" బ్రహ్మరాత్రి"" గ   శ్రీధర పండితులు పేర్కొన్నారు.

హరయే నమః శ్రీకృష్ణాయ నమః.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment