Monday, 11 March 2024

శ్రీమద్భాగవతము,

 



""తెంపరివై, పోరింబొరిని దేవకిబిడ్డల జిన్నికుర్రలం,

జంపితి వింక నైన నుపశాంతి వహింపక రాలమీద నో,

ప్పింపగ నిస్సిరో యిదియు బీరమే? నాసరసన్ జనించి నిన్,

జంపెడు వీరు డొక్కదెస సత్కృతి నొందెడువాడు దుర్మతీ! ,"

కంసుడు ఏర్పాటు చేసిన కారాగారములో దేవకీ మాత ప్రసవవేదన పడుతున్నది. పరమాత్మ ఆమె గర్భాన జన్మించబోతున్నాడు.

"" అహో పరమాత్మ జననం అత్యంత ఆనందకరము""

హరయేనమః శ్రీకృష్ణాయనమః.

దేవకి గర్భాన్నుండి బయల్పడిన పరమాత్మ ఒక్కసారిగా తన శిశు రూపాన్ని వీడి , నాలుగు హస్తాలతో  దేవకి వసుదేవులకు దర్శనమివ్వగా ఆనందపరవశులైన ఆ దంపతులతో పరమాత్మా""అమ్మా! నీవు పూర్వ జన్మలో "పృశ్ని" అనే మహాపతివ్రతవు.అప్పటి నీ భర్త సుతపుడే నేటి వసుదేవుడు.

అప్పుడు మీరు కఠినమైన తపస్సు చేసి నన్ను మెప్పించారు. ఆ తపస్సు కారణముగ ఈ మూడవ జన్మలో మీకు పుత్రునిగ జన్మించాను. కానీ కొన్ని దేవరహస్యాల కారణముగ మనకి కొంతకాలము ఎడబాటు తప్పదని చెప్పి తాను  తిరిగి శిశువుగ మారిపోయాడు.

పరమాత్మ ఆదేశాలప్రకారము యమునానది దాటి  వసుదేవుడు ఆ శిశువుని వ్రేపల్లెలో విడిచి అక్కడ యశోద ప్రసవించిన ఆడ శిశువుని తెచ్చి కారాగారములో దేవకి ఒడిలో ఉంచగా , యోగ మాయ వీడగా కంసుడు "అష్టమగర్భము ఆడ శిశువు" అని దేవకీ వసుదేవులు రోదిస్తు చెపుతున్నా వినిపించుకోకుండగ ఆ శిశువును పైకెగరవేసి పట్టుకొని నేలకేసి కొట్టి చంపబోయాడు.అంత ఆ శిశువు ఆకాశములోకి ఎగిరి జగన్మాత రూపములో కంసునితో పై విధముగ హెచ్చరిస్తున్నది.

ఓరీ కంసా! ఎంత దుర్మార్గుడవు. నీ సొంత చెల్లెలు సంతానాన్ని సంహరించావు.శాంతి లేక అలమటిస్తు ఇప్పుడు పసిబిడ్డనైన నన్ను రాతిమీద కొట్డి చంపబోయావు.ఇదేనా నీ వీరత్వము? నాతో బాటుగ మరియొకడు నిన్న సంహరించడానికి ఇంకొక చోట పుట్డి పెరుగుతున్నాడని హెచ్చరించి జగన్మాత మాయమైపోయింది.

అక్కడ వ్ర్రేపల్లెలో  యశోదకు మగ శిశువు  జన్మించాడని వేడుకలు రంగరంగ వైభవముగ జరగుతున్నాయి.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment