Friday, 8 March 2024

కుండలేశ్వరం

 


కాశీ వెళ్ళడం కంటే ముందు వెళ్లి తీరవలసిన క్షేత్రం ఒకటి ఉంది . దాని పేరు కుండలేశ్వరం . తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన ఆ క్షేత్రం ఉంది . అక్కడ గోదావరి నదిని వృద్ధ గౌతమి అని పిలుస్తారు . ఆ నదిలో స్నానం చేసి , కుండలేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుని ఆ తరువాత కాశీ వెళ్లాలి . ఎందుకంటే కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ గంగలో స్నానం చేస్తారు . అప్పుడు గంగానది మనం చేసిన పాపాలు తాను స్వీకరించి మనల్ని పుణ్యాత్ములను చేస్తుంది . ఇలా ప్రతిరోజూ ఉదయం అందరి వద్దా పాపాలు స్వీకరించి తెల్లని రాజహంస లాంటి గంగానది సాయంత్రానికి నల్లని కాకి లాగ మారిపోతుంది . ఆ పాపభారం మోయడం గంగమ్మ తల్లికి చాలా కష్టం . కనుక ఎవరైనా పాపం చెయ్యని వారు వచ్చి స్నానం చేస్తే , వారు తనను కలుషితం చేయని కారణంగా గంగాదేవి చాలా సంతోషించి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుందట . కాశీ అయినా , హరిద్వార్ అయినా ఎక్కడ గంగా స్నానం చేస్తామో అక్కడకు వెళ్లే ముందు కుండలేశ్వరం వెళ్లి గోదావరి స్నానం చేసి కుండలేశ్వర స్వామిని ( ఈశ్వరుడు ) అర్చించుకుని ఆ తర్వాత ఆయా పుణ్య క్షేత్రాలకు వెళ్లాలి . 

ఏమిటీ కుండలేశ్వరం కధ ? ఈ క్షేత్రంలో ప్రవహించే గోదావరి నదికి వ్యాస మహర్షి ఒక వరం ఇచ్చాడు . పార్వతీదేవి ఆజ్ఞ మేరకు వ్యాస మహర్షి కాశీని వదిలిపెట్టి , విశ్వేశ్వరుని దర్శించుకోలేని దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం అనేక క్షేత్రాలు దర్శించుకుంటున్న తరుణంలో ఈ కుండలేశ్వరం వచ్చాడు . దక్షయజ్ఞం తరువాత యోగాగ్నిలో దగ్ధమైన సతీదేవి చెవి కుండలం పడిన ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసి కుండలేశ్వర స్వామిని దర్శించి ఆయన కాశీ విశ్వనాథుని దర్శించుకున్న అనుభూతిని పొందాడు . అప్పుడు ఆయన ఇక్కడ ప్రవహించే గోదావరి నదికి ఒక అపురూపమైన వరం ఇచ్చాడు . భారత దేశంలో ప్రవహించే ప్రతి ఒక్క నదికీ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి . ఆ పుష్కరాల సమయంలో నదీ స్నానం చేసిన వారు పాపవిముక్తులౌతారు . అయితే ఈ కుండలేశ్వర క్షేత్రంలో ప్రవహించే గోదావరి పాయకు మాత్రం ( వృద్ధ గౌతమి ) ప్రతిరోజూ పుష్కరాలే అని వ్యాస మహర్షి వరం ఇచ్చాడు . కనుక ఆ రోజు ఈరోజు అని లేకుండా ఏ రోజైనా ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసిన వారికి పుష్కరస్నాన ఫలం వలన పాప విముక్తులవుతారు . ఆ తరువాత వారు కాశీ హరిద్వార్ వంటి గంగా తీరంలో ఉన్న క్షేత్రాలు దర్శించుకుంటే గంగానది యొక్క అనుగ్రహం వలన కోరుకునే ఒక కోరిక గంగానది తీరుస్తుంది అని పురాణ కథనం .

బస్సులో కానీ ,రైలులో కానీ , విమానంలో కానీ రాజమండ్రి చేరుకున్న తర్వాత , టాక్సీలో ఈ కుండలేశ్వరం వెళ్లవచ్చు . లేదా రాజమండ్రి నుంచి బస్సులో అమలాపురం వెళ్లి అక్కడ నుంచి ఆటోలో ఈ కుండలేశ్వరం వెళ్లవచ్చు . అమలాపురం నుండి కుండలేశ్వరం బస్సు కూడా ఉంటుంది కానీ అది పల్లెవెలుగు బస్సు . బస చేయాలంటే అమలాపురం లేదా రాజమండ్రిలో హోటల్ బుక్ చేసుకోవాలి . కుండలేశ్వరం చేరుకుని గోదావరి స్నానం చేసి కుండలం ఆకారంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేసుకోవచ్చు . రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయం కూడా శివాలయ ప్రాంగణంలో ఉన్నది . 

 వ్యాస పురాణం లోనూ , కాశీ ఖండం లోనూ ఈ కుండలేశ్వరం గూర్చి ప్రస్తావన ఉంది

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment