Sunday 17 March 2024

ఈ రోజుటి రాశిఫలాలు

 

  


18 మార్చి 2024

సోమవారము MARCH 18

మేషం🐐

అశ్వని1,2,3,4,(చూ,చే,చో,లా)భరణి 1,2,3,4,(లీ,లూ,లే,లో) కృతిక 1,(ఆ)

 ఆదాయం నిరాశ కలిగించవచ్చు.  ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది.  వాహనాల విషయంలో జాగ్రత్త వహించండి.  కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు.  బంధువుల నుంచి విమర్శలు.  వ్యాపార లావాదేవీలు కాస్త మందగిస్తాయి.  ఉద్యోగులకు పనిభారం.

వృషభం🐂

కృతిక 2,3,4(ఈ,ఊ,ఏ),రోహిణి1,2,3,4(ఓ,వా,వీ,వూ) , మృగశిర1,2,(వే,వో)

చికాకులు.  మానసిక అశాంతి.  ఆరోగ్యం మందగిస్తుంది.  విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి.  కార్యక్రమాలలో ఆటంకాలు.  దూర ప్రయాణాలు సంభవం.  రాబడి నిరుత్సాహ

పరుస్తుంది.  ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి.  వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

 మిథునం👩‍❤️‍👨

మృగశిర 3,4 (కా,కి), ఆరుద్ర 1,2,3,4(కు, ఘ, ఙ, ఛ) పున్వరసు1,2,3(కే,కో, హా)

ఆదాయం అంతగా కనిపించింది.  ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.  కుటుంబ సభ్యులతో విభేదాలు.  శారీరక రుగ్మతలు.  వివాదాలకు దూరంగా ఉండండి.  శ్రమ పెరుగుతుంది.  వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.  ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు.

కర్కాటకం🦀

పున్వరసు 4(హి),పుష్యమి1,2,3,4(హు,హే,హో,డా) అశ్లేష 1,2,3,4 (డీ, డు, డే, డో)

దూర ప్రయాణాలు.  పనులు మందగిస్తాయి.  ఆలోచనలు స్థిరంగా ఉండవు.  బంధుగణంతో విరోధాలు నెలకొంటాయి.  మిత్రులు విమర్శలతో కలత చెందుతారు.  కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి.  వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.  ఉద్యోగులకు మార్పులు

సంభవం.

సింహం🦁

మఘ 1,2,3,4(మ, మి, ము, మే), పుబ్భ 1,2,3,4 (మో, ట, టి, టు) ఉత్తర1 (టె),

 మీరు మీ న్యాయమైన వాటా కంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నారు.  మిమ్మల్ని మీరు చాలా నిష్ఫలంగా మారనివ్వవద్దు.  మీరు ప్రతి సమస్యను క్రమక్రమంగా ఎదుర్కొన్నప్పుడు, మీ పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీరు మళ్లీ ఈవెంట్‌ల నియంత్రణలో ఉన్నట్లు భావిస్తారు.  మీరు వెంటనే చర్య తీసుకోవడం ముఖ్యం.  లేదంటే మరిన్ని సమస్యలు వస్తాయి.  ఇతరులు సహాయం అందిస్తే, వారి సహాయాన్ని అంగీకరించడానికి బయపడకండి.

కన్య🙎‍♀️

ఉత్తర2,3,4(టొ, ప, పి), హస్త 1,2,3,4 (పు,షం,ణ, ఠ) చిత్త 1,2(పె, పొ)

వివాదాలను నివారించడానికి జాగ్రత్త వహించండి, వెనక్కి తగ్గండి మరియు ఉత్తమమైన విధానాన్ని పరిగణించండి.  లేకపోతే, మీరు అనుకోకుండా ఏదైనా చెప్పవచ్చు లేదా చేయవచ్చు, మీరు తర్వాత పశ్చాత్తాపపడవచ్చు, సరిగ్గా ఉంచడం కష్టం.  మీరు చాలా సాధించగలరని మీరు నమ్ముతారు, కానీ మీరు ఈ కష్టమైన భావాలను నియంత్రించాలి, లేకుంటే మీరు అర్ధంలేని వాదనలలో పాల్గొంటారు

తుల⚖️

చిత్త 3,4 (ర,రి), స్వాతి 1,2,3,4(రు, రె, రో,త), విశాఖ1,2,3, (తి, తు, తే)

ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు.

ఇంటాబయటా లేనిపోని విమర్శలు ఎదురవుతాయి.

 మంచికి వెళ్లడం కూడా పొరపాటేనని గ్రహిస్తారు.ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు.

భార్యాభర్తల మధ్య అకారణంగా విభేదాలు.

ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు.

వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సమస్యలు పెరుగుతాయి.

ఉద్యోగులకు గందరగోళ పరిస్థితి.

రాజకీయవేత్తల వారికి కొంత పరీక్షాకాలం ఉంటుంది.

మహిళలకు కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు.

వృశ్చికం🦂

విశాఖ 4(తో), అనురాధ 1,2,3,4 (న, ని,ను, నే),

జ్యేష్ఠ 1,2,3,4,(నో, య, యి, యు)

కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు.

ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగే సమయం.

చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.

 పలుకుబడి కలిగిన వారి పరిచయాలు సహకరిస్తాయి.

వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొంటారు. వ్యాపార లావాదేవీలపై కొత్త ఆశలు.

ఉద్యోగులకు విధుల్లో మరింత ప్రగతి.

విద్యార్థులకు విద్యావకాశాలు పెరుగుతాయి.

ధనుస్సు🏹

మూల1,2,3,4,(యె,యో, బ,బి)పూర్వాషాడ1,2,3, 4

(బు, ధ, భ, ఢ) ఉత్తరాషాడ 1(బె)

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.  విలువైన వస్తువులు సేకరిస్తారు.  చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవార్తలు.  కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.  వాహనాలు, ఆభరణాలు కొంటారు.  వ్యాపారాలలో లాభాలు అందుతాయి.  ఉద్యోగులకు ఉన్నత స్థితి.

మకరం🐊

ఉత్తరషాఢ 2,3,4,( బో, జ, జి)శ్రవణం 1,2,3,4,

(జు, జే, జో, ఖ)ధనిష్ట 1,2(,గ, గి)

అయినవారి నుంచి శుభవార్తలు.  ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.  కార్యక్రమాలు పూర్తి చేస్తారు.  ఆత్మీయులతో చర్చలు జరుపుతారు.  వివాహ యత్నాలు అనుకూలిస్తాయి.  కాంట్రాక్టులు లభిస్తాయి.  వ్యాపారాలలో లాభాలు తథ్యం.  ఉద్యోగ వర్గాలకు పదోన్నతి సూచనలు.

కుంభం⚱️

ధనిష్ట 3,4 (గు, గె), శతభిషం 1,2,3,4(గొ, స, సి, సు)

పూ||భా||1,2,3(సె, సో, ద),

రాబడి తగ్గి నిరుత్సాహపడతారు.  ఆకస్మిక ప్రయాణాలు.  బంధుమిత్రుల నుంచి అపవాదులు.  ఇంటాబయట ఒత్తిడులు.  కాంట్రాక్టులు చేజారతాయి  ఆలోచనలు నిలకడగా ఉండవు.  వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.  ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.

మీనం🐟

పూ||భాధ్ర||4,(ది) ఉ||భా||1,2,3,4 (దు, శం, ఝ, థ),

రేవతి1,2,3,4, (దే, దో, చ, చి)

ఆదాయం అంతగా ఉండదు.  బంధువర్గంతో విభేదాలు ఎదురవుతాయి.  ఎంత కష్టపడినా ఫలితం అంతగా కనిపించదు.  దూర ప్రయాణాలు ఉంటాయి.  శారీరక రుగ్మతలు.  వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది.  ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment