Monday, 18 March 2024

రామాయణమ్. 26

 



త్రిశంకువు ఇక్ష్వాకు వంశపు రాజు ! ఆయనకు తన శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనే కోరిక కలిగింది .ఆ కోరిక తీర్చటానికి యజ్ఞం చేయమని కులగురువు వశిష్ట మహర్షిని ఆశ్రయిస్తాడు!
అందుకు ఆయన నిరాకరించి ఇది సాధ్యమయ్యే పనికాదు అని చెప్పిపంపుతాడు .
.
త్రిశంకువు వశిష్టుడి కుమారులవద్దకు వెళ్ళి మీతండ్రి నిరాకరించగా వేరే మార్గము కానరాక మీ వద్దకు వచ్చాను నన్ను బొందితో స్వర్గానికి పంపండి అని అడుగుతాడు అందుకు వారు కూడా నిరాకరించి కులగురువు మాట పాటించని నీకు భయంకరమైన ,జుగుప్సాకరమైన రూపం కలుగుగాక అని శపిస్తారు..
.
ఆ రూపాన్నిచూసి బెదిరిపోయి అప్పటివరకు ఆయనను అంటి పెట్టుకున్న మంత్రి,సామంత,పురోహితులు,అందరూ దూరమవుతారు.
.
అప్పుడు ఆయనకు విశ్వామిత్ర రాజర్షి మదిలో మెదిలి ఆయనను ఆశ్రయించి వశిష్టుడు తనను ఎలా నిరాదరించింది,ఆయన పుత్రులు ఏవిధంగా శపించింది తెలియచెప్పి ఆయన చేయలేని పని నీవు చేయగలవు అని నీవద్దకు వచ్చాను. నన్ను సశరీరంగా స్వర్గానికి పంపగలవా! అని తన కోరిక వెలిబుచ్చాడు.
.
తన శత్రువు వశిష్టుడు నిరాకరించాడు కాబట్టి తాను చేయాలి అనే భావన తో సకల మునిగణాలనూ బెదిరించి తన ఆశ్రమానికి పిలిపించి యజ్ఞానికి శ్రీకారం చుట్టాడు. ఈయన బెదిరింపులకు లొంగని వశిష్ట పుత్రులను శపించి నాశనం చేస్తాడు .అంత నష్టపరచినా వశిష్టుడు శాంతంగానే ఉంటాడు.
.
యజ్ఞపరిసమాప్తి రోజు త్రిశంకువును శరీరంతో స్వర్గానికి పంపితే ఇంద్రుడు నిరాకరించి ఆతనిని స్వర్గం నుండి పడదోయగా త్రిశంకువు గింగరాలు తిరుగుతూ భూమిని సమీపిస్తూ కాపాడమని కేకలు వేస్తాడు.
.
తన దండం ఎత్తిపట్టి ఆతనని ఆకాశంలో ఉన్నచోటునే నిల్పి తీవ్రమైన కోపంతో భూమికి దక్షిణదిక్కుగా ఇంకొక స్వర్గాన్ని,ఇంకొక ఇంద్రుడిని ,గ్రహ తారక లను సృష్టించబూని మొదట కొన్ని గ్రహతారకలను సృష్టిస్తాడు .
.
ఈయన తలపెట్టిన కార్యంచూసి దేవతలు పరుగుపరుగున వచ్చి శాంతపరచి త్రిశంకువు చిరకాలం అలాగే తలక్రిందులుగా రోదసిలో ధృవముగా ఉండేటట్లు అనుగ్రహించి వెళ్ళిపోతారు.
.
తను తపఃశక్తి ఎంత నష్టపోయాడో గ్రహింపుకొచ్చిన ఆయన మరల తపస్సు మొదలుపెట్టి ఒకవేయిసంవత్సరములు చేస్తాడు అప్పుడు బ్రహ్మ, నీవు ఋషివయినావు అంటాడు ,మరల ఏవో భావావేశాలకు లోనయి తన తపస్సును పాడు చేసుకుంటాడు.
మరల కధమొదటికొచ్చింది తిరిగి తపస్సుచేస్తాడు ఈసారి బ్రహ్మగారు నీవు మహర్షివయినావు అంటాడు . తను చేరుకోవలసిన గమ్యం చాలా దూరమున్నది అనిగ్రహించిన ఆయన మరల తపస్సుకు కూర్చుంటాడు.
.
ఈయన తపస్సువలన తనపదవికి ఎక్కడ మూడుతుందో అని భయపడి ఇంద్రుడు మేనకను పంపిస్తాడు .మేనక అందానికి వశుడవుతాడు విశ్వామిత్రుడు! పదివేల సంవత్సరాలు సర్వం మరచి ఆవిడే లోకంగా బ్రతుకు తాడు .తను దారి తప్పిన విషయం ఒకరోజు అన్నిసంవత్సరాల తరువాత హఠాత్తుగా గుర్తుకు వస్తుంది ఆయనకు ! 
.
మేనకను పంపివేసి మరల తపస్సు మొదలు పెడతాడు విశ్వామిత్రుడు.
.
N.B
ఇప్పటిదాక అయిన విశ్వామిత్ర చరిత్ర మనకు చెపుతున్నదేమిటి?
1). మనిషికి భావావేశం కలిగినప్పటికీ వాటిని తన అదుపులో ఉంచుకోగల సమర్ధత కలిగి వుండాలి.భావావేశం అదుపులో ఉంచుకోవడం అంత తేలికేం కాదు . అందుకు నిరంతర సాధన కావాలి . అదే తపస్సు! 
 విశ్వమిత్రుడిలో మదం,ఆతరువాత కోపం ,ఆతరువాత అసూయ ,అహంకారం ,కామం ....ఇలాంటి గుణాలన్నీ ప్రకటితమయి తానేం నష్టపోతున్నాడో వాటివల్ల గ్రహింపుకొచ్చి మరలమరల తపస్సు చేయసాగాడు! .అంటే ప్రతిసారి 
Self Introspection...,Reconciliation ..చేసుకొని తనను తాను మెరుగు పరచుకొంటున్నాడు. ఇదే ప్రతిమనిషికి కావలసినది!

.2) మన విశ్వానికి ఆవల ఎన్నో విశ్వాలున్నవి అని నేటి శాస్త్ర వేత్తలు మొన్నమొన్ననే కనుక్కున్నట్లుగా చెపుతున్నారు.

.కానీ మన విశ్వానికి ఆవల ఇంకొక విశ్వముండవచ్చు అనే భావన భారతీయులకు రామాయణం కాలం నాటికే ఉన్నది అని త్రిశంకువు కధచెపుతున్నది ...ఇదీ భారతీయమంటే!

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

.

No comments:

Post a Comment