Wednesday 20 March 2024

సామెతలు

 

మన సామెతలు

                  



 సామెతలు మన తెలుగు భాషకు ఒక ప్రత్యేకమైన వరం .ఇవి ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు.

అ ఆలు రావు గాని అగ్రతాంబూలం కావాలట .

అండలు ఉంటే కొండలు దాటవచ్చు .

అంతా తెలిసిన వాడు లేడు. ఏమీ తెలియని వాడు లేడు.

అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు.

అందని మాని పండ్లకు అర్రులు సాచినట్లు!

అందరిని మెప్పించడం కాని పని!

అందరూ అందలం ఎక్కితే మోసే వారెవరురా?

అక్క చెల్లెళ్లకు అన్నం పెట్టి లెక్క వ్రాసినట్లు.

అక్కరకు రాని చుట్టము ఎందుకు?

అవసరానికి ఆదుకునే వాడే అయినవాడు.

అగ్గి చూపితే వెన్న అడక్కుండా కరుగుతుంది.

అచ్చు వచ్చిన భూమి అడుగైనా చాలు.

అచ్చోసిన ఆబోతు లాగా!

అటుకులు బొక్కే నోరు ఆడిపోసుకునే నోరు ఊరుకోవు.

అడిగితే చిరాకు అడగకపోతే పరాకు

అడిగే వాడికి చెప్పేవాడు లోకువ

అడుక్కునే తినే వాళ్లకు అరవై ఊళ్ళు

అడుసు తొక్కనేల కాళ్లు కడగనేల?

అతికించిన కోరమీసం అట్టే నిలుస్తుందా?

అతి వినయం ధూర్త లక్షణం

అదృష్టం పండితే ఆరు నూరు అవుతాయి

అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాక్కెళ్ళిందట

అదృష్టం చెప్పి రాదు దురదృష్టం చెప్పి పోదు

అద్దెకు వచ్చిన గుర్రాలు అగడ్తలు దాటుతాయా?

అనగా అనగా రాగం తినగా తినగా రోగం

అనువు గాని చోట అధికులమనరాదు

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment