🌿వినాయకుడు, తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించుటయే కాకుండా, సరైన మార్గంలో పయనించుటకు మార్గ నిర్దేశం చేయగలడని భక్తుల ప్రఘాడ విశ్వాసం
🌸అటువంటి వినాయకుని పుట్టిన రోజైన భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి పండుగగా అందరూ జరుపుకుంటారు.
🌿గణపతికి సిద్ధి, బుద్ధి అనే భార్యలు, క్షేముడు, లాభుడు అనే కుమారులు ఉన్నట్లు కథనాలున్నాయి. ఇక్కడ భార్యలంటే శక్తులు, పుత్రులంటే ఆ శక్తిద్వారా ఉత్పన్నమయ్యే ఫలాలని భావం.
🌸పనిలో కౌశలం బుద్ధి, దానితో సిద్ధించేది సిద్ధి. వీటితో పొందే ఫలాలు క్షేమం, లాభం. ఇలా అర్థం చేసుకున్నప్పుడు బ్రహ్మచారి అయిన గణపతి భార్యాబిడ్డల వెనుక ఉన్న తత్త్వం బోధపడుతుంది.
🌹ఆకాశస్యధిపో విష్ణుః అగ్నిశ్చైవ మహేశ్వరః
వాయో సూర్యః క్షితిరీశః జలరూపో వినాయకః🌹
🌿ఆయా పండుగల్లో దేవుళ్లకు ఉన్న మూర్తుల్ని పూజించడమే తప్ప విగ్రహాన్ని రూపొందించడం ఉండదు. ఆ సంప్రదాయం వినాయక చవితిలోనే ఉంది.
🌸శాస్త్రప్రకారం చెరువు మట్టితో 9 అంగుళాలకు మించని విగ్రహం చేసుకోవాలి. 9 రోజుల పూజ ముగిశాక మట్టిని తెచ్చినచోటే నిమజ్జనం చేయాలి. దీని వెనుక భౌతిక, తాత్త్విక రహస్యాలున్నాయి. వర్షాకాలంలో గ్రామవాసులంతా చెరువు నుంచి మట్టి తీయడంవల్ల పూడిక తీసినట్లవుతుంది.
🌿ఇది భౌతిక లాభం. అలాగే భగవంతుడు తయారుచేసిన ఈ శరీరం కూడా ఉన్నన్ని రోజులు ఎంత వైభోగం అనుభవించినా పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే తప్ప శాశ్వతం కాదన్న సత్యం బోధపడుతుంది.
🌸గణపతి జలరూపానికి ప్రతినిధి కనుక నీళ్లలో లయం చేయడాన వచ్చిన చోటుకే చేరుకుంటారనేది తాత్త్వికార్థం. ఔషధ గుణాలున్న పత్రిని పూజానంతరం నీటిలో కలపడంవల్ల వర్షాకాలం నీటిలో చేరిన సూక్ష్మక్రిములు నశిస్తాయి...
🌿అందుచేతనే ఒక్క వినాయకుని పూజిస్తే అన్నిటా విజయములు సొంతమవుతాయని భక్తుల ప్రఘాడ విశ్వాసముగా ఉంది.
🌸తద్వారా ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా, మొదట వినాయకుని పూజ చేయడం హిందువుల ఆనవాయితీగా ఉంది, తద్వారా ఎటువంటి ఆటంకములూ లేకుండా పనులు పూర్తవుతాయని భక్తుల నమ్మకం
No comments:
Post a Comment