Monday, 18 March 2024

ధర్మవీర్ శంభాజీ మహారాజ్ 334 ఆరాధన నేడు.

 


ఈ వ్యాసం చదివి భరత దేశం లో పుట్టినందుకు గర్విస్తావు

🙏జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న మాటకు రూపమై 32 సంవత్సరాల స్వల్పవయసులో కంటిముందు చావును సగర్వంగా ఆహ్వానించిన యోధుడు, తన స్వధర్మమైన హిందుత్వం కోసం 40 రోజులు పాటు చిత్రహింసలు అనుభవించి ప్రాణాలు వదిలిన ధీరుడు,ఛత్రపతి శివాజీ మహారాజ్ మాతృమూర్తి  జిజియా జీ మనుమడు, గొప్ప యోధుడు, మహాపరాక్రమసాలి, పరమ ప్రతాపి, ఛత్రపతి శివాజీ మహారాజ్ పుత్రుడు ధర్మవీర్ శంభాజీ మహారాజ్ 334 ఆరాధన నేడు.

♦️కేవలం 13 సంవత్సరాల వయస్సు గల బాలుడు 13 భాషలను నేర్చుకున్నాడు. (బుధభూషణ్, నాయికా భేద లాంటి ౩ సంస్కృత గ్రంథాలు రచించాడు.. బ్రిజ్-మరాఠీ పదకోశము అనే హిందీ - మరాఠీ నిఘంటువు రచించాడు.) అదే సమయంలో యుద్ధ విద్యలో మంచి ప్రావీణ్యం కలిగి శాస్త్రము మరియు శస్త్ర విద్యలలో బుద్ధి మరియు బలం కలిగిన గొప్ప యోధుడుగా మారాడు

♦️9 సంవత్సరాల బాలుడు తన తండ్రితో గుర్రం పై కూర్చుని 1250 (కీ.మీ) దూరం ప్రయాణించి ఆగ్రాకి చేరుకున్నాడు.

♦️కేవలం 16 సంవత్సరాల యువకుడు రాంనగర్ లో తన మొదటి యుద్ధంలో గెలిచాడు.

♦️శంభాజీ మహారాజ్ ఉజ్జయిని కిచెందిన కవికలశ్ అనే కవి ని ముఖ్య  సలహాదారుడు.ఒక వైపు తన తండ్రి శివాజీ మహారాజు ఎప్పుడు యుద్ధాలలో ఉండగా మరోవైపు 19 సంవత్సరాల వయసుగల శంభాజీ మహారాజు రాయగడ కోట వ్యవహారాలన్నీ తానే చూసుకోవడం మొదలుపెట్టాడు

♦️9 సంవత్సరాల కాలం పాటు 210 యుద్ధాలు చేసి ప్రతి ఒక్క యుద్ధాన్ని గెలిచిన గొప్ప యోధుడు శంభాజీ మహరాజ్.ఔరంగజేబు దక్కన్ రాజ్యాలపై దండయాత్రలో భాగంగా 8 లక్షల సైన్యంతో బయల్దేరాడు అప్పుడు కేవలం 20 వేల మరాఠా సైన్యంతో 9 సంవత్సరాల పాటు  యుద్ధాలు జరగగాయి  (ఇదే సమయంలో ఉత్తరాన రాజస్థాన్, బుందేల్ ఖండ్, పంజాబ్ లో మళ్లీ స్వదేశ బీజాలు నాటుకున్నాయి.)

♦️శంభాజీ మహారాజుని ఓడించలేక విసిగిపోయిన ఔరంగాజేబు ముఖాముఖి యుద్ధం చేసి జయించ లేనని తెలుసుకుని శంభాజీ మహారాజు బావమరిది అయిన గణోజి శిర్కే  తో చేతులు కలిపాడు.

♦️గణోజీ శిర్కే ధాభోళ్ పట్టణం జాగీరు కావాలని శంభాజీని కోరతాడు స్వరాజ్య పోరాటంలో తిండీ నిద్రలేక  ఒంటరి పోరాటం చేస్తున్న శంభాజీ. షిర్కే అభ్యర్థనను పట్టించుకోకపోవటంతో శిర్కే మొఘలులను ఆశ్రయించటం మన హిందువుల దురదృష్టం, వారు శంభాజీ కీ ప్రాణహాని చేయమని, నీ జాగీరు ఇచ్చే విధంగా శంభాజీని ఒప్పిస్తామని చెప్ఫిన మొఘలుల మాటలు గణోజీ శిర్కే గుడ్డిగా నమ్మటంతో స్వరాజ్య నాశనానికి తెరలేచింది.

♦️శంభాజీ మహారాజ్ మరియు కవి కలశ్  కలిసి రహస్య సమావేశం కోసం సంగమేశ్వర్ కు వెళ్లగా గణోజి షిర్కే ఈ సమాచారాన్ని ఔరంగజేబు సైన్య అధికారికి  చేరవేసాడు.

♦️8 లక్షల సైన్యంతో కూడా శంభాజీ మహారాజును ఓడించలేని ఔరంగజేబు కేవలం 2 వేల సైన్యంతో బంధించగలిగాడు, అలా బంధించిన శంభాజీ మహారాజు, కవి కలశ్ లను తలక్రిందులుగా ఒంటెలకి కట్టి ఈడ్చుకుపోయి చెరసాలలో  బందీలను చేశారు

♦️అప్పుడు ఔరంగజేబు మూడు షరతులు పెట్టాడు.

♦️మరాఠా రాజ్యంలోని 120 కోటలలో 80 మాకు అప్పగించు.

♦️నువ్వు దాచి ఉంచిన ధనాన్ని , నీకు సహకరించిన వాళ్లని నాకు అప్పగించు.

♦️ నీ ధర్మాన్ని విడిచిపెట్టు.ఇస్లాం ను స్వీకరించు.

ఈ మూడు షరతులకు ఒప్పుకుంటే నువ్వు జీవించి  ఉంటావు మరియు నీ బలాన్ని పెంచుకుని ఉండొచ్చు అని చెప్పాడు.

♦️అప్పుడు శంభాజీ మహారాజ్ ఇలా అన్నాడు/ నా ధర్మాన్ని బలిదానం చేయను, నన్ను వెయ్యిసార్లు చంపినా మళ్లీ నా ధర్మంలోనే జన్మిస్తాను అని చెప్పి అన్నపానాలు మానేసారు.

♦️తరువాత ఎన్నో చిత్రహింసలు చేస్తూ గోర్లను పీకేస్తూ, కళ్లల్లో నిప్పుల కడ్డీలు గుచ్చి, వేళ్ళు నరికేస్తూ, చర్మాన్ని కోస్తూ  నరకయాతన చూపించినా మమ్మల్ని విడిచి పెట్టండి అని అనకుండా ధర్మ రక్షణకు పాటుపడ్డారు.

♦️ఇలా 40 రోజులు చిత్రవధ చేసి చివరికి దేహాన్ని ముక్కలుగా నరికి వధు గ్రామ సమీపంలో భీమా నదిలో పారేస్తారు.

♦️వధు గ్రామస్థులు నదిలోకి దిగి శంభాజీ శరీర ఖండాలను వెదికి దొరికిన వాటిని అతికించి ఘనంగా అంతిమసంస్కారాలు జరిపించారు.

♦️ఈ రోజుకీ లక్షలాది మంది పాల్గొనే  పంఢర్ పూర్ 21 రోజుల వార్ కరీ యాత్ర, తుకారాం మహారాజ్ గ్రామం (దేహూ) నుంచి ఆళ్లంది  జ్ఞానేశ్వర్ మహారాజ్ సమాధి నుండి పండరీపూర్ వరకు కొనసాగే దిండి ని  ప్రారంభించింది శంభాజీ మహరాజే.

♦️పోర్చుగీసు వారిని మట్టి కరిపించి గోవాలో మత మార్పిడిలను అడ్డుకున్నాడు

♦️మొఘలుల ద్వారా మతం మార్చబడ్డ హిందువులను తిరిగి హిందూ ధర్మంలోకి మొట్టమొదట  ఘర్వాపసీ ద్వారా  తీసుకు వచ్చిన హిందూ ధర్మ సంస్కర్త.

♦️దేశాన్ని నాశనం చేసిన వాళ్ల సమాధులు కొన్ని ఎకరాలలో ఉన్నాయి కానీ వలసదారుల దుర్మార్గాల నుండి దురాక్రమణల నుండి ధర్మం కోసం పోరాడిన వీర మరణం పొందిన (శంభాజీ, కవి కలశ్ లాంటి వాళ్ల) సమాధులు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి.

♦️ఈ రోజు హైందవుల జనాభా ఇంకా మిగిలి ఉందీ అంటే దేశభక్తులైన రాజపుత్ర వీరులు ఘజనీ, ఘోరీ, ఖిల్జీలతో మొఘలులతో పోరాడి అలశిపోయిన తరుణంలో.సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ప్రతిధ్వనించిన హిందూ శంఖారావమే ఛత్రపతి మరాఠా వీరుల స్వరాజ్య నాదం.

♦️మన చరిత్రను విదేశీ పాలకులు వక్రీకరించి మనల్ని నిర్వీర్యులను చేశారు, ఇకనైనా మన ఇండ్లలో ఛత్రపతి శివాజి, ధర్మవీర్ శంభాజీల పటాలను సగర్వంగా పెట్టుకుందాం.

♦️ఈ సందర్భంలో మరో గొప్ప వీరుని గురించి చెప్పుకోవాలి.

ఆయనే♦️ సంతాజీ ఘోర్ పడే

5000 మరాఠా సైనికులకు.

కమాండర్...

శంభాజీ మరణించిన రోజున కొద్దిమంది బలగం తో ఔరంగ జేబు విడిదిమీద దాడి చేశి దొరికిన వారిని దొరికినట్లు ఊచకోత కోశాడు అంతటి అవేశం లో కూడా ఆడవాళ్ళను గౌరవించే భారతీయ హిందూ సంస్కృతి ఔరంగజేబు ప్రాణం కాపాడింది.

ఔరంగజేబు ప్రాణ భయంతో తన కూతురు

జేబుర్ ఉన్నిస డేరాలొ దాక్కుని ప్రాణాలతో బయటపడ్డాడు.

♦️చరిత్రను మరచిన వాడు చరిత్ర సృష్టించలేడు..!

♦️చరిత్ర సృష్టించేవాడూ చరిత్రను మరువలేడు...!!

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment