Sunday 17 March 2024

సోమవారం శివుడ్ని ఇలా పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి🙏

 


శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు.

అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి.

ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనకున్న దారిద్ర్యము, సమస్యలు పోవాలంటే శివుడిని ఈవిధంగా పూజించాలి.

1. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీపరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు సమర్పించుకోవాలి. తుమ్మి పూలు అత్యంత శ్రేష్ఠం. బిల్వ దళాలతో శివాష్టోత్తరం పఠిస్తూ అర్చించాలి. తరువాత మృత్యుంజయ స్తోత్రం పఠిస్తూ విభూదిని సమర్పించాలి, ఆ విభూతిని మృత్యుంజయ మహామంత్రం పఠిస్తూ నుదుటిన ధరించాలి. మహాదేవుని విభూతే మహా ఐశ్వర్య ప్రదాయకం.

2. పూజానంతరం పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. ముఖ్యంగా దేవునికి పూజ చేసినా, ప్రసాదం పెట్టినా ఏకాగ్రమైన మనసుతో చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు.

3. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది.

4. ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది. మారేడు ఫలం కూడా అత్యంత శ్రేష్ఠం, అది సమర్పించడం శివుని విశేష అనుగ్రహ కారకం.

5. ఉమామహేశ్వరులను వేకువ జామున మరియూ ప్రదోష కాలమున పూజించడం వల్ల ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు. ప్రదోష వేళలో శివాలయంలో నేతి దీపాలు వెలిగించి, ఆలయంలో కాసేపు కూర్చుని  శివ నామస్మరణ చేయాలి.

6. రోజంతా ఉపవసించి సాయంత్రం నక్షత్ర దర్శనానంతరం భుజించాలి. ఉపవాసం చేయలేని వారు పాలు, పండ్లు వంటివి తీసుకోవచ్చు. 

ఇలా శివునికి భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో పూజించిన వారికి శివానుగ్రహం వలన అప్పుల బాధలు తొలగి, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది .

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment