Thursday, 7 March 2024

శివ లింగాలు ఎన్ని రకాలు...?

 


08/03/2024 తేది మహాశివరాత్రి సందర్భంగా...

    ఆ మహాదేవుని ఎన్ని రకాలుగా పూజించవచ్చు..?

అసలు శివ లింగాలు ఎన్ని రకాలు...?

వాటి ఫలితాలు ఏమిటి...?

వాటి గురించి వివరంగా తెలుసుకుందాం

శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే, వెనక్కి రావాలి. శివలింగం, నందీశ్వ రుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.

బిల్వ దళం ప్రాముఖ్యత:

బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది.ఇందులో కుడి ఎడమలు విష్ణు, బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శివప్రియ అని మరోపేరు ఉంది. 

బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ.బిల్వం ఇంటి అవ రణంలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తూర్పున ఉంటే సౌఖ్యం. పశ్చిమాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షిణాన ఆపదల నివారణ. 

వసంతం, గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది. 

ఓం నమః శివాయ..హర హర మహాదేవ శంభో శంకర.. 

30 రకాల శివలింగాలు..

సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే..అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం. 

కానీ మనకు తెలియని శివలింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి. అపూరూపమైనవి..ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం..

అందుకే వాటి గురించి తెలుసుకుందాం....

.రకరకాల పదార్ధాలతో రూపొందించిన శివలింగాలు గురించి పురాణాలు వివిధ సందర్భాలల్లో వర్ణించాయి.... ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో చూడండి.....

1) గంధపు లింగం.

రెండు భాగాలు కస్తూరి , నాలుగు భాగాలు గంధం , మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు .....దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.

2) నవనీత లింగం.

వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.

3) పుష్పలింగం.

.నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు....దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.

4) రజోమయ లింగం.

పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాథరత్వం సిద్ధిస్తుంది..... శివ సాయిజ్యాన్ని పొందగలరు

5) ధ్యాన లింగం.

యవలు , గోధుమలు , వరిపిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు....దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి , సంతానం కలుగుతుంది.

6 ) తిలిపిస్టోత్థ లింగం.

నూగు పిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ది కలుగుతుంది.

7) లవణ లింగం..

హరిదళం , త్రికటుకము , ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి .

8 ) కర్పూరాజ లింగం .

ముక్తి ప్రదమైనది.

9) భస్మమయ లింగం.

భస్మముతో తయారు చేస్తారు ...... సర్వసిద్ధులను కలుగచేస్తుంది

10) శర్కరామయ లింగం..

సుఖప్రదం..

11) సద్భోత్థ లింగం..

ప్రీతికరని కలిగిస్తుంది.

12) పాలరాతి లింగం..

ఆరోగ్యదాయకం.

13) వంకాకురమయ లింగం.

వంశవృద్దిని కలిగిస్తుంది ...... దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు .

14) కేశాస్థి లింగం .

వెంట్రుకలు , ఎముకలతో తయారు చేస్తారు .....ఇది శత్రునాశనం చేస్తుంది.

15) పిష్టమయ లింగం..

ఇది పిండితో తయారు చేయబడుతుంది...ఇది విద్యలను ప్రసాదిస్తుంది.

16) దధిదుగ్థ లింగం .

కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుంది.

17) ఫలోత్థ లింగం..

ఫలప్రదమైనది.

18) రాత్రి ఘజాత లింగం.

ముక్తి ప్రదం

19) గోమయ లింగం..

కపిల గోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు ..... దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది..... భూమిపై పడి మట్టి కలిసిన పేడ పనికిరాదు

20) దూర్వాకాండజ లింగం.

గరికతో తయారు చేయబడు ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది

21) వైడూర్య లింగం..

శత్రునాశనం , దృష్టి దోషహరం

22) ముక్త లింగం .

ముత్యంతో తయారు చేయబడిన ఈ లింగం ఇష్ట సిద్దిని కలిగిస్తుంది

23) సువర్ణ నిర్మిత లింగం.

బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది

24) ఇత్తడి - కంచు లింగం..

ముక్తిని ప్రసాదిస్తుంది

25) రజత లింగం..

సంపదలను కలిగిస్తుంది

26) ఇనుము - సీసపు లింగం..

శత్రునాశనం చేస్తుంది

27) అష్టధాతు లింగం.

చర్మరోగాలను నివారిస్తుంది.....సర్వసిద్ధి ప్రదం

28) స్ఫటీక లింగం.

సర్వసిద్ధికరం , అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది

29) తుష్టోత్థ లింగం..

మారణ క్రియకు పూజిస్తారు

30) సీతాఖండ లింగం.

ఫటిక బెల్లంతో తయారు చేసింది..... ఆరోగ్యసిద్ధి కలుగుతుంది

పరమేశ్వర పూజా పుష్పఫలము ..

శివున్ని దర్భలతో పూజిస్తే - దీర్ఘాయుస్సు! 

ఉమ్మెత్తలతో పూజిస్తే - సుతప్రాప్తి!

జిల్లేడు పూలతో పూజిస్తే - శౌర్యము !

కలువ పూలతో పూజిస్తే - విక్రమ వృద్ధి !

బంధూక సుమములతో పూజిస్తే - భూషణ ప్రాప్తి !

జాజి పూలతో అర్చిస్తే - వాహన ప్రాప్తి !

మల్లెపూలతో పూజిస్తే - భోగము ప్రాప్తిస్తాయి !

అవిసె పూలతో పూజిస్తే - పరమేశ్వర ప్రాప్తి !

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment