Monday, 26 February 2024

రామాయణమ్. 23

 



ఓ బ్రహ్మర్షీ! నా తల్లిని రాముడు చూసినాడా? ఆమెను అనుగ్రహించినాడా? 

మరల నా తండ్రి అచటికి ఏతెంచినాడా? నా తల్లితండ్రులు ఇరువురూ సంతోషముగా కలసినారుకదా! 

రాముడు వారి ఆతిధ్యమును స్వీకరించెనా? నా తల్లిదండ్రులు రామునకు ఫలపుష్పాదులొసగినారుకదా! 

.ఇలా ఒకదానివెంట మరొక ప్రశ్న సంధిస్తూ వెడుతున్న శతానందులవారికి విశ్వామిత్రుడు చిరునవ్వుతో ఒకే ఒక సమాధానం చెప్పారు.

"నాయనా ,జరుగవలసిన వెల్ల జరిగినవి నా కర్తవ్యము నేను నిర్వహించితిని. ఆ మాటలు విన్న శతానందుడు...ధన్యుడనయితిని ఓ రామచంద్రా నీవు నా తలితండ్రులకు ,కుటుంబమునకు చేసిన మేలు మరువలేనిదయ్యా! 

.నీవుకూడా ధన్యుడవయితివయ్యా! అనితర సాధ్యమైన బ్రహ్మర్షిపదాన్ని స్వయం కృషితో అందుకున్న ఈ మహాతేజోసంపన్నుడైన విశ్వామిత్రుని శిష్యరికము నీకు లభించినది.

.ఈయన సామాన్యుడనుకున్నావా! కాదు ,కాదు! ఈయన ఒక్కడే!(unique) .చరిత్రలో మరొకరులేరు.

.ఒక సామాన్య రాజుగా జన్మించి రాజర్షియై,ఋషియై,మహర్షియై,బ్రహ్మర్షిఅయిన ఈయన చరిత్ర అత్యంత స్ఫూర్తి దాయకం ,ఆదర్శవంతము.

.ఒక లక్ష్యము కోసము పట్టువిడవక వేల ఏండ్లు తపస్సు చేసి సాధించిన మహోన్నతమయిన వ్యక్తి విశ్వామిత్రమహర్షి! .

.తపస్సు ద్వారా మనస్సులోని మలినములు ఒక్కొక్కటిగా తొలగించు కుంటూ మనస్సు అత్యంత పరిశుద్ధమైన మానససరోవరంగా మార్చుకున్న వాడయ్యా ఈయన ! 

.ఈయన చరిత్ర మానవాళికి అందించే పాఠం అత్యంత విలువైనది ! .ఈ చరిత్ర కార్యసాధకుడైన ప్రతి వ్యక్తి హృదయంలో స్ఫూర్తి రగిలిస్తుంది!

.రామచంద్రా ఈ బ్రహ్మర్షిగూర్చి నీకు వివరించ ప్రయత్నం చేస్తాను. 

.అంటూ శతానందులవారు విశ్వమిత్రమహర్షి చరిత్ర చెప్పటం మొదలుపెట్టారు!.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

.

శ్రీ విధాత పీఠంలో

 




భగవత్ భందువులందరికిీ

శ్రీ విధాత పీఠంలో 28-2-2024 (బుధవారం)సంకటహరచతుర్థి సందర్భంగా సంకష్టగణపతి హోమం హవనిజా గారి ఆధ్వర్యంలో జరుగును.మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు 516/-

ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay   ద్వారా కానీ పంపగలరు

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 096666 02371

 


ఈ పువ్వును ఎంత మంది చూసారు ? ఈ పువ్వు విశిష్టత తెలుసుకుందామా ?

ఇందులో సహజ సిద్ధంగా శివ లింగము, ఆ శివ లింగానికి పడగ పడుతున్నట్లు పైన పువ్వు రేకులు ఉంటాయి. ఈ పువ్వును చూస్తే మనసులో భక్తి భావం కలగడం కూడా సహజమే. కార్తీక మాసంలో ఈ పువ్వుతో పూజలు చూస్తుంటాము. ఈ పువ్వు అన్ని చోట్లా పూయదట, అంతే కాదు అందరికీ కనిపించదు అని కూడా అంటుంటారు పెద్దలు. ఈ చెట్టు దగ్గరలో తప్పకుండా శివాలయం ఉంటుంది అని ప్రతీతి. దీనిని నాగమల్లి పువ్వు అని, శివ లింగం పువ్వు అని కూడా అంటుంటారు.

 పూర్వము కాశీ యాత్రకు వెళ్ళే శివ భక్తులు అడవుల మధ్య ప్రయాణించవలసి వచ్చేది. వారికి మార్గ మధ్యంలో ఈ శివలింగం పువ్వుల చెట్లు తారసపడేవి. ఈ పువ్వులను చూడగానే వారు దగ్గరలో శివాలయం ఉంటుందని గ్రహించి, ఆ పరిసరాల్లో గాలించేవారు. వారికి జీర్ణావస్థకు ( శిథిలావస్థకు ) చేరిన పురాతన శివాలయాలు దర్శనమిచ్చేవి. ఆ శివాలయాలను ఉద్ధరించేవారు. ఇలా కాశీకి వెళ్ళే మార్గంలో ఎన్నో అద్భుతమైన, మహామహిమాన్వితమైన శివాలయాలు పునరుద్ధరింపబడ్డాయి. ఈ పువ్వును శివ గణాలలో ఒకటి అని కూడా చెబుతుంటారు. ఈ పువ్వును, దర్శించడం, స్పర్శించడం విశేష పుణ్యప్రదం. 

ఓం నమః శివాయ శివాయ నమః ఓం🙏

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

 


ఇది మెక్కాలోని కాబాద చుట్టూ నల్లని గోడయన్న నిర్మించడానికి ముందు తీయబడిన చిత్రం. 

ఈ చిత్రవన్ని అరేబియా దేశంలోని అరేబియా దేశంలోని సౌదీ వనరులు లభించే ముందు, ఆ దేశంలోని పేదతన సమయంలో, అది మరుక్షణం సమయంలో, ప్రపంచంలో రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించిన బ్రిటీషరు తీసిన చిత్రం.

అల్లాహ్‌కు ఆకారమే లేదు అని చెప్పండి. కోటి కోటి జనాలున్న గోడయ ముందు నిలిపినవారు, అలాగే గోడ ముందు నిలబడి ఉన్నవారు అల్లాహ్ కు ఏదయినా ఆకారం చూడండి. 

అది వేరే,.. ఎవరు అల్లేశ్వర అంటే మన మహాదేవ, ఈశ్వర.

మేము ఈశ్వరనాన్ ఎలా మంచునాథేశ్వర, శ్రీకణ్ఠేశ్వర, నంజుడేశ్వర, సోమేశ్వర, బృహదేశ్వర, కల్లేశ్వర, అంతకరెవో వంటి అరబ్బలు అల్లేశ్వర/మక్కేశ్వరా అని పిలిచారు.

కాలానంతరం అళేశ్వర అనే ప్రభంధం అల్లాహ్ అయ్యాడు. మక్కేశ్వరుడు కాబట్టి మక్కా, కాబాద చుట్టూ 258 హిందూ దేవుని విగ్రహాలున్నాయి చిన్న పుట్ట దేవాలయాలు. 

ఆ అన్ని దేవుళ్లను మొహమ్మద్ పైగంబర పూజ చేస్తున్నారు. 

మొహమ్మద్ పైగంబరన తర్వాత వచ్చిన మతాంధ అనుయాయిలు ఇది హిందూ దేవుడు కురుహన్నను నాశనం చేసి, విశిష్టమైన మతం అని ప్రతిబింబించడానికి అనేక సాంకేతికతలను రూపొందించారు. 625 వరకు మక్కా అనే ఏ నగరవూ లేదు. మక్కేశ్వర అనే ఊరు మాత్రమే ఉన్నది.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

మాఘ పురాణం - 18వ అధ్యాయం


పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట 

వశిష్ఠ మహాఋషి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును యిట్లు తెలియజేసెను.

“పార్వతీ! చాలాకాలం క్రిందట దక్షిణప్రాంతమందలి వసంతవాడయను నామము గల పెద్ద పల్లెయుండెను. అందొక బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది. కాని అతడు ఇంకనూ ధనాశ కలవాడై తనవద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కానీ ఒక్కనాడైనా హరిని ధ్యానించడం కానీ, దానధర్మాలు చేయుట గానీ ఎరుగడు. అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలు ఇచ్చి అనుకున్న గడువుకు ఋణము తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీన పరుచుకునే వాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళెను. ఆరోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి తల్లీ నేను ముసలి వాడను. నా గ్రామము చేరవలయునన్న ఇంకనూ పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చల్లగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద ఈరాత్రి గడువనియ్యి. నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను. ప్రాతఃకాలమున మాఘ స్నానం చేసి వెళ్ళి పోదును అని బ్రతిమలాడెను. 

తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగు మూల శుభ్రం చేసి అందొక తుంగ చాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుండని పలికెను. ఆమె దయార్ద్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసమొంది విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించుమని చెప్పి ఆర్యా! మాఘ స్నానము చేసి వెళ్ళెదనన్నారు కదా! ఆ మాఘ స్నానమనగానేమి? దాని వలన కలుగు ఫలితమేమి? సెలవిండు. వినుటకు కుతూహలముగా ఉన్నది. అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని “అమ్మా! మాఘ మాసము గురించి చెప్పుటకు నాకు శక్యము గాదు. ఈ మాఘ మాసములో నదియందు గానీ, తటాకమందు గానీ, లేక నూతియండు గానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్ళు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీ దళంతోనూ, పూవుల తోనూ, పండ్లతోనూ, పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తరువాత మాఘ పురాణం పఠించవలెను. ఇట్లు ప్రతిదినమూ విడువకుండా నెలరోజులు చేసి ఆఖరున బ్రాహ్మణునకు సమారాధన, దానములు ఇవ్వవలెను. అట్లు చేసిన యెడల మానవునికున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించి పోవును. ఒకవేళ ఈ నెలరోజులూ చేయలేని వారు వృద్ధులు, రోగులు ఒక్కరోజైననూ అనగా ఏకాదశి రోజున గానీ, ద్వాదశి నాడు గానే, పౌర్ణమి దినమున గానీ పైప్రకారము చేసినచో సకల పాపములు వైదొలగి సిరి సంపదలు, పుత్ర సంతానం కలుగును. ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను” అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను ప్రాతఃకాలమున బ్రాహ్మణునితో నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను. 

అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి వచ్చినాడు. అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారు జామున స్నానమునకు పోవుదునని తెలియజేసెను. 

భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టి కోపము వచ్చి వంటినిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపట కొరికి ఓసీ వెర్రిదానా! ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘ మాసమననేమిటి? స్నానమేమిటి? వ్రతము, దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వేయుదును. డబ్బులు సంపాదించుటలో నా పంచ ప్రాణములు పోవుచున్నవి. ఎవరికినీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేయమనెదవా? చలిలో చన్నీళ్ళు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు, ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకొని, భిక్షాం దేహి అని అనవలసిందే. జాగ్రత్త! వెళ్ళి పడుకో! అని భర్త కోపిగించినాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము సేతునా? అని ఆత్రుతగా ఉన్నది. కొన్ని ఘడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో మొగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికి పోయి నీళ్ళలో దిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ యిద్దరూ కొంత తడవు నీళ్ళలో పెనుగులాడిరి. అటుల పెనుగు లాడుచుండగా ఇద్దరూ నీళ్ళలో మునగవలసి వచ్చెను. అటుల మునుగుటచే ఇద్దరికీ మాఘ మాస ఫలము దక్కినది. భార్యను కొట్టి ఇంటికి తీసుకు వచ్చినాడు.

కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకొని పోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణు దూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకొని పోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమ భటులతో ఇట్లు పలికెను. 

ఓ యమ భటులారా! ఏమిటీ అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకు పోవుట ఏమి? నా భర్తను యమ లోకమునకు తీసుకొని పోవుట ఏమిటి? ఇద్దరమూ సమానమే కదా! అని వారి నుద్దేశించి అడుగగా “ఓయమ్మా! నీవు మాఘమాసములో ఒకదినమున స్నానము చేసితివి. అదియు ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకీ ఫలం దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందునే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము. అని యమభటులు పలికిరి.

ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. నేను ఒకే ఒక దినమున స్నానము చేసినందున పుణ్య ఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నాభర్త కూడా నీట మునిగినాడు కదా! శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేల కలిగెను? అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమియూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి. 

చిత్రగుప్తుడునూ వారి ఇద్దరి పాప పుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్య ఫలము రాసి ఉన్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణు దూతలతో చెప్పెను.

విష్ణు లోకమునకు ముందుగా వెళ్ళియున్న తాయారమ్మ భర్త గతి ఏమయ్యెను? అని ఆత్రుతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యాభర్తలు ఇద్దరూ మిక్కిలి సంతసమందిరి.

రాజా! వింటివా. భార్య వల్ల భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగెనో. భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించిననూ భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా! కనుక మాఘ స్నానం నెలరోజులూ చేసినచో మరింత మోక్షదాయకం అగుననుటలో సందేహం లేదు.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

శ్రీ మహాలక్ష్మీ (అంబాబాయి) దేవాలయం

 


శ్రీ మహాలక్ష్మీ (అంబాబాయి) దేవాలయం భారతదేశం లోని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కొల్హాపూర్ లో శక్తి పీఠం. ఇది హిందూ పురాణాల ప్రకారం శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతోంది.

👉🏾విశేషాలు

పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసముండే 108 శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.మహాలక్ష్మిని ప్రేమగా అంబా బాయి అనికూడా పిలుస్తారు, ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలను కోరుకుంటారు. ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా, కొల్హాపూర్, భారతదేశంలోని ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతుంది.7 వ శతాబ్దం లోని ఈ దేవాలయాన్ని చాళుక్య వంశ రాజైన కరన్దేవ్ తిరిగి చాలాకాలం తరువాత దీని నిర్మాణాన్ని చేపట్టారు.

 ఈ పవిత్ర స్థల నిర్మాణ శైలి హేమండ్ పతి ప్రేరణతో చేయబడింది. ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు 8 వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని నమ్మబడింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్యకిరణాలు ప్రతిరోజూ దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది.నవరాత్రి వంటి పండుగల సమయంలో స్థానికులు, భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్ కి తండోపతండాలుగా వస్తారు. ఈ సమయంలో ఈ ప్రాంతం ప్రకాశవంతమైన రంగులతో, సంగీతంతో ప్రతిధ్వనిస్తుంది.

ఒక రాతి పీఠం మీద నాలుగు చేతులతోనూ, 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మీ కొలువై ఉంటుంది. 3 అడుగుల ఎత్తుగల నల్లరాతిపై మహాలక్ష్మీ ప్రతిమను చెక్కడం జరిగింది. ఆలయంలోని ఒక గోడపై శ్రీ యంత్రం చెక్కబడి ఉంది. దేవత యొక్క వాహనం రాతితో చేయబడిన సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది. కిరీటంపై విష్ణువు తల్పం అయిన శేషనాగు యొక్క చిత్రం ఉంటుంది. ఆమె నాలుగు చేతులలో గుర్తింపు కలిగిన నాలుగు వస్తువులు ఉంటాయి. కుడివైపు క్రింది చేతిలో మాలుంగ (సిట్రస్ జాతి ఫలం), ఎడమవైపు కింది చేతిలో పాత్ర ఉంటుంది. హిందూ పవిత్ర చిత్రాలలో ముఖం ఉత్తరవైపు లేదా తూర్పు వైపు చూసే విధంగా ఉంటుంది. ఈ దేవతా విగ్రహం పశ్చిమవైపు చూసే విధంగా ఉంటుంది. చిన్న తెరిచిఉన్న కిటికీ పశ్చిమవైపు గోడకు ఉంటుంది. సూర్యాస్తమయం అయినపుడు సూర్యుని కిరణాలు ఈ కిటికీ గుండా ప్రతి సంవత్సరం 21 మార్చి, 21 సెప్టెంబరు లలో మూడురోజులపాటు విగ్రహంపై పడతాయి. ఆలయ పరిసరాల్లో నవగ్రహాల, సూర్యుని, మహిసాసుర మర్థని, విఠల్-రఖ్‌మయి, శివుడు, విష్ణువు, తుల్జా భవాని, యితర విగ్రహాలు ఉంటాయి. వీటిలోకొన్ని విగ్రహాలు 11వ శతాబ్దానికి ముందువి కొన్ని కొత్తగా ప్రతిష్ఠించినవి. ఆలయం వద్ద మణికర్ణికా కుండం అనే కొలను ఉంది. ఆ కొలను ఒడ్దున విశ్వేశ్వర మహాదేవ్ విగ్రహం ఉంది.

అమ్మవారికి రోజూ అయిదు సార్లు అర్చన జరుగుతుంది .ఉదయం అయిదు గంటలకు శ్రీ మహా లక్ష్మీ దేవికి సుప్రభాత సేవ చేస్తారు. కాకడ  హారతి ఇస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం, సాయంత్రాలలో పూజ, శేజ్ హారతి జరుపుతారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులపుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు. ప్రతి శుక్రవారం సాయంత్రాలలో, పౌర్ణమి నాడు, అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు.

పూర్వకథ:

అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ఏటా కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి, శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని, కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే, అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని కోరాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని, అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలనిస్తుందని చెప్పాడట.

శివుని ఆనతిమేరకు అగస్త్యుడు కొల్హాపూర్‌లో మహాలక్ష్మిని, అతిబలేశ్వరస్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడి స్థలపురాణాల ద్వారా అవగతమవుతోంది. అమ్మవారు వెలసిన తర్వాత ఈ నగరానికి కరవీరపురమనే పేరు సార్థకమైంది. ఈ నగరాన్ని కోల్‌పూర్ అని కోల్‌గిరి అని, కొలదిగిరి పట్టణ్ అని పిలిచేవారు. ‘కొల్లా’ అంటే ‘లోయ’అని, ‘పూర్’ అంటే పట్టణమనే అర్థంలో ఈ క్షేత్రం విలసిల్లిందని చెబుతారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359వ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వికులు పాలించగా, 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రవర్థమానమైందని తెలుస్తోంది.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

నిత్య రాశి ఫలాలు.

 


2️⃣7️⃣/ఫిబ్రవరి /2️⃣0️⃣2️⃣4️⃣భౌమవాసరే (మంగళవారము)

🐐 మేష రాశిఫలితములు

అశ్వని 1, 2, 3, 4, పాదములు (చూ, చే, చో, లా)

భరణి 1, 2, 3, 4 పాదములు (లీ, లూ,లే, లో)

కృత్తిక 1వ పాదము (ఆ).

         మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజే చేయమని వత్తిడికి గురి అవుతారు. అవిమీకు టెన్షన్ ని, వణుకుని కలిగించవచ్చును. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన కొనుగోళ్ళు చేయడానికి వీలు కల్పిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత మెరుగు పడుతుంది, ఇంకా వారు మీపై ప్రేమను కురిపిస్తారు. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లున్నారు,కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. మీరు ఈరోజుమొత్తం మిరూములో కూర్చుని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ ప్రైజ్ ను అందుకోవచ్చు. మీరు ఈరోజు మీఅందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు,ముఖ్యంగా కేసలాంకరణకు,వస్త్రధారణకు సమయము కేటాయిస్తారు.దీనితరువాత మీరు మీపట్ల సంతృప్తిని పొందుతారు.

          లక్కీ సంఖ్య: 4

🌷 మేష రాశి :

తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలు తొల‌గిపోతాయి...

💥 ఆదిత్య హృదయం పారాయణ చేయండి.

🌷 ఓం విష్ణవే నమః.ఈ మంత్రం రోజు చేయగలరు.

🐃 వృషభ రాశిఫలితములు.

కృత్తిక 2,3,4 పాదములు (ఈ,ఊ,ఏ)

రోహిణి 1,2,3,4 పాదములు (ఓ,వా,వీ,వూ)

మృగశిర 1,2 పాదములు (వే,వో).

       మీ హాస్యచతురత, మీ కుగల ప్రత్యేక భూషణం, దానిని, మీ అనారోగ్యం తగ్గించుకోవడం లో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లలు వారి స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ పూర్తిచేసుకోవడంలో మీ సహాయం పొందుతారు. ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. మీకో విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్! నమ్మరా? కాస్త గమనించండి. ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలిసిరావడం ఖాయం. ప్రజలు మొదట ఆరోగ్య వ్యయంతో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు, తరువాత డబ్బు ఖర్చుతో వారి మంచి ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం నిజమైన సంపద, కాబట్టి సోమరితనం నుండి బయటపడి చురుకైన జీవితాన్ని గడపండి.

లక్కీ సంఖ్య: 4

              🌸 వృషభ రాశి :

తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే.. కష్టాలుండవు. సుఖసంతోషాలు చేకూరుతాయి...

🌷 విష్ణు సహస్ర నామ స్తోత్రం పారాయణ చేయండి.

🌸 ఓం నమో నారాయణాయ నమః.ఈ మంత్రం రోజు చేయగలరు.

👬 మిథున రాశిఫలితములు.

మృగశిర 3,4 పాదములు (కా,కి)

ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ,ఖం,ఙఙ్గ, చ్ఛ)

పునర్వసు 1,2,3 పా|| (కే, కో, హా).

         కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి ఆవిధంగా మానసిక వ్యాయామం చెయ్యండి. మీరు ప్రయాణం చేసి, ఖర్చుపెట్టే మూడ్ లో ఉంటారు, కానీ, మీరలా చేస్తే కనుక, విచారిస్తారు. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి, మీ తలదించుకునేలాగ చేయడం జరుగుతుంది. మీకు ప్రియమైనవారి బాహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు. డబ్బు,ప్రేమ,కుటుంబం గురించి ఆల్చినచటముమాని,ఆధ్యాత్మికంగా మీయొక్క ఆత్మసంతృప్తికొరకు ఆలోచించండి. ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. మీయొక్క అలవాట్లుఅంటే, పాటలువినడము,నృత్యము,మొక్కలుపెంచడము,వంటివి చేయటంవలన మీరుసంతృప్తికి లోనవుతారు.

          లక్కీ సంఖ్య: 2

🌵 మిథున రాశి :

తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి...

🌺 లక్ష్మీ కనక ధారా స్తోత్రం పారాయణ చేయండి.

🌿 ఓం గం గణపతయే నమః.ఈ మంత్రం రోజు చేయగలరు.

🦀 కర్కాటక రాశిఫలితములు.

పునర్వసు 4వ పాదము (హి)

పుష్యమి 1, 2, 3, పాదములు (హు, హె, హో, డా)

ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు (డీ, డు, డే, డో).

       మీకు పన్నునొప్పికానీ పొట్ట అప్సెట్ అవడం కానీ ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. సత్వర బాధా నివృత్తికోసం ఒక డాక్టరును సంప్రదించండి. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక వత్తిడిని కూడా కలిగిస్తుంది- కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. మీరు పిల్లలతో కొంత సమయం గడిపి వారికి నైతిక విలువలగురించి నేర్పాలి., దాంతో వారు వారి బాధ్యతలను తెలుసుకోవాలి. ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. కొన్ని అనివార్య కారణములవలన కార్యాలయాల్లో మీరు విచారానికి గురిఅవుతారు,దానిగురించి ఆలోచించి సమయాన్ని వృధాచేస్తారు. ఈ ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఉన్నారని అనిపించేలా ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు. ఈరోజు మీరు మీయొక్క పాతస్నేహితుడిని కలుసుకోవటంద్వారా సమయము ఎంతతొందరగా తిరుగుతో గ్రహిస్తారు.

లక్కీ సంఖ్య: 5

             🌉 కర్కాటక రాశి :

తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి.

🌆 సుబ్రహ్మణ్య దుర్గ స్తోత్రం పారాయణ చేయండి.

🌃 ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ నమః.ఈ మంత్రం రోజు చేయగలరు.

 🐯 సింహ రాశిఫలితములు.

మఘ 1,2,3,4 పాదములు (మా,మీ,మూ,మే)

పుబ్బ 1,2,3,4 పాదములు (మో,టా,టీ,టు)

ఉత్తర 1వ పాదము (టే).

        మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి. ఈ క్రమంలో, మీకుమీరే అనవసరమైన, మానసిక ఆందోళన కల్పించుకుంటారు. వాటిలో ప్రధానమైమనది, కనీసం అప్పుడప్పుడైనా పిల్లల లాగ ఉండలేకపోతున్నామే అనేది బాధకు కారణం కాగలదు. క్రొత్త ఒప్పందాలు బాగా లబ్దిని చేకూర్చవచ్చును, మీరు ఊహించినదానికన్న చుట్టాలరాక ఇంకా బాగుటుంది. ప్రేమ రొమాన్స్ మిమ్మల్ని సంతోషకరంగా ఉంచుతాయి. మీ హాస్య చతురత మీ కుగల బలం. మీ జీవిత సర్వస్వమైన మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకో అద్భుతమైన సర్ ప్రైజ్ ఇవ్వవచ్చు. నదిఒడ్డును,పుణ్యక్షేత్రమును దర్శించటమువలన మీరు మనశాంతిని పొందుతారు. 

          లక్కీ సంఖ్య: 3

🌺 సింహ రాశి :

తమలపాకులో అరటిపండును ఉంచి గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి.

💐మేదో దక్షిణా మూర్తి స్తోత్రం దత్తాత్రేయ స్తవం పారాయణ చేయండి.

🌵 ఓం నమః శివాయ

ఈ మంత్రం రోజు చేయగలరు.

💃 కన్యా రాశిఫలితములు.

ఉత్తర 2,3,4 పాదములు (టో,పా,పి)

హస్త 1,2,3,4 పాదములు (పూ,షం,ణా,ఢ)

చిత్త 1,2 పాదములు (పే,పో).

         మీ భావోద్వేగాలు అదుపు కష్టమనుకుంటారు. మీ అసాధారణ ప్రవర్తన, ఇతరులను అయోమయంలో పడేస్తుంది. వారిని నిస్పృహలోకి తోసెస్తుంది. వ్యాపారస్తులు నష్టాలు చవిచూస్తారు,అంతేకాకుండా మీరు మీవ్యాపారాభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చుచేస్తారు. మీ చిన్నపిల్లల చేష్టలు, అమాయకత్వం, మీ కుటుంబసమస్యలు పరిష్కరించడం లో ముఖ్యపాత్ర వహించి, సహాయపడగలవు. రొమాన్స్ కి ఈరోజు అవకాశం లేదు. ఖాళి సమయములో ఈరోజు మీరు మీ ఫోనులో ఏదైనా వెబ్సిరీస్ ను చూడగలరు. మీ వైవాహిక జీవితం తాలూకు ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు, కుటుంబీకుల మధ్య మీ ఇరుగుపొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయటపెట్టవచ్చు. ఈరోజు మీరు ఇంటిపైన పడుకుని ఆకాశాన్ని చూడటానికి ఇష్టపడతారు.మీఖాళీసమయాన్ని ఇలా గడుపుతారు.

లక్కీ సంఖ్య: 2

             🌿 కన్యారాశి రాశి :

తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే.. దుఃఖం దూరమవుతుంది.

🌻 హనుమాన్ చాలీసా కాలభైరవ అష్టకం గోవిందా నామాలు పారాయణ చేయండి.

🌷 ఓం నమో శ్రీ వేంకటేశాయ. ఈ మంత్రం రోజు చేయగలరు.

 ⚖️ తుల రాశిఫలితములు.

చిత్త 3,4 పాదములు (రా,రి)

స్వాతి 1,2,3,4 పాదములు (రూ,రే,రో,తా)

విశాఖ 1,2,3 పాదములు (తీ,తూ,తే).

       గర్భవతి అయిన స్త్రీ, లేదా కాబోయే తల్లి, గచ్చుమీద నడిచే సమయంలో జాగ్రత్త వహించాలి. ఇంకా పొగత్రాగే స్నేహితుల ప్రక్కన నిలబడవద్దు. ఇంకా జన్మించని ఆ శిశువుపై దీని చెడు ప్రభావం పడగలదు. మీరు డబ్బుని ఇతరదేశాలలో స్థలాలమీద పెట్టుబడి పెట్టివుంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి,దీనివలన మీకు మంచి లాభలు ఉంటాయి. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంది. ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కన్పిస్తోంది. ఈ రోజు మీరెలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలుపడానికి ఆత్రపడకండి. మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ జీవితంలోనే అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది. ఈరోజు మీ తల్లితండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయటనుండి తీసుకువచ్చి వారిని ఆశ్చర్యపరుస్తారు.దీనివలన కుటుంబవాతావరణము కూడా బాగుంటుంది. 

          లక్కీ సంఖ్య: 4

🎋 తులా రాశి :

తమలపాకులో లవంగంను ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.

🥀 సుందరకాండ గోవిందా నామాలు పారాయణ చేయండి.

🎋 ఓం శరవణభవ మాం రక్ష రక్ష.ఈ మంత్రం రోజు చేయగలరు.

🦂 వృశ్చిక రాశి.

వృశ్చిక రాశి ఫలితములు.

అనూరాధ 1,2,3,4 పాదములు (నా,నీ,నూ,నే)

జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో,యా,యీ,యు)..

       ఈ రోజు, మీరు రిలాక్స్ అవాలి, సన్నిహిత స్నేహితులు, మీ కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. పిల్లలకు చదువుపట్ల శ్రద్ధ లేనందువలన, బడిలో మాటపడి కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. మీ ప్రియమైన వారి స్నేహాన్ని, విశ్వసనీయతను శంకించకండి. ఈరోజు సాయంత్రము ఆనందకరసమయాన్ని పొందాలంటే,రోజంతా మంచి పనులుపూర్తిచేయండి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు. ఈరోజు,మీకంటే చిన్నవారి దగ్గరనుండి నీటియొక్కవిలువను, ప్రాముఖ్యాన్ని తెలుసుకుంటారు. 

లక్కీ సంఖ్య: 6

              🌆 వృశ్చిక రాశి :

తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి.

🌲 దత్తాత్రేయ స్తవం

 మేధో దక్షీణా మూర్తి స్తోత్రం పారాయణ చేయండి.

☘️ ఓం శ్రీం రాం రామాయ నమః. ఈ మంత్రం రోజు చేయగలరు.

🏹ధనూరాశి ఫలితములు.

మూల 1,2,3,4 పాదములు (యే,యో,బా,బి)

పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (భూ,ధ,భా,ఢ)

ఉత్తరాషాఢ 1వ పాదము (భే)

      మీ శక్తిని స్వీయ అభివృద్ధి ప్రాజెక్ట్ లకి వినియోగించండి అవి మిమ్మల్ని మరింత మెరుగుగా తయారు చేస్తాయి. ఎవరైతే చాలాకాలం నుండి ఆర్ధికసమస్యలను ఎదురుకుంటున్నారో వారికి ఎక్కడనుండిఐనమీకు ధనము అందుతుంది,ఇది మీయొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. ఇంట్లో పండుగలు పబ్బాలు/ వేడుకలు జరపాలి. మీరు జీవితానికి సాఫల్యత ను సాధించబోతున్నారు, దీనికోసం మీరు, ఆనందాన్ని పంచడం, గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు. మీకుకావాల్సినవారు మీకు తగిన సమయము ఇవ్వలేరు.అందువలన మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారిముందు ఉంచుతారు. పని విషయంలో అన్ని అంశాలూ మీకు సానుకూలంగా ఉన్నట్టు కన్పిస్తున్నాయి. మీకు ఈరోజు చాలాసమయము ఖాళీగా ఉంటుంది.గాలిలో మెడలుకట్టడానికి మీయొక్క ముఖ్యమైన సందర్భాలను ఉపయోగించకండి.ఏదైనా పని శ్రద్ధతో చేయుటవలన వచ్చేవారంలో మీరు మంచిఫలితాలను అందుకుంటారు. 

          లక్కీ సంఖ్య: 3

🎋 ధనుస్సు రాశి :

తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.

🌺 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఈ మంత్రం రోజు చేయగలరు.

🐊మకర రాశి ఫలితములు.

ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (భో,జా,జి)

శ్రవణము 1,2,3,4 పాదములు (జూ,జె,జో,ఖ)

ధనిష్ఠ 1,2 పాదములు (గా,గి).

       మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ, దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడం లో వినియోగించండి. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలనితెస్తుంది. మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి, ఎందుకంటే, అది మీకు చాలా మేలు చేస్తుంది. ఈ రోజు రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. మీయొక్క వ్యక్తిత్వపరంగా,మీరు ఎక్కువమందిని కలుసుకోవటం,మీకొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశకు చెందుతారు.కానీ ఈరోజు మీకొరకు మీకుకావాల్సినంత సమయము దొరుకుంతుంది. పెళ్లంటే కేవలం సెక్స్ మాత్రమేననే వాళ్లు నిజానికి అబద్ధం చెబుతున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు. ఈరోజుని మీరు చక్కగా సద్వినియోగము చేసుకునట్టుఅయితే ,ఈరోజు ఖాళి సమయాన్నిఇతరపనులకువినియోగించుకోవచ్చు.

లక్కీ సంఖ్య: 3

              🌃 మకర రాశి :

తమలపాకులో బెల్లంను ఉంచి శనివారాల్లో కాళిమాతను పూజిస్తే.. కష్టాలు తీరిపోతాయి.

🌿సంకట విమోచన గణపతి స్తోత్రం పారాయణ చేయండి.

⭐ ఓం క్గీం క్రిష్ణాయ గోవిందాయ గోపి వల్లభాయి నమః ఈ మంత్రం రోజు చేయగలరు.

🏺కుంభ రాశి ఫలితములు.

ధనిష్ఠ 3,4 పాదములు (గూ,గే)

శతభిషం 1,2,3,4 పాదములు (గో,సా,సీ,సూ)

పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే,సో,దా).

       పనిచేసే చోట, సీనియర్లనుండి వత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోనిత్యనం మీకు కొంతవరకు వత్తిడిని కలిగించవచ్చును. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి, పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. శ్రీమతి మరియు పిల్లలు, మరింత ఎక్కువ ప్రేమను అభిమానాన్ని శ్రద్ధను కురిపిస్తారు. కొంతమందికి క్రొత్త రొమాన్స్ లు ఉద్ధరించేవిగా ఉంటాయి, అవి సంతోషకరమైన మూడ్ లో ఉంచుతాయి మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి, దీర్ఘకాలిక విషంలా పనిచేస్తుంది. మీరు ఏదోఒక స్జనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి, మిమ్మల్ని మీరు బిజీగా ఉంఛుకోవాలి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలూ చేస్తారు. మీరు మీతమ్ముడితో కలిసిబయటకువెళ్లి ఆనందంగా గడుపుతారు.ఇదిమీయొక్క సంబంధాన్ని మరింత దృఢపరుస్తుంది. 

          లక్కీ సంఖ్య: 1

🌃 కుంభ రాశి :

తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళిమాతను పూజించినట్లైతే.. దుఃఖాలు తొలగిపోతాయి.

🌹 విష్ణు సహస్ర నామ స్తోత్రం పారాయణ చేయండి.

🌻 ఓం నమో వేంకటేశాయ ఈ మంత్రం రోజు చేయగలరు.

🐬మీన రాశి ఫలితములు.

పూర్వాభాద్ర 4వ పాదం (దీ)

ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దూ,ఞం,ఝ,థా)

రేవతీ 1,2,3,4 పాదములు (దే,దో,చా,చి)..

       ఆల్కహాల్ ని త్రాగకండి, అది మీ నిద్రను పాడుచేయవచ్చును. ఇంకా చక్కని విశ్రాంతిని కూడా నిరోధిస్తుంది. వ్యాపారస్తులకు,ట్రేడ్వర్గాల వారికి లాభాలురావటము వలన వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు.- ఎదుటివారిని ఒప్పుకునేలాచేయగల మీ నేర్పు ఈ రానున్న సమస్యలను పరిష్కరించుకోవడంలో ఉపకరిస్తుంది. ఈ రోజు మీరు డేట్ కి వెళ్ళేటట్లైతే, వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానీయకండి. కుటుంబంలోని ఒకరు వారికి సమయము కేటాయించామని ఒత్తిడితెస్తారు.మీరు ఒప్పుకున్నప్పటికీ ,ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది. మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులెవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తననుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయవచ్చు. ఇంటికి వచ్చిన అనుకొని అతిథితో మీరు సమయాన్ని గడుపుతారు.మీరు వారు చెప్పిన విషయాలను,మీతో పంచుకున్నవాటిని ఇష్టపడతారు. 

లక్కీ సంఖ్య: 7

              💐 మీన రాశి :

తమలపాకులో పంచదారను ఉంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి...

💮 సౌందర్య లహరి శివ నామ స్మరణ చేయండి.

🌲 ఓం గం గణపతయే నమః.ఈ మంత్రం రోజు చేయగలరు.

 

మకర కుంభములలో, అతి సమీప యుతి తో, కేంద్రీకృతమైన  5 గ్రహ శక్తుల కొనసాగింపు. సోమవారం శక సంవత్సరం: 07-12-1945 (క్రీ.శ.26-02-2024) నాటి ఉదయం గ్రహ స్థితి: (సూ ఉ/అ – 06:40:30/18:17:58గం)🙏

🙏Concentration of 5 Planetary energies in Capricorn and Aquarius with close conjunction continues. Monday, Saka Era : 07-12-1945 (26-02-2024 AD) Planetary position at Sun Rise Time (Sun Rise/ Set – 06:40:30/18:17:58 hrs)

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

పంచాంగం

 


మంగళవారం, ఫిబ్రవరి 27,2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

మాఘ మాసం - బహుళ పక్షం

తిథి:తదియ రా11.22 వరకు

వారం:మంగళవారం (భౌమవాసరే) 

నక్షత్రం:హస్త తె5.20 వరకు 

యోగం:శూలం మ2.55 వరకు

కరణం:వణిజ ఉ10.22 వరకు తదుపరి విష్ఠి రా11.22 వరకు

వర్జ్యం:మ12.08 - 1.54

దుర్ముహూర్తము:ఉ8.43 - 9.29 & మరల రా10.58 - 11.47

అమృతకాలం:రా10.43 - 12.29

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30

సూర్యరాశి:కుంభం

చంద్రరాశి:కన్య

సూర్యోదయం:6.24

సూర్యాస్తమయం:6.01

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

రామాయణమ్ .22

 


.గౌతమ మహర్షి ఆతిధ్యం స్వీకరించిన పిదప విశ్వామిత్ర మహర్షి ఈశాన్యదిక్కుగా ప్రయాణమయినాడు.

 అన్నదమ్ములిరువురూ ఆయనను అనుసరించినారు. 

.జనకుడి యజ్ఞ శాల ప్రవేశించారు మహర్షి!.

.మహాత్ముడు అయిన విశ్వామిత్ర మహర్షి రాక తెలిసికొని జనకమహారాజు తన పురోహితుడైన శతానందులవారిని వెంట నిడుకొని అతిశీఘ్రముగా ఆయన వద్దకు చేరి అర్ఘ్యపాద్యాదులొసగి ఆ మహానుభావుని తగురీతిని సత్కరించి అంజలి ఘటించి నిలుచున్నాడు.

.జనకుడిని యజ్ఞము ఏవిధముగా జరుగుతున్నదో అడిగి తెలుసుకున్నారు మహర్షి.

.అప్పుడు జనకుడి మదిలో ఒక ఉత్సాహమేర్పడి ,

మహర్షివెంట ఉన్న ధనుర్ధారులైన రాకుమారులెవరో తెలుసుకోవాలని కోరిక కలిగింది.

.మహర్షీ వీరిరువురూ ఎవరు? 

పద్మపత్రాల వంటి కన్నులు,

అశ్వినీ దేవతల సౌందర్యం,

దేవతాసమానపరాక్రమము,

గజ సింహ సమానమయిన నడక ,

చూడగానే దేవతలవలే కనపడే ఈ బాలురెవ్వరు?

 ఎవరివారు? నీతో కాలి నడకనే ఇచ్చటికి వచ్చినారెందుకు?

. జనకుడి ప్రశ్నల పరంపరకు చిరునవ్వుతో మహర్షి ఇలా సమాధాన మిచ్చారు.

.వీరు అయోధ్యా పురాధీశుడు దశరధమహారాజు కుమారులు రామలక్ష్మణులు! ..... అని చెప్పి!.

.తాటకద్రుంచి వైచి యతిదర్పితుడైన సుబాహుసాయకోత్పాటితు చేసి 

గీటడిచి ధర్మ మెలర్పన్ అహల్య శాపముచ్ఛాటన 

మొందజేసి కడు సమ్మద మారగ నీగృహంబునం 

జాటగనున్న శంకరుని చాపము జూడగ వచ్చిరి ఏర్పడన్

.తాటకను చంపినవారు వీరే ,

సుబాహుడిని మృత్యువు కౌగిటిలోకి తోసినది వీరే ,

అహల్య శాపవిమోచనము గావించినవారు వీరే ! 

నీ ఇంట వున్న శివధనుస్సును చూడటానికి ఇప్పుడు ఇక్జడికి వచ్చారు.

.ఇది వింటున్న శతానందులవారు ఆనందంతో ఎగిరి గంతువేసి ఏమిటి మహర్షీ? మా అమ్మ అహల్యకు శాపవిమోచనమయినదా ? అని ఆత్రుతతో ప్రశ్నించాడు.

.శతానందులవారు అహల్యాగౌతముల కుమారుడు.

.N.B..

పై పద్యం భాస్కర రామాయణంలోనిది

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

శ్రీ విధాత పీఠంలో

 



భగవత్ భందువులందరికిీ


శ్రీ విధాత పీఠంలో 28-2-2024 (బుధవారం)సంకటహరచతుర్థి సందర్భంగా సంకష్టగణపతి హోమం హవనిజా గారి ఆధ్వర్యంలో జరుగును.మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు 516/-

ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay   ద్వారా కానీ పంపగలరు

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 096666 02371

సత్యమేవ జయతే 🙏

 


ఫిలిప్పీన్స్ లోని మైనింగ్ పారిశ్రామిక వేత్త(గనుల తవ్వకం), పురాతత్వ పరిశోధకుడు శ్రీ సయీద్ సమీర్ హుస్సేన్ గారు తమ గనుల తవ్వకం GB సందర్భంగా 10 వేల సంవత్సరాల నాటి పరమశివుడి త్రిశూలం, ఇంద్రుడి వజ్రాయుధం లభించాయి. ఆయన వాటిని తీసుకొని దుబాయ్ మీదుగా భారత్ చేరుకున్నారు.  'వీటిని వేలం వేస్తే/అమ్మితే' ఊహించనంత ధనం వస్తుందని ఆయనకు చాలా మంది చెప్పారు, కానీ ఆయన ఈ పరమ పవిత్ర వస్తువులు భారత్ కు చెందినవి, హిందూ ధర్మానికి చెందినవి అందుకని వాటిని హిందూ దేశమైన భారత్ కు అప్పచెప్పడమే న్యాయం అని భావించారు. సామాన్య హిందువు కూడా వీటిని సందర్శించుకోవాలని భావించారు. శివుడి యొక్క త్రిశూలం నిజంగానే ఉన్నది అది నా దగ్గరే ఉందని ఆయన ఆనందంగా చెప్పారు. హిందువులను ఊచకోత కోసిన నరహంతకుడు టిప్పు కత్తి ని వేలంలో కొనుక్కున్న విజయ్ మాల్యా ప్రస్తుతం బ్రిటన్ వీధుల్లో అడుక్కుతింటున్నాడు. శివుడి త్రిశూలం పట్టుకున్న సయీద్ సమీర్ ఆనందంగా ఉన్నాడు. ఇదీ హిందుత్వ..హిందుత్వలోని ఆనందం. హరహరమహాదేవ్.  10 వేల సంవత్సరాలు అంటే అప్పటికి క్రైస్తవ, ఇస్లాం మతాలు పురుడు కూడా పోసుకోలేదు

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

పంచ పాత్ర :

 


👉  పంచపాత్ర అంటే ఒక పాత్ర కాదు. ఆరాధనకు అయిదు పాత్రల్లో శుద్ధోదకం ఉండాలి. మనం ఒక పాత్రలోనే అన్నీ ఉంచి మమ అనేస్తున్నాము.

మొదటిది అర్ఘ్య పాత్ర:

👉 భగవంతుని చేతులు కడిగేందుకు సమర్పించే శుద్ధ జలాలతో కూడిన పాత్ర

రెండవది పాద్య పాత్ర:

👉  ఇది భగవంతునికి పాదాలను శుభ్రపరిచేందుకు సమర్పించేందుకు శుద్ధ జలాలతో కూడిన పాత్ర

మూడవ పాత్ర:

మూడవది ఆచమనీయ పాత్ర: 

👉  ఇది భగవంతుని కి పుక్కిలించడానికి సమర్పించే శుద్దోదకం నింపిన పాత్ర. 

నాలుగవది స్నాన పాత్ర:

👉 ఇది భగవంతుని కి స్నానము చేయించడానికి కావలసిన శుద్ధోదకం నింపుకున్న పాత్ర

ఐదవ పాత్ర :

👉 ఐదవది శుద్ధోదక పాత్ర- ఇందులో భగవంతుని కి సమర్పించే జలాలు నింపుకున్న పాత్ర

👉 ఇవి పంచ పాత్రలు..ఇవి గాక ప్రతిగ్రాహక పాత్ర ఉపచారాలు చేశాక తీసిన నిర్మాల్యపు జలాలు నింపుకునే పాత్ర,మరొక శుద్ధ జలం అవసరం అయితే కావాల్సిన జలాన్ని నింపుకున్న పాత్ర, ఇంక ఆచార్య పూజ కూడా ఉండే వాళ్లకు ఆచార్యునికి అర్ఘ్య సమర్పణకు ఒక పాత్ర ఉండాలి. 

👉  ఇంకా సర్వార్థ జల పాత్ర- ఇది మన చేతులు మరియు,ప్రతీ ఉపచారానికి మధ్య మధ్యలో ఉద్ధరిణ శుభ్రం చేసి తిరిగి మరొక ఉపచారము చేసేప్పుడు వాడే దానికి శుద్ధ జలము నింపిన పాత్ర.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371
https://www.youtube.com/channel/UCHKMF3Y_XXCOi9zhEorDsiQ

Sunday, 25 February 2024

శివుణ్ణి మీరు చూడాలనుకుంటున్నారా ? ... !

 

భగవంతునికి ఎన్నో రకాల పూజా విధానాలతో మనం పూజ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు పుష్పాలు, ఎన్ని రంగులు, ఎన్ని రకాలు, ఈ దేవునికి ఈ పుష్పం ఇష్టం, ఆ దేవునికి ఆ పుష్పం ఇష్టం అని ఎక్కడెక్కడినుంచో ప్రయాసపడి  తెచ్చి దేవునికి సమర్పిస్తూ ఉంటాం. ఈ రకాల వత్తులు వాడండి ఆ రకాల వత్తులు వాడండి, ఈ షేప్లో ఉన్న వత్తులు వాడండి, ఆ రంగులో ఉన్న వత్తులు వాడండి, ఈ నూనె వాడండి, ఆ నూనె వాడండి అని చెప్పేసి ఒకటేమిటి గంధం విషయం తీసుకుంటే అశ్వగంధం, శ్వేతగంధం, సిధ్దగంధం అని ఇలా ప్రతీ దానిలో ఎన్నో రకాల వైవిధ్యాలతో కూడినటువంటి పదార్థాలను వాడుతూ ఈ మంత్రం చదవండి, ఆ మంత్రం చదవండి అని చెప్పి ఎన్నో రకాల మంత్రాలు, స్తోత్రాలు ఉపయోగిస్తూ మనం ఇన్ని రకాలు గా దేవునికి పూజ చేస్తూ ఉన్నాం కదా! 

మరి మనకు ఎందుకు దేవుడు కనిపించట్లేదు? 

వరాలు ఎందుకు కురిపించట్లేదు? 

అయితే ఇంకా ఈ కాలంలో చూస్తే వేలం వెర్రిగా ఎక్కడా దొరకని దుర్లభమైన వస్తువులు, ఎంతో విశేషమైన అలంకరణకు సంబంధించిన వస్తువులు అవన్నీ తెప్పించి ఎంతో ఆర్భాటంగా పూజ ఎంత భక్తితో చేశాము అనేది కాకుండా ఎంత ఆర్భాటంగా చేశాము అనేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ఎంత పెద్ద పందిరి వేశాము, ఎంత పెద్ద విగ్రహం పెట్టాం, ఎన్ని పూలతో పూజ చేశాము, ఎన్ని రకాల ప్రసాదాలు చేశాము, ఎంతమందికి ఎన్ని రకాల భోజనాలు పెట్టాము అని ఇలాంటి వేలంవెర్రిగా పూజా విధానాలు అన్నీ మారిపోతున్నాయి. 

అసలు ఇవేమీ లేకుండా మనకు అందుబాటులో ఉన్న రెండు పూలు భగవంతునికి సమర్పించి మనస్ఫూర్తిగా దేవునికి ఇష్టమైన ఏదోఒక ప్రసాదాన్ని సమర్పించి  మనం పూజ చేస్తే చాలు దేవుడు ప్రత్యక్షమవుతాడు. మీరూ ఇలాంటి అనుభూతి పొందాలనుకుంటే కనుక భగవంతుని మీరు దర్శించాలనుకుంటే ఇలా వేలంవెర్రి విధానాలతో కాకుండా నిజమైన భక్తితో దేవుని దర్శించాలనుకుంతున్నారా?  శివరాత్రి వరకు వేచి ఉండండి. శివరాత్రి రోజు మీరు లైవ్ గా విధాత పీఠం లో జరిగేటటువంటి పూజని దర్శించండి. దాంట్లో మీకు శివుడు నిజంగా వచ్చి ప్రత్యక్షమయ్యే నిదర్శనాన్ని మీరు తిలకించండి.

ప్రతి ఒక్కరూ విధాత ఛానెల్ ను సబ్స్క్రయిబ్, లైక్, ఫాలో చేసి రెడీగా ఉండండి. అందరం కలిసి శివరాత్రి రోజు శివుణ్ణి దర్శిద్దాం, పూజిద్దాం.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371
https://www.youtube.com/channel/UCHKMF3Y_XXCOi9zhEorDsiQ

శ్రీ విధాత పీఠంలో

 


భగవత్ భందువులందరికిీ,

 శ్రీ విధాత పీఠంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా  05-03-2024 నుండి 09-03-2024వరకు అనగా ఏకాదశి నుండి శివరాత్రి మరియు మరుసటి దినము అమావాస్య వరకు కూడా.ప్రతి రోజూ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ,శ్రీచక్రమునకు లలితా సహస్ర నామ కుంకుమార్చన,అలాగే త్రయోదశి రోజున పార్థివ శివలింగమునకు తైలాభిషేకం,శివరాత్రి.రోజున సహస్రలింగార్చన సహిత లక్ష్మీ  గణపతి,నవగ్రహ,పంచసూక్త సహిత రుద్ర హోమం  ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చన,  రుద్రాక్షలతో అర్చన ఆకాంక్ష గారి ఆధ్వర్యంలో  విశ్వేశ్వరుని. అనుజ్ఞానుసారం జరుపుటకు నిర్ణయించడం జరిగింది.

ప్రసాదముగా అభిషేకము లో వుంచి  రుద్రాక్షలు,గంగాజలం,కాలభైరవుని వద్ద ఉంచి పూజింపబడే కంకణాలు,కాశీ దారాలు,అభిషేక భస్మము,లలితాసహస్రనామము జరిపిన.శ్రీచక్రార్చన చేసిన.కుంకుమ,స్వామివారి ప్రతిమ,,విశేష ప్రసాదము,పూజించిన.లక్ష్మి గవ్వలు ,,ముఖద్వారం నకు రక్ష  మొదలైనవి ఇవ్వబడును.మీరు స్వయంగా ఆఫీసుకు వచ్చి తీసుకోవచ్చు లేదా కొరియర్ లో పంపబడును. కావున భక్త మహాశయులు తమ యొక్క గోత్రనామాలు పంపి స్వామి వారి కృపకు.పాత్రులు అయి సిద్దేశ్వరుని కరుణా కటాక్షాలు సంపూర్తి గా పొందాలని మనసారా కోరుకుంటూ 

వివరాలు ఈ క్రింది విధంగా కలవు.
బిల్వార్చన 116/-,
రుద్ర హోమం 516/- ,
ఏకాదశ రుద్రాభిషేకము 1116/-,
పురుష సూక్త , అఘోర పాశుపత సూక్త రుద్ర హోమము 2116/-,
విశేష రుద్రాక్షార్చన 1116/-, ,
కుంకుమార్చన  116/-
తైలాభిషేకం 216/-

మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు 

9666602371 నెంబరుకు gpay కానీ, phonepay   ద్వారా కానీ పంపగలరు

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 096666 02371
శివరాత్రి నాడు జరిగే పూజ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా లైవ్ లో విధాత టీవీ చానెల్లో దర్శిOచండి
https://www.youtube.com/channel/UCHKMF3Y_XXCOi9zhEorDsiQ

గ్రామదేవతా నామ విశేషాలు:

 


మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది.

1. ఊరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి "పొలిమేరమ్మ" క్రమముగా "పోలేరమ్మ" అయింది.

2. 'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము.  అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.

3. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోషించే తల్లి 'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట.  ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, 'పోచమ్మ' పోషణ కలిగిస్తుంది.

4. ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేయ+అమ్మ=కట్టమేసేయమ్మ - కాలక్రమములో "కట్టమైసమ్మ" అయింది.

5. స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్ఛమని) సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి "అచ్చమ్మ" గా అయ్యింది.

6. సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది.  'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో ఆమెను "మావూళ్ళమ్మ" అని పిలుస్తూంటే క్రమముగా అది "మావుళ్ళమ్మ" అయింది.

7. ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కె ఏదైనా అది మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి "తలుపులమ్మ".  'తలపు' అంటే ఆలోచన.  ఆ తలపులను తీర్చే తల్లి "తలపులమ్మ" క్రమముగా ఈమె "తలుపులమ్మ" గా మారింది.  ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.

8. శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది.  ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా "అంకగళమ్మ", "అంకాళమ్మ" గా మారిపోయింది.

9. పొలిమేరలో వుండే మరొక తల్లి "శీతలాంబ".  ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి.  తన గ్రామములోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామములోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే.

10. పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి "పుట్టమ్మ".  ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి.  అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు.  ఈ తల్లికే "నాగేశ్వరమ్మ" అని కూడా అంటారు.  పాప (అంటే పాము)+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి "పాపమ్మ" అని కూడా అంటారు.  సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే "సుబ్బ+అమ్మ= "సుబ్బమ్మ" కూడా దైవముగా ఉంది.

11. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటలనూ ఇచ్చే తల్లి "బతుకమ్మ".

12. గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ "కన్నమ్మ"గా ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= "సత్తెమ్మ".

13. అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న) అమ్మ "పుల్లమ్మ".  ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.

14. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = "అర్పణలమ్మ" క్రమముగా "అప్పలమ్మ" అయినది.

15. బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ= "అప్పలమ్మ" అన్నారు.

16. అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ అయినదీ పెంటి (బాల)+అమ్మ= "పెంటమ్మ".

17. భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థములో బోనముల (భోజనమనే పదానికి వికృతి)+అమ్మ= "బోనాలమ్మ".

18. అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి ఈమెను "అయ్యమ్మ" ని కొన్ని చోట్ల పిలుస్తారు.

19. లలితాంబ భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాల+అమ్మ= "గుర్రాలమ్మ" అయినది.

20. ఊరు పేరుని బట్టి పిల్చుకొనే దేవతలు కొందరున్నారు.  సోమప్రోలు+అంబ="సోమపోలమాంబ" అన్నారు. సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట.

21. సీతాదేవి వనవాసం చేసిన సమయంలో గౌతమీ నదిలో స్నానం చేసి వనదేవతలను పూజించగా ఆమె ప్రత్యక్షమైనదని అప్పటినుంచి కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పూజలు అందుకుంటుందని ప్రసిద్ధికెక్కిన తల్లి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లి అనే గ్రామంలో ఉన్న "పళ్ళాలమ్మ" "పళ్లమాంబిక".  ఇక్కడ వెలసిన అమ్మవారిని ఈ గ్రామస్తులు కాళికా దేవి అవతారంగా భావించి పూజిస్తారు.  ఈ ఆలయంలో అమ్మవారు కాలుపై కాలు వేసుకుని భక్తులకు దర్శనమిస్తారు.  ఈ అమ్మవారి పాదాల కింద నక్కను తొక్కి ఉండటం విశేషం.  ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామాలలో ఈ అమ్మవారి విగ్రహం ఉండడం విశేషం...

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

మాఘ పురాణం - 1️⃣7️⃣వ అధ్యాయము

 

ఇంద్రునికి కలిగిన శాపము

వశిష్ఠ మహర్షి, దిలీపునితో, మరల ఇట్లనెను. రాజా! మాఘమాస మహిమను వివరించు మరియొక కథను చెప్పెదను వినుము. పూర్వము, గృత్నృమదుడను మహర్షి, గంగాతీరమున నివసించుచు, మాఘమాస స్నానము, పూజాదికము చేయుచు, తన శిష్యులకు, మాఘమాస మహిమను, శ్రీ మహా విష్ణువు మహత్మ్యమును, వివరించుచుండెను. జహ్నువనుమహాముని, మాఘమాసస్నాన మహిమను వివరింప కోరగా, గృత్నృమదమహర్షి యిట్లు పలికెను. సూర్యుడు మకరరాశిలో నున్నప్పుడు, మాఘమాసము ప్రారంభమగును. అట్టి  మాఘమాసమున చేసిన స్నానము, అత్యంత పుణ్యప్రదమే కాక, పాపనాశము కూడ అగుచున్నది. మాఘమాసమున, ప్రాతఃకాలమున, నదీస్నానము చేసినవారు ఇంద్రుడు మహా పాతక విముక్తుడైనట్లుగా, పాప విముక్తులగుదురు. ఆ విషయమును వినుడు.

పూర్వము తుంగభద్రా నదీతీరమున, అన్ని వేదములను చదివిన, మిత్రవిందుడను ముని యొకడు, ఆశ్రమమును నిర్మించుకొని యుండెను. మిత్రవిందుని భార్య, అతిలోకసుందరి, ఆమె యొకనాడు, తుంగభద్రా నదిలో స్నానము చేసి, పొడిబట్టలు కట్టుకొని, కేశములనారబెట్టు కొనుచుండెను. రాక్షస సంహారమునకై, దేవతలతో గలసి యాకాశ మార్గమున పోవుచున్న యింద్రుడామెను చూచి మోహపరవశుడయ్యెను. అమెనెట్లైన పొందవలయునని, నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగివచ్చుచు, ఇంద్రుడు ఆ ఆశ్రమముపై భాగమున నుండి, మిత్రవిందముని భార్య అందమును, ఆమె చేష్టలను, గమనించుచుండెనుl.

మిత్రవిందముని, తెల్లవారుజామున, శిష్యులను మేలుకొలిపి, వేదపఠనము చేయింపవలయునని, తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్లెను. ఇంద్రుడును, ఆశ్రమములోనికి రహస్యముగ ప్రవేశించి, మిత్రవిందను పట్టుకొనెను, విడిపించుకొని పోవుచున్న ఆమెకు, తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును, కామ పరవశయై, యింద్రునిపొందు అంగీకరించెను, కోరిక తీరిన యింద్రుడు, ఆశ్రమము నుండి వెళ్ల యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని, వానిని పట్టుకొని, నీవెవడవని యడిగెను. నేనింద్రుడనని, సమాధానమిచ్చెను. మిత్రవిందుడును, జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవై , స్వర్గమునకుపోలేక, భూలోకముననే యుండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను, రాయిపై పడియుండుమని, శపించెను. ఆ చోటును విడిచి, గంగాతీరమును చేరి, అచట తపమాచరించి, యోగశక్తిచే దేహమునువిడిచి, పరమాత్మలో లీనమయ్యెనుs.

ముని శాపమువలన, యింద్రుని ముఖము మాత్రమే, గాడిద, మిగిలిన శరీరము, మామూలుగనేయుండును. అచటనుండుటకు సిగ్గుపడి, పద్మగిరియను, పర్వతమును చేరి, అచటి గుహలోనుండి, యచటనున్న గడ్డిని తిని, కాలమును గడుపుచుండెను. అతడట్లు పన్నెండు సంవత్సరములు గడపెను. రాజులేని స్వర్గముపై, రాక్షసులు దండెత్తి వచ్చి, దేవతలతో, యుద్ధము చేయుచుండిరి. దేవతలు, రాక్షసులతో, యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు యింద్రుని వెదుకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక, వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరల వారిని తరిమి కొట్టిరి. దేవతలు యింద్రుని వెదకుచు, నదీతీరములయందు సముద్రతీరమునందు, తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసమగుటచే, మాఘమాసమున నదీస్నానము చేసి, తిరిగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి, మీరు చేయు వ్రతమేమి? దాని వలన వచ్చు ఫలమేమి? అని ప్రశ్నించిరి, మునులు వారికిట్లనిరి.

దేవతలారా వినుడు. మేము చేయువ్రతము మాఘమాసవ్రతము. సూర్యుడు మకర రాశి యందుండగా, ప్రాతఃకాలమున, /తటాకదులందు స్నానము చేయుట, శ్రీమహావిష్ణుపూజ, పురాణ పఠనము, యధాశక్తి దానము. దీనివలన దుర్లభమైన మోక్షము కూడ సులభమగును. మాఘ

మాసమున చేసిన మాధవస్మరణ, సర్వపాపములను నశింపచేయును. మాఘమాస స్నానము, పూజ, మున్నగునవి చేయు వారి యదృష్టమనంతము. మాఘశుద్ధ చతుర్దశియందు, గోదానము, వృషోత్పర్జనము, తిలదానము ఆవూప దానము, పాయసదానము, వస్త్రకంబళములదానము, విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీమహావిష్ణువు దయవలన, సర్వలోకములు, సులభములైయుండును అనుచు, మునులు, దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలును, దివ్యమునులు మాటలను విని, మాఘస్నానమును సముద్రమున చేసి, శ్రీమహ విష్ణువు నర్చించిరి. వారికి శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీమహా విష్ణువు, మృదువైన శరీరము, చతుర్భుజములు, కలిగియుండెను. శంఖచక్ర గదాపద్మములను, నాలుగు చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి, కిరీటముతో, మరింత మనోహరముగ నుండెను. కంకణములు, వారములు, వైజయంతీమాల,మున్నగు అలంకారములను ధరించి, గంభీర మనోహర రూపముతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీమహావిష్ణువును, దేవతలిట్లు స్తుతించిరిl.

స్వామీ: నీవు జగములకే గురువువు. వేదవేద్యుడవు. నీయనుగ్రహము లేనిదే, యెవరును, నిన్నెంతటి వారైనను, యెరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ, వ్యాస మహర్షిని, పాదముల మహిమను స్తుతించి, కృతార్థులైరి. అట్టి నీకు, మా నమస్కారములు స్వామీ! నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి, స్వర్గమును, మోక్షమును, అనుగ్రహింతువు.

సమస్తమును, నీవే వ్యాప్తమైయున్నది. నీవు సచ్చిద్రూపుడవు, సత్యవాక్కువు, స్వామీ! యిట్టి నీకు నమస్కారము. నీవు త్రిమూర్తి స్వరూపుడవై, సృష్టి స్థితిలయముల, నిర్వహించుచున్నావు. సర్వసృష్టి నశించి, జలమయ మైనప్పుడు మఱ్ఱి ఆకుపై పరుండి, చిదానంద స్వరూపడువైయుందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను, నీవు తప్ప,మరెవరును యెరుగజాలరు. కర్మ ప్రకృతి గుణభేదముల ననుసరించి, సృష్టించి,  వాని యాందాసక్తుడవై యున్నట్లుండి, నిరాసక్తుడవై, అద్వితీయరూపమున నున్న నీకు, నమస్కారము. సర్వవ్యాప్తుడవైన, నిన్నెవరును యెరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు, అన్నింటిని సృష్టించిన వాడవు నీవే, ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉధ్ధవుడు, మొదలగు ఉత్తమపురుషులు మాత్రమే, నిన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములును, నీవే మాట మనస్సు మున్నగువానికి అందని నీరూపమును, నిన్ను స్తుతించుట తప్ప,యేమియు చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని గోల్పోయి, రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము. అని దేవతలు పలు రీతుల శ్రీమహావిష్ణువును స్తుతించిరి.

దేవతలయందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు, వారికి ప్రసన్నుడై, యిట్లనెను. దేవతలారా! యింద్రుడు ముని శాపముచే, దివ్యశక్తులను కోల్పోయి, గాడిద మొగము కలవాడై, పద్మగిరి గుహలలో, సిగ్గుపడి, దాగియున్నాడు. అతడు, ముని భార్యను మోహించి, ఆమెననుభవించి, దోషము చేసి, మునిశాపమునందెను. పద్మగిరి, దోకర్ణ సమీపముననున్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున, అరుణోదయ పుణ్యకాలమున, గార్దభ ముఖుడైన ఇంద్రునిచే, నదీస్నానమును చేయింపుడు. అందువలన, ఇంద్రుడు, గాడిద ముఖమును విడిచి, మంచి ముఖము కలవాడై, పూర్వమువలె, దివ్య శక్తులను పొంది, మిమ్ము రక్షింపగలడు, కావున మీరు, వానిచే, మాఘమాస అరుణోదయపుణ్యకాలమున, నదీస్నానము చేయింపుడని చెప్పెను.

దేవతలు, శ్రీమహావిష్ణువు మాటలనువిని, విస్మితులైరి. స్వామి ముని శాపపీడితుడైన ఇంద్రుడు, కేవల మాఘస్నానముచే, 

స్వస్థుడగునా? విచిత్రముగ నున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా! మాఘమాసస్నాన మహిమను, మీరెరుగకపోవుటచే, ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో, ఇంద్రుడు యధా పూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము, సందేహము అక్కరలేదు. పూర్వము, విశ్వామిత్ర మహర్షియు,

ఇoద్రుని వలె, పాపమును చేసి, కపిముఖుడై, మాఘస్నానము చేసి, పూర్వ స్థితి నందెనని చెప్పెను. ఆ మాటలకు, దేవతలు, మరింత యాశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును, చెప్పుమని, శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణువిట్లు పలికెను. వినుడు. పూర్వము విశ్వామిత్ర మహర్షి, భూప్రదక్షిణము చేయుచు, గంగాతీరమునకు వచ్చెనుv. మాఘమాసకాలమగుటచే, గంధర్వులు తమ భార్యలతో కలిసి, గంగా స్నానము చేయవచ్చిరి. అట్లు వచ్చిన దంపతులులలో, ఒక గంధర్వుడు, మాఘమాసమున, నదీస్నానము చేయుచు, భార్యను కూడ, నదీస్నానము చేయుటకు, రమ్మని పిలిచెను. భర్తతో, భూలోకమునకు వచ్చి గంగాతీరమును చేరిన ఆమె "ఈ చలిలో, నాకీచన్నీటి స్నానము బాదాకరము. నేను స్నానము చేయజాలను. మీకు శక్తి, యిష్టము, ఉన్నచో, మీరు చేయుడని, గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడెంత చెప్పినను, వాని భార్య, భర్త మాట వినలేదు. స్నానము చేయలేదు. గంధర్వుడు, మిగిలిన వారితో గలసి, స్నానము చేసెను. గంధర్వుడు, భార్య మాఘస్నానమును ధూషించి, నిరాకరించుటచే, ఆమె దివ్య శక్తులను కోల్పోయెను. స్నానము చేసి, తిరిగి వచ్చి, తమ లోకమునకు తిరిగి వెళ్లుసందడిలో, గంధర్వుని భార్యను, మిగిలినవారు గమనించలేదు. దివ్యశక్తులతో, గంధర్వులు, తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య, గంగాతీరమున దివ్యశక్తులను కోల్పోయి, అసహాయురాలై తిరుగుచుండెను.

ఆమె అడవిలో తిరుగుచూ, విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి, వయ్యారముగా, క్రీగంటచూసెను. ఆమె అందానికి, యవ్వనానికి, విశ్వామిత్రుడు తన్మయుడై, ఆమెను ప్రేమించుటచే, యిద్దరూ  కామక్రీడలలో తెలియాడుచుండగా, మరల ఆ గంధర్వుడు, తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా, విశ్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడిoచుచుండిరి. ఆ 

దృశ్యమును చూచి, మండిపడుచు, తపస్వివై యుండి కూడా, యిలా కామతృష్ణ కలవాడవైనందున, నీకు కోతి ముఖము కలుగుగాకయని, 

విశ్వామిత్రుని, పాషాణమై పడియుండమని, భార్యను శపించి, వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక, వానర ముఖం కలిగియుండగా, నారదుడు ఆ విషయము తెలుసుకొని, విశ్వామిత్రుని కడకు వచ్చి, " విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై, నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము. గంగానదిలో స్నానము చేసి, నీ కమండలములో గంగా జలము తెచ్చి, ఈ పాషాణముపై చల్లుము", అని వివరించగా, విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి, విష్ణువును ధ్యానించి, కమండలముతో నీరు తెచ్చి, పాషాణముపై చల్లగా, ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ  రూపమును పొంది, గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నందిన విశ్వమిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.దేవతలారా! మాఘస్నానము మహిమ, మాటలకు అందదు. చాలా గొప్పది. కావున మీరు, గాడిద ముఖము కలిగి, సిగ్గుపడి, పద్మగిరిలో నున్న ఇంద్రునిచే, మాఘస్నానమును చేయింపుడు. అప్పుడు అతనికి శాపవిముక్తి యగునని శ్రీమన్నారాయణుడు, దేవతలకు, యింద్రుని శాపవిముక్తికి ఉపాయమును సూచించెను.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371