Sunday, 3 July 2016

దక్షిణాముఖుంలో కోలువైన పరమేశ్వరుని మహిమాన్విత కోపేశ్వర మందిరం ...

దక్షిణాముఖుంలో కోలువైన పరమేశ్వరుని మహిమాన్విత కోపేశ్వర మందిరం ....

ఆలయం104 ’పొడవు, 65’ వెడల్పు. 55’ ఎత్తుతో ఉన్న ఈ బృహన్మందిరంలో ప్రధానంగా నాలుగు భాగాలు ఉన్నాయి. స్వర్గమంటపం, సభామంటపం, అంతరాళ కక్ష్య, గర్భగృహం అడుగడుగునా కళ్లు చెదిరేలా శిల్పసంపద నిక్షిప్తమై ఉంది. స్వర్గ మంటపం గుండ్రంగా 36 వ్యాసంతో ఉంది. చుట్టూ కప్పుకి ఆధారంగా పన్నెండు స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభం మీదా రాజవంశీయుల శిల్పాలు అందంగా అమర్చారు. మంటపం మధ్యలో 14 వ్యాసం కలిగిన నల్లని శిల ఉంది. తలపైకెత్తి గోపుర గవాక్షం చూస్తే అద్భుతంగా ఆకాశం కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసపు తొలిరోజు (ఉగాదినాడు) ఈ గవాక్షంలోంచి సూర్యకిరణాలు నేరుగా కోపేశ్వర స్వామిని సృ్ఫశిస్తాయి.
మహారాష్ట్రలోని మరుగున పడ్డ మహనీయ క్షేత్రమిది. ఈ శైవ క్షేత్రం చేరటా నికి రైల్లో కొల్హాపూర్‌గానీ, మీరజ్‌గానీ, సాంగ్లీ కానీ చేరుకుని తర్వాత రోడ్డు మార్గాన ప్రయాణం చేయాలి. ఈ ప్రదేశాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. ప్రయివేటు వాహనాలు సరేసరి. ఇక్కడి శిల్పకళారా మమైన కోపేశ్వర మందిరం ప్రతి ఒక్కరూ చూడవలసినది. దీన్ని శిలాహర్‌ వంశానికి చెందిన గండరాది త్యుడు, రెండో భోజుడు క్రీ.శ. 1109-1180 మధ్యలో నిర్మించినట్లు తెలిపే శాసనాలు దొరికాయి.



ఇంత అద్భుతంగా దేవాలయ గవాక్షాన్ని మలచిన మధ్యయుగాల నాటి ఆలయ నిర్మాతలు ఎంతటి విజ్ఞానవంతులో! దీని తర్వాతది సభామంటపం-యాభై అడుగుల చదరం. లోపలి కక్ష్యలో 12, బయటి కక్ష్యలో 20 స్తంభాలున్నాయి. 20 నుంచీ 25 పొడవుండే ఏకశిలా స్తంభాలివి. వీటికి అనేక పార్శ్యాలు న్నాయి. సభామండపం పై కప్పు మీద విరిసిన పద్మం 3డి పద్ధతిలో ఆవిష్కృతమై అద్భుతంగా ఉంది. ఈ మండపం అంతా ఫలపుష్పాలతో, పూర్ణకుంభాలతో నిండి శిలాహార రాజవంశీయుల కళాభిరుచికి అద్దం పడుతోంది. గాలి వెలుతురుల కోసం ఎక్కడికక్కడ గవాక్షాలు ఉన్నాయి.














20 చదరపు అంతరాళ కక్ష్య దాటి వెళ్లితే గర్భగృహం ఉంది. అందులో దక్షిణాముఖుడైన ఈశ్వరుడు కంచు సర్వభూషణంతో దర్శనమిస్తాడు. ఇంతటి మహోన్నత ఆలయాన్ని మరుగున పడనీయకుండా బ్రతికించుకోవటం మన కర్తవ్యం. పదుగురినీ తీసుకువెళ్లి పరిచయం చేస్తే ఆలయానికి భక్తులు పెరుగుతారు, భక్తుల రాకపోకతో ఆలయన్ని ఆదరించి నిలపాలన్న ఆరాటమూ పెరుగుతుంది. ఇది మన బాధ్యత

No comments:

Post a Comment