🌿బాల మానవులందరికీ ఇష్టమైన దైవం లక్ష్మీదేవి .... ఆవిడ అనుగ్రహాన్ని వాంఛించని వారు ఉండరు .... అయితే ఆ తల్లి కరుణ పొందినా వినయంతో ఉండేది కొందరైతే అహంకారపూరితులై అష్టకష్టాలు పడేది మరికొందరు.
🌸అమ్మవారు పాద స్థానములో ఉంటే ఆ మానవులకు పెద్ద పెద్ద భవంతులు , విలాస వంతమైన గృహాలు లభిస్తుంది !
🌿తొడలలో అమ్మవారు శక్తి ఉంటే ధనసమృద్ధి విశేషంగా కలుగుతుంది !
🌸గుహ్య భాగంలో ఉంటే భార్యసుఖసాంసారిక ఆనందం కలుగుతుంది !
🌿రొమ్ము భాగంలో ఉంటే మనోరథాలు శీఘ్రంగా సిద్దిస్తూ ఉంటుంది !
కంఠ భాగంలో ఆ తల్లి తేజస్సు ఉన్నపుడు ఆభరణ ప్రాప్తి కలుగుతుంది !
🌸ముఖంలో లక్ష్మీదేవి నివాసమై ఉన్నప్పుడు అన్నసమృద్ధి ! మధురమైన కవిత పాండిత్యం , జ్ఞానశక్తి లభిస్తాయి !
🌿ఇక ఈ ఆరు స్థానాలూ దాటి తలపైకెక్కిందో ...
వారి దగ్గర లక్ష్మీదేవి నిలబడదు ....
వివేకహీనుడై దుష్కార్యాలు చేసి తెలివిమాలిన తనంతో ఆమె అనుగ్రహాన్ని కోల్పోతాడు అని శ్రీ దత్తాత్రేయ స్వామి వారు దేవతలకు బోధించారట.
లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు
🌸దక్షిణావర్తన శంఖం
ముత్యాల శంఖం
ఏకాక్షి నారికేళం.
🌿ఈ వస్తువులను పూజా మందిరంలో వుంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ....
దక్షిణావర్తన శంఖం :
🌸ఈ శంఖం కడుపు ఊదే వారి కుడి వైపుకు తెరుచుకొని ఉంటుంది. ఇలాంటి శంఖాన్ని దక్షిణావర్తన శంఖం అంటారు. దీనికి వ్యతిరేక దిశలో తెరచుకొని ఉండేవి వామావర్తి శంఖమని అంటారు.
🌿లక్ష్మీదేవికి ఈ శంఖమంటే ఎందుకు అంత ఇష్టం అంటే లక్ష్మీదేవి సముద్రము నుండి జన్మించింది.ఈ శంఖం కూడా మనకు సముద్రంలోనే దొరకుతాయి.
🌸మనకు సామాన్యంగా దొరికేవి వామావర్తి శంఖలే కావడం విశేషం.
అయితే దక్షిణావర్త శంఖం దొరకడం కష్టసాధ్యమే అయినా ఈ శంఖాన్ని లక్ష్మీదేవి సోదరిగా వర్ణిస్తారు మునిశ్రేష్టులు.
🌿దక్షిణావర్తి శంఖాలు మ్రోగవు.కానీ మ్రోగేవి దొరికితే పూజామందిరంలో పెట్టుకొని పూజించాలి.
పగిలినవి , విరిగినవి , పల్చని పొర కలిగినవి , గరుకైన ముక్కు , రంధ్రాలు ఉన్నవి పూజాకు పనికి రావు.
🌸ఈ శంఖాలు ఉన్న ఇంట్లో అష్టైశ్వర్యాలు సమకూరుతాయని ప్రసిద్ధి. ఈ శంఖాలు కన్యాకుమారి , రామేశ్వరంలో దొరుకుతాయని ప్రసిద్ధి .
ముత్యపు శంఖం
🌿ముత్యపు శంఖం కనతిలో గుండ్రంగా ఉండే శంఖం ఇది. ఈ శంఖం కూడా అత్యంత అరుదుగా దొరికేవే.
ఈ శంఖాన్ని బుధవారం రోజు..
🌸" ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై
ధనదాన్య సంరుద్ధిం దేహి దేహి నమః "
🌿అని ఈ మంత్రాన్ని 108 సార్లు స్మరిస్తూ పూజిస్తే సకల దారిద్ర్యాలు దూరమవుతాయి . ఏకాక్షి నారికేళం
సాధారణంగా కొబ్బరికాయలకు రెండు కళ్ళు ఉంటాయి.
🌸కానీ అరుదుగా దొరికే ఒకే కన్ను
( ఒంటి కన్ను ) నారికేళం ఉంటుంది.ఈ ఏకాక్షి నారికేళాన్ని ఒక పళ్ళెంలో చందనం , కుంకుమ వేసి వాటిపై అష్టదళ ముగ్గు వేసి ,
🌿దానిపై ఏకాక్షి నారికేళాన్ని ఎర్రనివస్త్రంలో ఉంచి అభిషేకిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
ధనలాభం చేకూరుతుంది.
No comments:
Post a Comment