తొమ్మిది రోజుల పాటు బొమ్మల కొలువు పెట్టుకోవచ్చు. అవకాశం లేనివారు మకరసంక్రాంతినాడు మాత్రమే కూడా పెట్టుకోవచ్చు. పూర్వం శతానీకుడనే మహారాజు భార్య సంక్రాంతినాడు శ్రీమహావిష్ణువు తదితర దేవతా విగ్రహాలను, జంతువుల బొమ్మలను కొలువుగా పెట్టింది. ఆ బొమ్మలనే పిల్లలుగా భావించి మిఠాయిలు, మరమరాలు, శనగపప్పు, బెల్లం, అటుకుల్లాంటి చిరు పదార్థాలను నివేదన చేసింది. రాజ్యంలోని పిల్లలందరికీ వాటిని పంచిపెట్టింది. అలా చేయడం వల్ల పిల్లలంతా సంతోషించారు. పిల్లల ఆనందం కారణంగా తొందరలోనే ఆమెకు పూర్ణాయుర్దాయం కలిగిన సంతతి కలిగింది. బొమ్మల కొలువు పెట్టిన ఇళ్లలో సంతానం పూర్ణాయుర్దాయంతో ఆరోగ్యంగా వర్థిల్లుతుందని చెబుతారు.
No comments:
Post a Comment