గత వారం జరిగిన అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం వార్తలు పాశ్చాత్య మీడియా కవర్ చేస్తూ ధ్వంసం చేయబడ్డ పాత మసీదు స్థానంలో నిర్మించబడ్డ రామమందిరాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు అని రాశారు. అంతే కానీ, అంతకు ముందే ఉన్న దేవాలయం ధ్వంసం చేయబడి మసీదు కట్టారు అని సుప్రీంకోర్టు నిర్ధారించిన విషయాన్ని కావాలని దాచిపెట్టి వార్తలు రాశారు.
అయితే, ఇలా గతంలో ముస్లిమ్స్ దాడుల్లో ధ్వంసం అయిన పాత మత కట్టడాలను తిరిగి మిగతా దేశాల్లో పునరుద్ధరించలేదా అని చూస్తే చాలా దేశాల్లో ఇలా చర్చిలను పునరుద్ధరించిన సంఘటనలు ఉన్నాయి.
కానీ, మన దేశాన్ని పాలించిన తెల్లదొరలకు ఇప్పటికి భారత్ అంటే చిన్న చూపే. అందుకే అటువంటి వక్రీకరణ రాతలు. అన్నట్లు, వారికి వంత పాడుతూ వారు చెప్పేవే గొప్ప అనుకునే మేధావులు, పాత్రికేయులు, మార్క్సిస్టు చరిత్ర కారులు ఈ విషయం లో వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు కానీ ఏ నాడు వాటిని ఖండించిన దాఖలాలు లేవు.
ఇది ఇలా ఉండగా, పాల్ అన్తనో పౌలస్ అనే కెనేడియన్ గ్రీస్ దేశంలో ఇలా పునరుద్ధరించబడిన చర్చి ల వివరాలు తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నాడు.
వాటి వివరాలు క్రింద ఇస్తున్నాను.
1. 4వ శతాబ్దం ADలో నిర్మించబడిన థెస్సలోనికిలోని అజియోస్ డెమెట్రియోస్ చర్చి 1493లో మసీదుగా మారింది, అయితే చివరకు 1949లో చర్చిగా పునర్నిర్మించబడింది.
2. మొనేంవసియా లో హాగియా సోఫియా చర్చి సుమారు 1150 నాటిది. కానీ 1715లో మసీదుగా మారింది. 1827లో మళ్లీ చర్చిగా మార్చడానికి మరమ్మతు పనులు చెసారు.
3. మిస్ట్రాస్‌లోని హగియా సోఫియా 1300లలో నిర్మించబడింది, ఒట్టోమన్ ఆక్రమణ సమయంలో మసీదుగా చేశారు. 1830లో గ్రీస్ స్వాతంత్ర్యం పొందిన వెంటనే మళ్ళీ చర్చిగా మార్చబడింది.
4. రోడ్స్‌లోని అజియోస్ స్పిరిడాన్ చర్చి 1200లలో నిర్మించబడింది, 1522లో ఒట్టోమన్‌లు ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మసీదుగా మార్చారు, అయితే ఒట్టోమన్లు తరిమేసిన తర్వాత తిరిగి చర్చిగా మార్చారు. అయితే దాని మినార్ ఇప్పటికీ ఉంది.
5. థెస్సలొనీకిలోని పనాజియా చాల్కీన్ చర్చ్ 1028లో నిర్మించబడింది, 1430లో ఒట్టోమన్లు నగరాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మసీదుగా మారింది, కానీ 1934లో తిరిగి పునరుద్ధరించబడింది.
6. రోడ్స్‌లోని హోలీ ట్రినిటీ చర్చి 1365 మరియు 1374 మధ్య కాథలిక్ చర్చిగా నిర్మించబడింది, ఒట్టోమన్‌లచే ఖాన్ జాడే మెస్సిడి పేరుతో మసీదుగా మార్చబడింది, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ద్వీపం గ్రీస్‌లో విలీనం అయినప్పుడు ఆర్థడాక్స్ చర్చిగా మార్చబడింది.
7. థెస్సలొనీకీలోని ప్రవక్త ఎలిజా చర్చ్ 1300లలో నిర్మించబడింది, 1430లో ఒట్టోమన్లు నగరాన్ని స్వాధీనం చేసుకున్న వెంటనే మసీదుగా మార్చబడింది మరియు 1900ల ప్రారంభంలో విముక్తి తర్వాత మళ్లీ పునరుద్ధరించబడింది.
8.చానియాలోని సెయింట్ నికోలస్ చర్చి వాస్తవానికి 1320లో నిర్మించిన కాథలిక్ చర్చి, ఒట్టోమన్ ఆక్రమణ సమయంలో మసీదుగా మార్చబడింది మరియు 1918లో ఆర్థడాక్స్ చర్చిగా మార్చబడింది.
9.రోడ్స్‌లోని పనాగియా టౌ కాస్ట్రో సుమారు 1000లలో నిర్మించబడింది, 1522లో ఒట్టోమన్లు ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు మసీదుగా మార్చబడింది మరియు 1912లో ఇటాలియన్లు రోడ్స్‌ను పట్టుకున్నప్పుడు తిరిగి క్రైస్తవ చర్చిగా మార్చబడింది
10. థెస్సలొనీకిలోని పమ్మెగిస్టోయ్ టాక్సియార్చెస్ చర్చి 1300లలో నిర్మించబడింది, 1430లో ఒట్టోమన్లు నగరాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు మసీదుగా మారింది మరియు 1912లో మళ్లీ చర్చిగా మార్చబడింది.
పైన చెప్పినవే కాక పాల్ ఇంకా చాలా ఉదాహరణలు ఇచ్చాడు. అంటే ముస్లిమ్స్ ఎక్కడ దండయాత్ర లు చేస్తే ఆ ప్రాంతాల్లో గల ప్రాచీన మత కట్టడాలను ధ్వంసం చేయడమో లేదా కొద్ధి పాటి మార్పులు చేసి మసీదులుగా మార్చడమో చేయడం వారికి అలవాటు. మన దేశంలో వారు చేసినవి అయితే ఇంకా దారుణం.
మన భారత్ లో కూడా సుమారు 40వేల దేవాలయాలను ఇలా చేసారు అని చెప్పి సీతారాం గోయల్ "హిందూ టెంపుల్స్ వాట్ హాపేండ్ టు థెమ్" అనే పుస్తకాలలో (ఈ పుస్తకం అతను రెండు వాల్యూమ్స్ గా రాసారు) పక్కా ఆధారాలు ఉన్న 2000 ముఖ్య దేవాలయాల పేర్లను ప్రస్తావించారు. అతను ఈ విషయం లో సర్వే నిర్వహించారు.
యే దేశానికి అయినా స్వాతంత్రం రావడం అంటే ఒట్టి అధికార మార్పిడి మాత్రమే కాదు, పాత పాలకుల కాలం లో ధ్వంసం చేయబడ్డ పురాతన సాంస్కృతిక చిహ్నాలను మళ్ళీ పునరుద్ధరించుకోవడం, వాళ్ళు తమ గొప్పతనాన్ని చాటుకునేందుకు వక్రీకరించి రాసిన ఈ దేశ చరిత్రను తిరిగి రాసి ప్రజలకు, విద్యార్థులకు అందచేసి మళ్ళీ ఈ సంస్కృతి గొప్ప తనం తెలియచేసి వారిలో ఆత్మనూన్యతా భావాన్ని తగ్గించడం వంటి చర్యలు కూడా చేపట్టాలి.
అదేంటో, ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం, దురదృష్టం. స్వాతంత్రం మనకు ఒక్క అధికార మార్పిడి మాత్రమే ఇచ్చింది. గతంలో మన ప్రజలను హింసించి, దేవాలయాలు ధ్వంసం చేసి, ఇక్కడ ఆస్తులు దోచుకున్న ముష్కర పాలకుల జ్ఞాపకాలను చేరిపే ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. పై పెచ్చు వారు చాలా గొప్పవారు, కరుణా మూర్తులు ఈ దేశానికి గొప్ప సాంస్కృతిక వైభవం తెచ్చారు అంటూ అబద్దపు చరిత్రను పిల్లల పాఠ్య పుస్తకాలలో రాశారు.
దాని వల్ల జరిగింది ఏమిటీ? మా పాత ముస్లిం పాలకులు చాలా గొప్పవాళ్ళు వాళ్ళ వల్లే దేశం ఈ స్తితిలో ఉంది, మాకు మాత్రమే ఈ దేశాన్ని పాలించే అర్హత ఉంది అని ఈ దేశంలో ఒక వర్గ ప్రజల్లో అవసరం లేని ప్రమాదకర విచ్ఛిన్నకర ధోరణి ఈ 75 సం. లలో ప్రబలింది.
జరిగింది ఏదో జరిగింది. ఇకనైనా విద్యార్థులకు సరి అయిన చరిత్ర తెలిపే ప్రయత్నాలు మొదలు పెట్టాలి.
No comments:
Post a Comment