Monday 22 January 2024

 


ప   శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది

     శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై యున్నది  

చ 1)ఘోరమైన పాతకములు గొట్టేనన్నది మమ్ము

     జేరకుండ నాపదలను చెండేనన్నది         శ్రీరామ 

   2)దారి తెలియని యమదూతల తరిమేనన్నది 

     శ్రీమన్నారాయణ దాసులకు చెలువైయున్నది  శ్రీరామ 

   3)మాయావాదుల పొందు మానుమన్నది -యీ 

     కాయ మస్థిరమని తలపోయుచున్నది         శ్రీరామ 

   4)వదలని దుర్విషయ వాంచ వదలమన్నది -నా

     మదిలో హరి భజన సంపత్కరమైయున్నది   శ్రీరామ 

   5)ముక్తిమార్గమునకిది మూలమన్నది -వి

     రక్తుడు భద్రాచల రామదాసు డన్నది     శ్రీరామ 

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment