Monday, 22 January 2024

రాముడు ఎవరు?

 


                

ఎందుకు పూజిస్తున్నాం ఆయనను?

మనలాగే మానవ జన్మెత్తాడుకదా!

 ఏమిటి speciality .. ?

ఈ రామాయణాన్ని వ్రాసిన మహర్షి వాల్మీకి (నేటిలెక్కలలో ఒక గిరిజనుడు).

రాముడికి సహాయం చేసిన వారు గిరిజనులు (వానరులు)

రాముడు ఎంగిలి తిన్నది ఒక గిరిజన స్త్రీది(శబరి).

రాముడికి అన్యాయం చేసినది వేదవేదాంగవేత్త అయిఉండి కూడా రాక్షసప్రవృత్తికలిగిన వాడు (రావణుడు).

పదిహేను సంవత్సరాల ప్రాయంలోనే  ఘోరరాక్షసి తాటక ప్రాణాలను వైతరిణి దాటించాడు!

శివధనుస్సును అవలీలగా ఎక్కుబెట్టి అతివ సీతను గెలుచుకున్నాడు! 

భార్యాభర్తల అనురాగానికి ఈ రోజుకు కూడా వారే నిర్వచనం! 

ఎప్పటికీ వారే!

అర్ధరూపాయి ఆస్థికోసం కన్నతండ్రిని అడ్డంగా నరికే అధములున్న ఈ సృష్టిలో...

ఇంకాసేపట్లో పట్టాభిషేకము, 

చక్రవర్తి కాబోతున్నాడు! 

అంతలోనే తండ్రి ఆదేశము అడవులకు పొమ్మనమని!

ఏ మాత్రం తొణకలేదు! బెణకలేదు!

తండ్రి పట్ల రవ్వంత ధిక్కారమూలేదు! 

అడవికి..

ప్రియసతితో,అనుంగుసోదరుడితో పయనమయ్యాడు!

తన ప్రియమిత్రుడు,ఆత్మసమోసఖా! ఆత్మసఖుడయిన గుహుడిని ఆప్యాయంగా కౌగలించుకొని ఆదరంగా పలకరించి మౌనంగా గంగ దాటాడు!..

ఈ గుహుడు ఒక నిషాదుడు .. రాముడి ఆత్మ!

అన్నా! నీకన్నా రాజ్యం నాకు ఏపాటిది! నేను నీకు సేవకుడిని అని తమ్ముడు భరతుడు కన్నీటితో పాదాలు కడిగి ప్రార్దించినా, పూవులలోపెట్టి రాజ్యాన్ని తిరిగి అప్పగించినా, తండ్రికి అనృతదోషము అంటకూడదని భరతుడి ప్రార్దన తిరస్కరించాడు!

అన్నదమ్ముల అనురాగానికి ఈ నాటికీ ఎవ్వరూ చేరుకోలేని శిఖరాలు ఆ నలుగురు అన్నదమ్ములు!

భార్య అపహరింపబడ్డ తరువాత అంత దుఃఖాన్ని దిగమింగి జటాయువుకు దహన సంస్కారాలు చేసి పశు పక్ష్యాదులు కూడ మనలాంటి ప్రాణులే అని లోకానికి సందేశమిచ్చాడు!

పోతే పోయిందిలే ఆడవాళ్ళు బోలెడంత మంది దొరుకుతారు, నాకేంటి మహారాజును! అని అనుకున్నాడా...లేదు !

ఆవిడ దొరికేంత వరకు ప్రాణంలేని కట్టెలాగ బ్రతికాడు తప్ప అన్య స్త్రీలను కన్నెత్తి చూసికూడా ఎరుగడు!...

మనుషులను క్రమ పద్ధతిలో నడిపి విజయాలు చాలామంది యోధులు సాధించారు!..

కానీ..

చంచల స్వభావులయిన కోతులను ఒక్కతాటిమీదకు తెచ్చి విజయం సాధించాడు.

బలమయిన శత్రువును జయించడానికి ఎంత Organisational skills కావాలి!

ఎంత patience ఉండాలి! 

ఎంత స్పష్టదృష్టి(clear vision) ఉండాలి!

రావణలంక స్వర్ణలంక! అది వశమయిన తరువాత కూడా  అయోధ్యకు తిరిగి వెళ్ళాడు తప్ప, లంకానగర వైభవం ఆయనను ఏమాత్రం మోహంలో పడేయలేదు!

బలము,వీర్యము,తేజస్సు,పితృవాక్పానఏకపత్నీవ్రతము,సోదరప్రేమ,ధర్మవర్తనంగొప్పనాయకత్వం,స్నేహధర్మం...

 ఇంతేనా!... 

ఆయన సర్వభూతమనోహరుడు! 

ఏదిలేదు ఆయనదగ్గర!

ఒక్కొక్కలక్షణము ఒక్కొక్క ఎవరెస్టు శిఖరమే ..!

ఆయన తరువాతనే ఎవరయినా!

Take any parameter he is the best.. ultimate!

ఏకాలంలో అయినా అత్యుత్తమ మానవుడు ఆయనే!

‘అత్యుత్తమమైనవన్నీ నేనే!’ అని కదా కృష్ణపరమాత్మ చెప్పినది!

రుద్రులలో..శంకరుడు

వేదాలలో ..సామవేదము

పక్షులలో ..గరుత్మంతుడు

చెట్లలో ...రావిచెట్టు

మృగాలలో..సింహము

శస్త్రధారులలో..శ్రీ రాముడు ఈవిధంగా  అంతేనా!

Negative ultimate 

వంచకులలో.. జూదముకూడా ఆయనే!

(Negative, positive మనకు! There is nothing like positive or negative... situation makes it..)

విభూతియుక్తము,ఐశ్వర్యయుక్తము,

కాంతియుక్తము,శక్తియుక్తము,అయినవి ఏదయినా ఆయనే! ఆయన అంశే!

యద్యద్విభూతిమత్ సత్త్వం  శ్రీ మదూర్జితమేవ వా

తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంశసంభవమ్!

మరి శ్రీ రాముడు ఈ నిర్వచనం ప్రకారం  

రామ "బ్రహ్మమే"కదా!

🙏శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః🙏

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment