అయోధ్య రామ మందిరంలో జనవరి 22న శ్రీరామ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని అన్ని కార్యాలయాలకు హాఫ్ డే సెలవు ప్రకటించగా.. పలు రాష్ట్రాలు కూడా జనవరి 22న సెలవు దినంగా ప్రకటించాయి. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రీరామ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా సెలవు ప్రకటించింది.
జనవరి 22న మహారాష్ట్రలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయడతాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పారిశ్రామిక సంస్థలు మధ్యాహ్నం 2.30 గంటల వరకు మూసివేస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగం బ్యాంకులు, బీమా కంపెనీలు మధ్యాహ్నం 2.30 గంటల వరకు సగం రోజు మూసివేయబడతాయి.
మరోవైపు ఇప్పటికే హర్యానా, మధ్యప్రదేశ్ ,మిజోరాం, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాలు జనవరి 22న శ్రీరామ ప్రాణ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు
No comments:
Post a Comment