Sunday 21 January 2024

స్థిర చరాస్తులు-జ్యోతిష్య విశ్లేషణ

 




సాధారణంగా జాతకులు అడిగే ప్రశ్న మా పూర్వీకుల ఆస్తులు మాకు వస్తాయా ,మేము ఆస్తులు ఎక్కువగా సంపాదించుకుంటామా, మేము సంపాదించిన స్థిరచరాస్తులను మావారసులు అనుభవించగలుగుతారా.. ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వీటికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా స్పష్టమైన వివరణ ఉంది. జాతకుడు యొక్క లగ్నం నుండి 5 లేదా 11వ స్థానాలలో శుక్లపక్ష చంద్రుడు ఉన్నప్పుడు మీ పూర్వీకుల ఆస్తులు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీకు వస్తాయి. వాటితో పాటు మీ ఆస్తులను చాలా ఎక్కువగా విస్తరించుకుంటారు. మీరు సంపాదించిన ఆస్తులు కూడా మీ వారసులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇస్తారు. ఈ సూత్రం వర్తించడానికి ఒక నియమం ఉంది. మీ లగ్నం నుండి 5వ స్థానంలో కానీ 11వ స్థానంలో కానీ శుక్లపక్ష చంద్రుడు ఉన్నప్పుడు ఆ చంద్రుడు నుండి కేంద్ర స్థానాలైన ఒకటి ,ఏడు, పదవ స్థానాలలో శుభగ్రహాలైన గురువు శుక్రుడు బుధుడు వీరిలో ఏ ఒక్క గ్రహమైన సరే ఉండాలి. అప్పుడు ఈ నియమం సంపూర్ణంగా వర్తిస్తుంది. పూర్వీకులు సంపాదించిన ఆస్తులు ఏ ఆటంకాలు లేకుండా మీకు వస్తాయి మీరు అనుభవించగలుగుతారు. మీరు కూడా అత్యధిక ఆస్తులు సంపాదించుకుంటారు. మీరు సంపాదించినవి మీ పూర్వీకులు సంపాదించిన ఆస్తులు మీ వారసులకు ఖచ్చితంగా ఇస్తారు. మీకు స్థిరాస్తులు చరాస్తులు రెండూ ఉంటాయి. ఎల్లప్పుడూ మీ చేతిలో లిక్విడ్ క్యాష్ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఏ లగ్న జాతకులకు అయినా సరే పంచమ స్థానంలో శుక్లపక్ష చంద్రుడు ఉన్నప్పుడు వారు అత్యధికంగా ధనాన్ని సంపాదిస్తారు,ధనవంతులవుతారు. సొంత ఇంటిసౌకర్యం ఉంటుంది. ఏ లగ్నానికి అయినా సరే 5,11 స్థానాలలో చంద్రుడు ఉన్నప్పుడు వాళ్లు అదృష్టవంతులని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. దీనిలో ఐదవ స్థానం రాశిగా వచ్చినప్పుడు. నూటికి నూరు శాతం ఫలితాలు ఇస్తాయి. 11వ స్థానం రాసిగా ఉన్నప్పుడు 90 శాతం ఫలితాలను ఇస్తాయి. ఈ యోగం ఉన్నప్పుడు మీ పూర్వీకులకు ఆస్తులు లేకపోయినా మీరు అత్యధికంగా సంపాదిస్తారు. స్థిర చరాస్తులను సంపాదిస్తారు. మీ వారసులు కూడా దానిని కాపాడుతారు అంటే మీకు మంచి గుణాలు ఉన్న వారసులు జన్మిస్తారు. జాతకుడు స్వదేశంలో ఉన్నా విదేశాలలో ఉన్నా స్థిర,చరాస్తులను సంపాదిస్తారు కష్టపడే తత్వం ,తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి.మీ జాతకాలు మరియు మీ కుటుంబ సభ్యుల జాతకాలు పరిశీలించుకుని చిన్నచిన్న ఆటంకాలు ఉంటే పరిహారాలు చేసుకుని సత్ఫలితాలు పొందవచ్చు.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment