Thursday, 25 January 2024

*కృష్ణనామమహత్యం

 



సుగతిని కల్పించగల శక్తివంతమైన నామం కృష్ణనామం. 

కృష్ణ దివ్యనామం చాలు - కష్టాలన్నీపోవడానికి.

మానవులు తెలిసి కొంత, తెలియక కొన్ని పాపాలు చేస్తూనే ఉంటారు. మరి ఈ పాపాలు పోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎలాగంటే - కృష్ణనామంతో!!

నామ్నాం ముఖ్యతరం నామ కృష్ణాఖ్యం మే పరంతప!

ప్రాయశ్చిత్త మశేషాణాం పాపానాం మోచకం పరమ్!!

కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః!

జలం హిత్వా యధా పద్మం నరకాదుద్ధరామ్యహమ్!!

కృష్ణ కృష్ణా అని నిత్యం జపిస్తే చాలు, నీటిలో ఉన్నను తడి బురదా అంటని పద్మంలాగా ఆ కృష్ణనామం జపించినవారు నరకలోకబాధలు లేకుండా ఉద్ధరింపబడతారు. 

కృష్ణ కృష్ణ కృష్ణేతి స్వపన్ జాగ్రత్ వ్రజం స్తధా!

యో జల్పతి కలౌ నిత్యం కృష్ణరూపీ భవేద్ధి సః!!

కృష్ణ నామాన్ని స్వప్న జాగ్రదవస్థలలో అనునిత్యం ఎవరైతే జపిస్తారో వారు స్వయంగా కృష్ణ స్వరూపాన్ని పొందుతారు!!

ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం 

నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే!!

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే! 

హరే రామ హరే రామ రామ రామ హరే హరే!!

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment