Friday 19 January 2024

సద్బోధ:

 


                   


అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః

నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః

శరీరాలు శాశ్వతాలు కావు. వైభవములు కూడా  శాశ్వతములు కావు.

 కాబట్టి, వైభవములు సంపదల వలెనే శరీరములు శాశ్వతమైనవి కావు అని భావించి, మృత్యువు ఎల్లవేళలా ప్రక్కనే పొంచి ఉందని భావించి ధర్మ సంపాదనకై కర్తవ్యోన్ముఖులు కావాలి!

శరీరాలు అనిత్యమైనవి. ఐశ్వర్యం శాశ్వతం కాదు. మృత్యు దేవత ఎల్లపుడు ప్రక్కనే పొంచి ఉంది. అందుచేత ధర్మ సంపాదనం చేసుకోవాలి.

ధన సంపాదన, భౌతిక సుఖాలు మనం జీవించినంత వరకూ కావలసినవే. వాటికై ప్రయత్నించాలి, సాధించాలి. కానీ, అవియే శాశ్వతం అనే విధంగా ఎలాగైనా వాటిని సాధించాలని ఉచ్ఛ నీచాలు మానేసి వాటికై వెంపరలాడ కూడదు.

మనిషి శరీరం శాశ్వతం కాదని అందరికీ తెలుసు. కాబట్టి ఉన్నంతలో, మన వైభవాలూ, సుఖాలూ మనం చూసుకుంటూనే కొంతలో కొంత ధర్మాచరణకి పూనుకోవాలి.

సంఘం లోనూ, సమాజం లోనూ అవసరం ఉన్నవారిక మనకి చేతనైనంత వరకూ సహాయ సహకారాలు అందించడమూ, పరోపకారానికై కొంత మన సమయాన్ని, ధనాన్ని వెచ్చించడమూ ఇవియే ధర్మాచరణలో భాగం.

ఇటువంటి ధర్మ సంపాదనయే జీవితానికి సార్థకత.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment