మీఇంట్లో లక్ష్మీదేవి ఉంటే కనిపించే 5 సంకేతాలుఇవే :
🕉 లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్లు ఎలా గుర్తించాలి? అలానే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి స్తిరంగా ఉండాలి అంటే ఏం చేయాలి ? అలానే ఎలాంటి శకునాలు కనిపిస్తే మీ ఇంట్లో కీడు జరగబోతుంది ? ఎలాంటి శకునాలు కనిపిస్తే మీ ఇంట్లో మంచి జరగబోతుంది ? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సంపదకి దేవత అయిన లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలి అని అందరూ కోరుకుంటారు.లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తే వారి జన్మ ధన్యం అవుతుంది అని వారి భాదలు అన్నీ తొలగి పోతాయి అని అందరూ భావిస్తుంటారు. కానీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని కలగదు అని చెప్పవచ్చు.లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం భక్తులు నిత్యం పూజలు చేస్తుంటారు.
🕉లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని భక్తులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.ఒకసారి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే వారి జన్మ ధన్యం అవుతుంది అని భాదలు అన్నీ తొలగిపోతాయి అని సిరి సంపదలు వస్తాయి అని నిత్యం ఆర్దిస్తూ పూజలు చేస్తుంటారు.లక్ష్మీదేవి కటాక్షం లేనిదే జీవితంలో ఏం సాదించలేం అని భక్తులు ఎంతో నిష్టతో లక్ష్మీ దేవిని ఆరాదిస్తారు.
🕉లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండాలి అంటే మీ ఇల్లు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి అలానే మీ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు,చికాకులు ఉండకూడదు. అలా ప్రశాంతంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.అలా లక్ష్మీదేవి కొలువై ఉన్న ఇంట్లో ఎల్లపుడూ సిరి సంపదలతో కలకలాడుతుంది.
🕉మీ ఇల్లు అపరిశుభ్రంగా ఉన్న తిన్న ఆహారం ఎక్కడ పడితే అక్కడే వేసిన అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు.మీ ఇంట్లో ఎక్కడైనా నల్ల చీమలు ఆహారం తింటునట్లు కానీ లేదా ఒక చోట నుంచి మరొక చోటకి నల్ల చీమలు తిరుగుతున్నట్లు కానీ చేస్తుంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని గుర్తించవచ్చు.అలానే మీ ఇంట్లో పక్షులు గూడు కట్టుకోవడం ప్రారంభించినట్లైతే అప్పుడు కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని సూచన.
🕉అలానే తులసి మొక్క దగ్గర బల్లి కనిపించినట్లైతే అప్పుడు కూడా లక్ష్మీ దేవి మీ ఇంట్లోకి వస్తుంది అని భావించవచ్చు.మనం నిద్రించే సమయంలో చీపురు,గుడ్లగూబ ,ఏనుగు,శంఖం,బల్లి, గులాబి పూవులు ఇలాంటివి కనిపిస్తే లక్ష్మీదేవి రాకకు గుర్తింపుగా పరిగమింపవచ్చు. ఉదయం మీరు నిద్ర లేచినప్పుడు మీకు చీపురుతో ఊడుస్తూ ఎవరైనా కనిపిస్తే అది శుభ సంకేతంగా భావించవచ్చు.
No comments:
Post a Comment