Wednesday 31 January 2024

42 రోజులు శివాలయ దర్శనం!!! నియమాలు !!!

 


జనవరి 26 న మొదలు పెట్టండి శివాలయం దర్శనం కి వెళ్ళడం, మార్చ్ 8 కి శివ రాత్రి అదే రోజు కి 42 రోజులూ పూర్తి అవుతుంది.

42 రోజులు ప్రతీ రోజు శివాలయం దర్శనం ప్రదోష కాలంలో చేస్తే ధర్మ బద్ధంగా ఉండే ఏ కోరిక ఐనా ఖచ్చితంగా తీరుతుంది.

1. రేపట్నుంచి వెళ్లాలి అనుకుంటున్నారా, ఈ రోజు రాత్రి నుంచి మీరు మధ్యపానం, ధూమపానం మరియు మాంసాహారం ఆపేయండం, మితంగా భోజనం చేసి నిద్ర చేయండి.

2. స్నానం చేసి, విభూది ధారణ చేసి, మీ ఇంట్లో ఉన్న దేవుడు కి నమస్కారం చేసి శివాలయం కి భయలుదేరండి.

3. ప్రతీరోజూ ప్రదోసకాలం అనగా సూర్యాస్తమయం కి అటు ఇటు గా శివాలయం కి వెళ్ళండి 42 రోజులు.

4. 9 నెలల నిండు గర్భిణీ ఎలా ఎంత జాగ్రత్తగా అడుగు లో అడుగు వేస్తూ నడుస్తారో అలా శివాలయంలో 3 ప్రదక్షిణలు చేయండి శివనామ స్మరణతో.

5. ప్రదక్షిణలు తరువతా శివలింగం కి నమస్కారం పెట్టుకోండి చాలు మీ మనసుకి తృప్తి పడే వరకు శివలింగం చూడడం, ఏలాంటి కోరిక కోరవద్దు ఎందుకు అంటే శివునికి తెలుసు మీకు ఏమి కావాలో.

6. ఒక 5-10 నిముషాలు శివగుడి లో శివనామ జపం చేయండి లేదా ప్రశాంతంగా కూర్చోండి చాలు.

ఆడపిల్లల కి 42 రోజులు చేయడానికి అవాంతరాలు ఉంటాయి కాబట్టీ, మీరు ఆ+T 5 రోజులు ఇంటి దగ్గరే ఉండి,6 వ రోజు నుండి మళ్ళీ కొనసాగించండి అలా 42 రోజలు పూర్తి చేయండి.రోజు ప్రదోసకాలం లో కుదరకపోతే ఉదయం ఐనా వెళ్ళవచ్చు.

ఈ 42 రోజలు ధూమపానం, మద్యపానం, మాంసాహారం,జూదము కి దూరంగా ఉండటం నియమం.

పొద్దున రోజు 9 గంటలకు మహా శివుడి దర్శనం చేసుకోవచ్చు వేసుకో లేకపోతే ప్రొద్దున 9 గంటలకు లేదా సాయంత్రం ప్రదోషకాలంలో దర్శనం చేసుకోవచ్చు ప్రతిరోజు మనకు వీలు పడినట్టు ఆ మహా శివుడిని ఈ విధంగా మీ దర్శనం చేసుకుంటా తండ్రి అని నొక్కి మీ భక్తుని మీరు కొనసాగించవచ్చు.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment