గణపతి సహస్రనామం రోజుకో నామం - 582
ఓం వరేణ్యాయ నమః
ॐ वरेण्याय नमः ।
Om Varenyaya Namaha
అర్దం - శివ, విష్ణు, గణపతి, శక్తులకు సంబంధించిన అద్వైతాలలో గణపతికి సంబంధించిన అద్వైతం మీద మిక్కిలి భక్తి గల రాజు ఒకడుండేవాడు. ఆయన పేరు వరేణ్యుడు. వరేణ్యుని భక్తి చాలా గొప్పది. గణపతికి, వరేణ్యునికి ఏ బేధం లేనంతగా, అతను గణేశునిలో లీనమయ్యాడు ఆ భక్తి కారణంగా. అలాంటి వరేణ్యునితో అభేదం గలవాడు గణపతి అని ఈ నామం యొక్క అర్ధము.
అలాగే తత్సవితుర్వరేణ్యం భర్గః అని గాయత్రి మంత్రంలో వస్తుంది. దాని ప్రకారం శ్రేష్ఠమైన సూర్య తేజస్సే గణపతి.
---------------------------
మీకు వీలైతే అదే నామాన్ని తిరిగి కామెంట్ లో రాయండి.
No comments:
Post a Comment