హరినామ సంకీర్తనము హృదయాన్ని శుద్ధి చేసి దేహమే ఆత్మ అనే తప్పుభావన నుండి మనిషిని ముక్తుని చేస్తుంది.
కృష్ణనామ సంకీర్తన ప్రచారమే. శ్రీచైతన్యమహాప్రభువు ఉద్యమము. “పరం విజయతే శ్రీకృష్ణసంకీర్తనం - శ్రీకృష్ణ సంకీర్తనకు జయము జయము." ఎందుకు ఇది అంతగా మహిమాన్వితమైనదో శ్రీచైతన్యులే “చేతోదర్పణ మార్జనం” అనే శ్లోకం ద్వారా వివరించారు. హరేకృష్ణ మహామంత్ర కీర్తన ద్వారా మనిషి హృదయం పవిత్రమౌతుంది. సత్త్వగుణం లేకపోవడం, హృదయం నిర్మలంగా లేకపోవడమే కలియుగంలో ఉన్నట్టి అసలైన కష్టం. దీని కారణంగానే మనుషులు తమ దేహాలనే ఆత్మగా భావిస్తారు. ఈ అపార్థాన్ని తొలగించి హృదయాన్ని శుద్ధిపరిచేదే శ్రీకృష్ణ సంకీర్తనము. (శ్రీమద్భాగవతము 8.5.23)
No comments:
Post a Comment