Monday 22 January 2024

ఈ రోజుటి రాశిఫలాలు 🐊

 

   


      23 జనవరి  2024

మంగళవారము  JANUARY 23

మేషం🐐

అశ్వని1,2,3,4,(చూ,చే,చో,లా)భరణి 1,2,3,4,(లీ,లూ,లే,లో) కృతిక 1,(ఆ)

 ఆర్థిక ఇబ్బందులు తప్పవు.రుణ యత్నాలు. 

ఆకస్మికప్రయాణాలుకష్టం తప్ప ఫలితం ఉండదు. 

ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాలలో ఆటంకాలు. వాణిజ్య,వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు అనుకోని మార్పులు సంభవం. చిత్రపరిశ్రమవారు, క్రీడాకారులు ఇబ్బందులు పడతారు.విద్యార్థులు కొంత ఓపిక వహించాలి. మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం

వృషభం🐂

కృతిక 2,3,4(ఈ,ఊ,ఏ),రోహిణి1,2,3,4(ఓ,వా,వీ,వూ) , మృగశిర1,2,(వే,వో)

సన్నిహితులు, ఆనందంగా గడుపుతారు.

చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.కొత్త కాంట్రాక్టులపై ఆశలు చిగురిస్తాయి.వాణిజ్య, వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు.విద్యార్థులు కోరుకున్న విద్యావకాశాలు పొందుతారు.మహిళలకు అనారోగ్యసమస్యలు

మిథునం👩‍❤️‍👨

మృగశిర 3,4 (కా,కి), ఆరుద్ర 1,2,3,4(కు, ఘ, ఙ, ఛ) పున్వరసు1,2,3(కే,కో, హా)

ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది.శ్రమాధిక్యమే మిగులుతుంది.

పనుల్లో ఆటంకాలు చికాకు పెడతాయి. అనుకున్నది సాధించడంలో వెనుకబడతారఆలోచనలు స్థిరంగా ఉండవు.

వాణిజ్య, వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగాలలో అనుకోని మార్పులు.చిత్రపరిశ్రమవారు, వైద్యుల యత్నాలు ముందుకు సాగవు.విద్యార్థులకు కొన్ని అవకాశాలు దక్కినా నిరాశ చెందుతారు.

మహిళలకు ఆనారోగ్యం.

.కర్కాటకం🦀

పున్వరసు 4(హి),పుష్యమి1,2,3,4(హు,హే,హో,డా) అశ్లేష 1,2,3,4 (డీ, డు, డే, డో)

కొత్త విషయాలు తెలుసుకుంటారు.

 ప్రముఖులతో పరిచయాలు.మీపై అందరికీ గౌరవం పెరుగుతుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

 వాణిజ్య, వ్యాపారాలు లాభిస్తాయి.ఉద్యోగాలలో ఉన్నతస్థితి పొందుతారు.విద్యార్థుల ఆకాంక్షలు ఫలిస్తాయి.

 మహిళలకు శుభవార్తలు అందుతాయి.

 సింహం🦁

మఘ 1,2,3,4(మ, మి, ము, మే), పుబ్భ 1,2,3,4 (మో, ట, టి, టు) ఉత్తర1 (టె),

 ఆర్థిక పరిస్థితి ఆశాజనకమే. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

స్నేహితులను కలుసుకుని చర్చలు జరుపుతారు.గృహ, వాహనాలు కొంటారు.

ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది.గతంలో జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు.

వాణిజ్య, వ్యాపార లావాదేవీలుఊపందుకుంటాయి

ఉద్యోగ వర్గాలకు విధి నిర్వహణలో మరింత అనుకూలత.చిత్ర పరిశ్రమవారు, రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం.విద్యార్థులు అందిన అవకాశాల పట్ల సంతృప్తి చెందుతారు.

కన్య🙎‍♀️

ఉత్తర2,3,4(టొ, ప, పి), హస్త 1,2,3,4 (పు,షం,ణ, ఠ) చిత్త 1,2(పె, పొ)

ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.

వ్యయప్రయాసలు. కొన్ని కార్యక్రమాలను మధ్యలో విరమిస్తారు.కుటుంబసభ్యులతో విరోధాలు.

 కాంట్రాక్టుల యత్నాలు అంతగా అనుకూలించవు.

 వాణిజ్య, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ఉద్యోగులకు విధుల్లో అదనపు బాధ్యతలు.

 పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి ఒక సమాచారం కొంత ఇబ్బంది కలిగిస్తుంది.

 విద్యార్థుల నిర్ణయాలపై తొందరపడరాదు.

 మహిళలకు ఆరోగ్యభంగం.

తుల⚖️

చిత్త 3,4 (ర,రి), స్వాతి 1,2,3,4(రు, రె, రో,త), విశాఖ1,2,3, (తి, తు, తే)

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.

వ్యయప్రయాసలు.దూర ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.బంధువులతో విరోధాలు.కష్టపడ్డా ఆశించిన ఫలితం కనిపించదు.

వాణిజ్య, వ్యాపార లావాదేవీలు కష్టసాధ్యంగా నడుస్తాయి.

ఉద్యోగులకు చిక్కులు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.

 విద్యార్థులు కొంత నిరుత్సాహం చెందుతారు.

 మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు.

వృశ్చికం🦂

విశాఖ 4(తో), అనురాధ 1,2,3,4 (న, ని,ను, నే),

జ్యేష్ఠ 1,2,3,4,(నో, య, యి, యు)

 కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి.

ఇంటిలో వేడుకలు నిర్వహించారు.అనుకున్న ఆదాయం సమకూరుతుంది.అత్యంత విలువైన వస్తువులు సేకరిస్తారు.వాణిజ్య, వ్యాపారాలలో లాభాలు తధ్యం.

ఉద్యోగులకు ఉత్సాహం పెరుగుతుంది.చిత్రపరిశ్రమవారు, క్రీడాకారుల కొత్త ఆశలు కలుగుతాయి.విద్యార్థులకు నిరుత్సాహం మిగులుతుంది.మహిళలకు ఆస్తిలాభ సూచనలు.

ధనుస్సు🏹

మూల1,2,3,4,(యె,యో, బ,బి)పూర్వాషాడ1,2,3, 4

(బు, ధ, భ, ఢ) ఉత్తరాషాడ 1(బె)

దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

 కొత్త కాంట్రాక్టులు చేపడతారు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి.

కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు.వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వాణిజ్య, వ్యాపారాలు లాభిస్తాయి.ఉద్యోగాల్లో విధులు వేగవంతంగా సాగుతాయి.

సాంకేతిక నిపుణులు, రాజకీయవర్గాలకు చిక్కులు తొలగుతాయి.

విద్య సాంకేతికపరమైన విద్యావకాశాలు. మహిళలకు ధన లాభాలు.

మకరం🐊

ఉత్తరషాఢ 2,3,4,( బో, జ, జి)శ్రవణం 1,2,3,4,

(జు, జే, జో, ఖ)ధనిష్ట 1,2(,గ, గి)

పరిచయాలు పెరుగుతాయి.కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.మీ ఆశయాలు నెరవేరుతాయి.

ఒక సమస్యను చాకచక్యంగాపరిష్కరించుకుంటారు.

రాబడి మరింతగా పెరుగుతుంది.గృహ నిర్మాణ యత్నాలు ఫలిస్తాయి.బంధువులతో ఆనందంగా గడుపుతారు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి.వాణిజ్య, వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి.వైద్యులు, సాంకేతిక నిపుణులకు అనుకూలంగా ఉంటాయి.

 విద్యార్థులకు విద్యావకాశాలు పెరుగుతాయి.

మహిళలకు ఆస్తి లాభం.

కుంభం⚱️

ధనిష్ట 3,4 (గు, గె), శతభిషం 1,2,3,4(గొ, స, సి, సు)

పూ||భా||1,2,3(సె, సో, ద),

ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.రుణదాతల ఒత్తిళ్లు పెరుగుతాయి. కష్టానికి ఫలితం కనిపించదు.

వివాదాలకు దూరంగా ఉండండి. నిర్ణయాలలో తొందరవద్దు.

 దూరప్రయాణాలు ఉంటాయి.

వాణిజ్య, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

ఉద్యోగులకు అదనపు పని భారం.

చిత్ర పరిశ్రమవారు, రాజకీయనాయకులు గందరగోళంగా ఉంటారు.

విద్యార్థులు మరింత కష్టపడాలి.

మహిళలకు కుటుంబంలో చికాకులు.

మీనం🐟

పూ||భాధ్ర||4,(ది) ఉ||భా||1,2,3,4 (దు, శం, ఝ, థ),

రేవతి1,2,3,4, (దే, దో, చ, చి)

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ముఖ్య కార్యక్రమాలలో అవాంతరాలు.

బంధువులతో విభేదాలు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

అనారోగ్య సూచనలు. నిరుద్యోగుల శ్రమ ఫలించదు.

మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు.వాణిజ్య, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉంటాయి.

చిత్రపరిశ్రమవారు, క్రీడాకారులకు అవకాశాలు దూరం కాగలవు.విద్యార్థులు అనుకున్నదానికి విరుద్ధమైన ఫలితాలు రావచ్చు.మహిళలకు కుటుంబ సమస్యలు.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment