ప్రతి మనిషి నేను సుఖంగా, ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాడు.
మంచిదే కానీ ఆ సుఖం, ఆనందం ఎక్కడ ఉందో ఎలా లభిస్తుందో తెలుసుకోవడం లేదు.
దైవమును మరచి ప్రాపంచిక సుఖాలే నిత్యమనుకుంటాడు. సుఖము వచ్చినపుడు తానే కర్తనంటాడు. దుఃఖము వస్తే దైవమును నిందిస్తాడు.
నిజమునకు సంసారము సుఖదుఃఖముల సమ్మేళనము. సుఖదుఃఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూపోతూ ఉంటాయి.
మనసును ప్రాపంచిక విషయముల నుండి మరలించి భగవంతుని యందు స్థిరంగా ఉంచితే అదే శాశ్వతసుఖము.
దాని కోసం ఎవరూ ప్రయత్నించరు. ఎపుడూ తాత్కాలిక సుఖాల కోసమే పాకులాడుతుంటాము. వాటినే మనసులో చింతిస్తూ ఉంటాము.
ఇలా ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ పరమాత్మ గురించి ఆలోచించని వాడికి శాశ్వతమైన సుఖము, ఆనందము ఎలా లభిస్తాయి?
దీనికి బాధ్యులు ఎవరు మనమా? భగవంతుడా?? మనము చేసుకున్నదానికి భగవంతుని నిందిస్తే ఎలా?
No comments:
Post a Comment