Sunday 21 January 2024

 


రామజన్మభూమి మందిరంలో శ్రీరామ మూర్తి ప్రతిష్ఠాపన జరుగుతున్న సమయంలో మనం అందరం గుర్తించ వలసిన విషయమేమిటంటే, "హిందూ సమాజం మేల్కొన్నది. న్యాయంగా, ధర్మంగా తనదైన దానిని  సాధిస్తుంది. సుందరంగా తీర్చి దిద్దుకుంది. ఆదర్శవంత మైన రీతిలో నిర్వహించుకొంటుంది " అనే సత్యం ప్రతి హృదయాన్ని స్పృశిస్తూ ఉన్నది.

 నలబై సంవత్సరాల క్రితం రామజన్మభూమి విముక్తి కోసం , అక్కడ ఒక భవ్యమైన ఆలయ నిర్మాణం కోసం ఉద్యమం ప్రారంభమైనప్పటినుండి ఇప్పటివరకు రకరకాల మనస్తత్వాలున్నవారు వారికి ఎలా తోస్తే అలా అభ్యంతరాలు, కుతర్కాలూ చెప్తూ అడ్డుకొనజూశారు.  

 ఉద్యమం నడుపుతున్నవారు వీటన్నింటికీ ఓపికగా సమాధానమిచ్చారు.న్యాయపీఠాలపై ఆసీనులైనవారికి సంతృప్తి కలిగి న్యాయబద్ధమైన అనుకూలమైన తీర్పులను ఇచ్చారు. 

 రకరకాల మనుషులు లేవనెత్తిన ప్రశ్నలు:

 రాముడు అనే వ్యక్తి చరిత్రలో ఉన్నాడా? 

అతడు మనకు ఆదర్శమా? 

అతడిని గౌరవించాల్సిన ఉందా?

 అతడు పుట్టినది అయోధ్యలో నేనా?

 ఆ అయోధ్య, ఈ అయోధ్య ఒకటేనా?

దీనికి సాహిత్యం లో ఋజువులున్నాయా?

 చరిత్రలో ఋజువులున్నాయా? 

ఆర్కియాలజీ ప్రకారం ఋజువు చేస్తారా?

 ఆ స్థలంలో ఆలయం నిర్మించుకొని పూజలు జరుపుకొనే హక్కు హిందువులకు ఉందా?

 అక్కడున్న మసీదును తొలగించి మందిరం నిర్మించా లనటం ఈ దేశపుతత్వానికి అనుగుణమైన ఆలోచనేనా? 

ఇతర దేశాలలో ఉండే మహమ్మదీయులకు కోపం వస్తే మనం తట్టుకొని నిలబడగలమా? 

అక్కడ దేవాలయం కట్టకపోతే కొంపలు మునిగిపోతాయా? 

అక్కడ విద్యాలయమో, వైద్యాలయమో, శౌచాలయమో నిర్మించ వచ్చుగదా, వాటి నిర్మాణంవల్లప్రజలకు మరిన్ని సదుపాయాలు చేకూరినట్లవుతుందిగదా.... 

ఇలా వీరు అడుగుతూ వచ్చిన ప్రశ్నలు చాలావరకు అర్థం రహితమైనవి. వారిలోని పైత్యప్రకోపానికి అద్దం పట్టేవి.  అయినా, వీటన్నింటికీ తర్కసమ్మతమైన సమాధానాలు ఇవ్వబడినవి. తీర్పులు వెలువడినవి.

ఇంత జరిగినా తర్వాత కూడా ఏమీ అర్థం చేసుకోజాలని వారు, అర్థంచేసుకోనివారు కొందరున్నారు. తమ కళ్ల ఎదుటకనబడుతున్నదానిని చూడడానికి నిరాకరిస్తున్న వారు. ఓవైసీ వంటివారైతే పాత పద్ధతి లోనే బెదిరింపులు కొనసాగిస్తున్నారు. నరేంద్రమోదీ ఎల్లకాలమూ ప్రధాన మంత్రిగా ఉంటాడా? ఆయన తర్వాత ఏమవుతుంది? అప్పుడు మేము చేయబోయే పనులను అడ్డుకొనేవా రెవరుంటారు? అంటూ రెచ్చి పోతున్నాడు.

 చరిత్ర, సాహిత్యము, పురాతత్వ శాస్త్రము, న్యాయశాస్త్రము, భారత్ రాజ్యాంగములలో నిపుణులైన వారు ప్రకటించిన తీర్పులతోపాటు కోట్లాది భారత ప్రజానీకం ప్రకటించిన తీర్పు కూడా స్పష్టంగా ఉందని అందరమూ గుర్తు పెట్టుకోవాలి.

రామజన్మభూమి విముక్తి ఉద్యమం ఆరంభించిననాడు ఉన్న పెద్దతలకాయలు- అశోక్ సింఘాల్, స్వామి సత్య మిత్రానంద , పరమహంస రామచంద్ర దాస్, మోరోపంత్ పింగళే....వంటివారు ఈనాడు లేని మాట నిజమే. అయితే సంపత్ రాయ్, అలోక్ జీ, కోటేశ్వర శర్మ వంటివారు ఆవిష్కరిస్తున్న దృశ్యం ఊహాతీతంగా ఉందని చెప్పక తప్పదు.

 నరేంద్రమోదీ వారసులుగా వచ్చేవారు కూడా మామూలు మనుషులుగా ఉండరు. ఎటువంటి జటిల సమస్య లున్నా పరిష్కరించగల సామర్థ్యం కలవారు గానే ఉంటారు. 

గుర్తించవలసిన అసలు విషయమేమిటంటే హిందూ సమాజపు కుండలినీ శక్తి జాగృతమైంది. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగల సామర్థ్యం సంపాదించు కుంటుంది. అప్రతిహతంగా ముందుకు సాగిపోతుంది.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment