ఇక్ష్వాకువు అయోధ్యానగర రాజు. శ్రీరామునికి పూర్వులు 32 మంది రాజులు ఆయన వంశం వారున్నారు. వీరి పేరులు రామాయణంలో ఉన్నాయి. వీరిలో మాంధాత చక్రవర్తి. సగరుడు చక్రవర్తి. ఆయన కుమారులు సాగరులు సముద్రాన్ని విస్తృతం చేశారు. భగీరథుడు తీసుకురావడం వలన గంగ భాగీరథి అయ్యింది. అంబరీషుని వలన విష్ణు దేవునికి దశావతారాలు ఏర్పడ్డాయి. శ్రీరాముని తరువాత ఆ వంశం ప్రభువులు 32 మంది ఉన్నారు. వీరి పేరులు విష్ణు పురాణంలో 4వ అంశంలో లభిస్తాయి. వీరిలో చివరివాడు బృహద్బలుడు. ఇతడు కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుని చేతిలో మరణించాడు. శ్రీరామునిది సూర్యవంశం. సూర్యవంశం వారు కలి శకంలో కూడా పాలకులయ్యారు. నేపాల వంశావళిలో నేపాలుని పాలించిన రాజవంశాలలో 5వ వంశం సూర్యవంశం. ఆ వంశంలో మొదటివాడు భూమి వర్మ. ఆయన కలి శకం 1389 సం.లో పట్టాభిషక్తుడయ్యాడు. థాయిలాండ్లో శ్రీరామ వంశం పాలిస్తోందని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుస్తోంది. కేశవదాసు రామచంద్రిక అనే గ్రంథం వ్రాశాడట. దానిలో శ్రీరాముని కుమారుడయిన కుశుని వంశం వారు థాయిలాండ్ రాజులు. కాబట్టి వాళ్ళ పేరుకు చివర రామ్ అనే పేరు వుంటుంది. ఇపుడు భూమిబల్ అతుల్య తేజ్ రామ్ పరిపాలన చేస్తున్నారట. థాయిలాండ్ రాజధానికి 163 అక్షరాల పేరుంది. దానిలో మధ్య అయోధ్య అనే పేరుంది. ఆ మొత్తం పేరుని వారు పాటలాపాడుతారు. సంక్షిప్తంగా మహీంద్ర అయోధ్య అంటారు. ఆ రాజులందరు అయోధ్యలో నివసిస్తారు.
No comments:
Post a Comment