*హిందూ మతం ఎంత ప్రాచీనమైనది? పరిశీలిద్దామా.*
*కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం , అని లక్షల, కోట్ల సంవత్సారాల నుండీ వుంది అని చెప్పేవారు వున్నారు. దీనికి ఎటువంటి ఆధారాలు లేవు.*
*సిద్ధయ్య మహా మేధావి అని చెప్తే, అవునా ఏమిటి ఆధారం అంటే, సిద్ధయ్య రాసిన పుస్తకం లో వుంది అనేది సరైన సమాధానం కాదు.*
*తమ్ముడు అన్న కన్నా పెద్ద కాదు. యిదేమి గొప్ప్ప విషయం కాదు, అందరికి తెలిసినదే అనుకుంటున్నారా, కాని ఈ విషయం ఎన్నో సందర్భాలలో కాల నిర్ధారణ చెయ్యటానికి వుపయోగపడుతుంది.*
*చరిత్రకు ఆధారాలు , ఋజువులు వుంటాయి, కాని కథ ఒక కల్పితం, ఒక ఊహా దానికి ఆధారాలు, ఋజువులు వుండవు.*
*హిందూ మతానికి మూలాలు, భగవద్గీత, భారతం, రామాయణం, పురాణాలు, స్మృతులు (మను స్మృతి, పరాశర స్మృతి, గౌతమ స్మృతి మున్నగునవి), వేదములు మున్నగునవి. వేదాలు అన్నిటి కన్నా ప్రాచీనమైనవి. వేదాలలో అతి ప్రాచీనమయినది ఋగ్వేదం.*
*ఋగ్వేదం, అలాగే తర్వాత వచ్చిన మూడు వేదాలు సంస్కృతం లో చేయబడినాయి (Composed in Sanskrit ), రాయబడ లేదు.*
*అందుకే వేదాలు గురువు నుండి శిష్యుడికి , మౌఖికముగా (Orally) చెప్పబడేది. ప్రాచీన కాలంలో ఈ గురు శిష్య పరంపరగా వేదాలు నేర్పించేరు.*
*చరిత్ర పరిశోధకులు, సంస్కృతం లో సుమారు 1,500 బి. సి. ఇ. (Before Common Era) లో ఋగ్వేదం కంపొజ్ (Compose) చెయ్యబడిందని నిర్ధారించేరు. అంటే హిందూ మతం సుమారు 1,500 బి. సి. ఇ (B. C. E.) నుండీ అంటే 3,500 ఏళ్ళ నుండీ వుంది అని నిర్ధారించబడింది. యింకా ప్రాచీనమైనదని నిర్ధారించడానికి యింకేమి ఆధారాలు లభించలేదు.*
*ఈ సందర్భం లో కొన్ని విషయాలు గుర్తు వుంచుకోవాలి. భాష( Language ) వేరు, లిపి ( Script ) వేరు. భాష వలన ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మా ట్లాడగలడు ( Communication) . లిపి ( Script ) ఒక రాత ( Writing System) , ఒక అక్షరం ఒక శబ్ధాన్ని సూచిస్తుంది.*
*తెలుగు భాష కి ఒక ప్రత్యేకమైన తెలుగు లిపి వుంది అలాగే తమిళం , కన్నడం లాంటి భాషలకు లిపులున్నాయి. అయితే హిందీ కి లిపి లేదు. దేవనాగరి లిపిలో రాస్తారు. అలాగే సంస్కృతం కి లిపి లేదు, దేవనాగరిలో రచిస్తారు.*
*సుమారు 6 వ శతాబ్దం నుండి అంటే 1,500 ఏళ్ళ నుండీ మాత్రమే దేవనాగరి లిపి వచ్చింది. సంస్కృతం నుండి వచ్చిన భాష ప్రాకృత్, దీనినే పాళీ భాష అని కూడా అంటారు .*
*సుమారు 250 బి.సి.ఇ.( B.C.E.) అంటే 2,270 ఏళ్ళ క్రితం బ్రాహ్మి లిపి ప్రాచుర్యంలో వుండేది. భారతదేశం నలుమూలల దొరికిన అశోకుడి శిలాశాసనాలు, అలాగే, బౌద్ధ మత విషయాలు పాళీ భాషలో బ్రాహ్మి లిపిలో లిఖించబడ్డాయి.*
*అయితే బ్రాహ్మి లిపి కొన్ని వందల సంవత్సరాల తర్వాత మరుగున పడి పూర్తిగా అంతరించి పోయింది.*
*అశోకుడు, పాళి భాష , బ్రాహ్మి లిపి గురించి కొన్ని విస్తుపోయే విశేషాలు వున్నాయి, అవి ఇంకొక సారి*.
No comments:
Post a Comment