ఈ విశ్వాసము మీకు లేకపోవడము చేతనే మీ ప్రార్థనలు సరిగా ఫలించడము లేదు!
ఆ దైవమే రాముడు, కృష్ణుడు, శివుడు, మోసెస్, అల్లాహ్ ఇలా వేరు వేరు పేర్లతో, వేరు వేరు రూపములతో ప్రకటితమవుతున్నాడు. ఈ పేర్లు అన్నీ మహాపురుషులు పెట్టినవే తప్ప దైవమునకు ప్రత్యేకమైన పేరు గానీ రూపముగానీ లేదు! అన్ని పేర్లు, అన్ని రూపములు తనవే! భగవంతుడు నిరాకారుడు. అయిననూ భక్తులు సులభంగా చింతన చేసుకొనుటకు తను సాకార రూపుడై అవతరించెను.
కనుక మీరు భగవంతుని యందు భేదములెంచక బుద్ధిని భగవంతుని ఏదో ఒక రూపముయందు స్థిరము చేసుకుని ఆ రూపము నామమును జపము చేయుట ఉత్తమము.
చిత్తశుద్ధితో ఏ రూపమును ధ్యానించినా, ఏ నామముము స్మరించినా ఆ ఒక్క భగవంతునికే చెందుతుంది. ఫలితము కూడా ఆ ఒక్క భగవంతుడే ఇస్తుంటాడు.
ఈ విషయంలో ఆజ్ఞానికి, సందేహానికి తావులేకుండా చూసుకోవాలి.
ఇంటి నిండా పదులకొలది దేవుని ఫోటోలు పెట్టుకుని మనసునందు భేదభావంతో “రామా! కృష్ణా! శివా!” అని అంటుంటే ఏ రూపము నందు గానీ, నామమునందు గానీ బుద్ధి స్థిరమవదు! ఫలితంగా ప్రార్థనలు పెద్దగా ఫలించవు. అనుగ్రహమూ దొరకదు.
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment