Thursday, 21 March 2024

అనగనగా...

అడవికి దగ్గరగా వున్న  కుగ్రామంలో,  ఒక సోమరి యువకుడు వుండేవాడు. 

వాడికి తల్లిదండ్రులు పెట్టిన లక్షణమైన పేరు వున్నా,  అది యెవరికీ తెలిసేది కాదు. ఎందుకంటే, వాడు యెప్పుడూ, యెవరైనా యేదైనా వుచితంగా యిస్తారేమో, అని యెదురుచూస్తూ, వాళ్ళు పెట్టింది తిని, గమ్యం లేకుండా, కాలక్షేపం చేస్తుండేవాడు. అందుకని గ్రామస్తులు వాడికి  ' పరాన్నభుక్కు '  అని పేరు పెట్టి చులకనగా చూసేవారు. .

స్వతహాగా బద్ధకస్తుడు అవడం వలన,  తిండీతిప్పలు సులభంగా జరిగిపోయే ఉపాయం కోసం వెదుక్కోవడం అలవాటు చేసుకున్నాడు.  ఎక్కడ యేవిధమైన సంతర్పణలు వున్నా,  అవి పెళ్ళిభోజనాలైనా,  పితృకార్యాలైనా, హాజరయ్యేవాడు

ఆ క్రమంలో, ఒకరోజు మన పరాన్నభుక్కు,  ఒక పండ్లతోటలో చెట్టెక్కి,  పళ్ళు కోసే ప్రయత్నంలో వుండగా,  తోటమాలి,కర్ర పట్టుకుని వస్తుంటే,  వాడిని చూసి, భయపడి, పరాన్నభుక్కు, దగ్గరలోని అడవిలోకి,  పరుగుతీసాడు,  దాక్కుందామని.  అడవిలో పరాన్నభుక్కుకు తినడానికి యేమీ దొరకలేదు.  మళ్ళీ, నెమ్మదిగా గ్రామంలోకి వద్దామని ప్రయత్నిస్తుండగా,  ఒక చిత్రమైన దృశ్యం అతని కంటబడింది. 

ఒక నక్క, కాలు పోగొట్టుకుని,  పరిగెత్తే వీలులేక, కనీసం నడవలేక,  డేక్కుంటూ రావడం కనిపించింది.  ' అంత భయంకరమైన అడవిలో, అన్ని అవయవాలూ వున్న జంతువులే, బితుకు బితుకు మంటూ,  క్రూరజంతువుల బారినపడకుండా,  దాక్కుని తిరుగుతూ వుంటాయి కదా,  ఈ కుంటినక్కకు,  జీవనోపాధి యెలా దొరుకుతుందా  '  అని అమితంగా ఆశ్చర్యపోసాగాడు, మన పరాన్నభుక్కు. 

ఇంతలో, అతని శంకకు తగ్గట్టు గానే,  ఒక సింహం యేదోజంతువు మాంసం తింటూ అటు రాసాగింది.  వెంటనే, పరాన్నభుక్కు దగ్గరలోని చెట్టెక్కి ' యేమి జరుగుతుందో ' అని చూస్తున్నాడు.   మిగిలిన జంతువులన్నీ కూడా భయంతో పారిపోతున్నాయి.   అది చూసి, ' ఇంకేముంది, ఈ నక్క పని కూడా, అయిపొయింది, సింహం చేతిలో, ' అని పరాన్నభుక్కు అనుకుంటుండగా,  అతని ఆలోచనకి విరుద్ధంగా,  సింహం రెండు మాంసం ముక్కలను నక్క ముందు పడవేసి వెళ్ళిపోయింది.  నక్క వాటిని ఆత్రంగా తిని కడుపు నింపుకున్నది. 

అదంతా చూసిన పరాన్నభుక్కుకి, భగవంతుని మీద యెంతో భక్తి కలిగింది.  ' ఆహా ! తాను సృష్టించిన ప్రతి ప్రాణి మీదా ఆయనకు యెంత ప్రేమ !   ప్రతి ప్రాణికీ ఆయనే యేదో విధంగా ఆహరం యేర్పాటు చేస్తాడు కదా !  నాకూ అదే విధంగా యెక్కడో ఏర్పాట్లు చేసే ఉంటాడు. '  అనుకుంటూ, వుత్సాహంగా మళ్ళీ గ్రామంలోకి అడుగుపెట్టాడు.

గ్రామంలోకి వస్తూ వస్తూనే,  రహదారికి ప్రక్కగా,  అందరకూ కనబడే దిక్కులో కూర్చుని, యెవరైనా భోజనానికి పిలవరా !  అని యెదురుచూస్తూ కూర్చున్నాడు, పరాన్నభుక్కు, దేవుని మీద భారం వేసి.   అయితే, ఆరోజు గడిచిపోయి,  మరునాడు కూడా, యెవరూ అతని వైపు కన్నెత్తి చూడలేదు.  ఇంత ముద్ద పెట్టలేదు.   పరాన్నభుక్కుకి యిదేమిటో అంతుబట్టలేదు.  కుంటి నక్కకు ఆహరం అమర్చిన  దేవుడు,  తనకెందుకు యేర్పాటు చెయ్యలేదని, విలవిలలాడాడు.   ఇక ఆకలికి తాళలేక, అక్కడనుండి లేవడానికి నిర్ణయించుకున్నాడు.

అంతలో, ఒక సాధువు అటుగా రావడం పరాన్నభుక్కుకి కనిపించింది.  వెంటనే ఆయనకు మోకరిల్లి,  ఆయన  దగ్గర తన గోడు వెళ్ళబోసుకున్నాడు.   సాధువు అతని అజ్ఞానికి జాలిపడి,  ముందుగా, ఆయన దగ్గర వున్నది తినడానికి పెట్టి, మంచినీళ్ళిచ్చి, దాహం తీర్చాడు, పరాన్నభుక్కుకి.   కొద్దిగా సేదదీరి, సాధువుతో, ' స్వామీ ! ఎక్కడో, అరణ్యంలో, కుంటి నక్కకు కూర్చున్న దగ్గరకు ఆహారం పంపించిన దేవుడు, నన్నెందుకు పట్టించుకోలేదు ? '  అని దేవుని మీద నిష్టూరాలాడాడు పరాన్నభుక్కు. 

🌿అప్పుడు ఆ సాధువు మందహాసం చేస్తూ,  '  నాయనా ! నీవు అనుకున్నదానిలో యేమీ తప్పులేదు.  ఆ సృష్టికర్తకు,  యెవరికి యెప్పుడు యేమి ఇవ్వాలో అన్నీ తెలుసు.  ఎవరి చేత యేపని చేయించాలో కూడా తెలుసు.  బహుశా, నిన్ను ఆ దేవుడు, కుంటి నక్కలాగా జీవించమని ఆదేశించడం లేదేమో !  సింహంలాగా. బ్రతుకుతూ,  అన్నార్తులకు, నీ ద్వారా సహాయం చేయాలనుకున్నాడేమో !  నిన్ను సింహంలాగా చూడాలని, ఆ భగవంతుని కోరిక అయివుండొచ్చు.  అందుకనే,  నీకు కుంటినక్క లాగా, యితరులు పెడితే తినే, అవకాశం ఇవ్వలేదేమో,  ఆలోచించు.  '  అని చెప్పి,   దిశా నిర్దేశం చేసి వెళ్ళిపోయాడు. 

మన పరాన్నభుక్కుకి, జ్ఞానోదయం అయింది.   నిజమే కదా,  నాకు భగవంతుడు అన్ని అవయవాలూ యిచ్చాడు.  ఆరోగ్యం యిచ్చాడు.  అందుకు కృతజ్ఞతగా, నేనెందుకు సింహం లాగా బ్రతుకుతూ, నలుగురికీ సహాయం చెయ్యకూడదు. ? '  అనుకుంటూ, తనకు హితవచనాలు చెప్పి, కళ్ళు తెరిపించిన సాధువుకు, పాదాభివందనం చేద్దామని, ముందుకు వెళ్లి చూడగా,  యెక్కడా, ఆ సాధువు కనబడలేదు. 

భగవంతుని లీలలు గ్రహించిన ఆ యువకుడు, యిక యెంతమాత్రమూ  ' పరాన్నభుక్కు  '  గా జీవించలేదు.    అనాధల సేవలో అంకితమై,  తన తల్లిదండ్రులు పెట్టిన   ' నారాయణ '  నామం సార్ధకం చేసుకున్నాడు.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

గృహవాస్తు-శుభవాస్తు

ధర్మ సందేహాలు - సమాధానాలు

👉ప్రశ్న: వాస్తు పురుషుడు ఎప్పుడు జన్మించాడు ?

  జ. భాద్రపద బహుళ తదియ, మంగళవారము, కృత్తిక నక్షత్రము, వ్యతిపాత యోగము, భద్రనాకరణము గుళికతో కూడిన కాలములో వాస్తు పురుషుడు జన్మించాడు.

👉ప్రశ్న: గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు?

 1. ఈశాన్యం లొ పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.

 2. ఆగ్నేయం లొ అగ్నికి సంబందించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.

 3. నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.

 4. వాయువ్యం లొ స్వతంత్రబిలాష చిహ్నములు .

 5. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.

 6. యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.

 7. కుభేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.

 8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.

👆 ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.

👉 ప్రశ్న: దేవాలయాల వద్ద గృహ నిర్మాణం చేయడం దోషమా ?

జ. శివాలయానికి నూరు బారుల దూరం లొపల, విష్ణువాలయముకు వెనక ఇరవై బారుల దూరం లొపల, శక్తి ఆలయముకు సమీపం లొను గృహనిర్మాణం చేయకూడదు . దీనికి వ్యతిరేఖంగా గృహ నిర్మాణం జరిగితే సఖల సంపదలు నశించి కష్టాలపాలు అవుతారు. గుడి దగ్గర ఉన్న ఇళ్ళకు ఏ వైపునైనా , ఏ మాత్రమైనా గుడి నీడ పడిందంటే దరిద్రం, ప్రాణనష్టం వంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు.

👉  ప్రశ్న: ఎటువంటి స్థలం లొ గృహ నిర్మాణం చేయరాదు .

 1. గోవుల మందలు ఉండే ప్రదేశాలలోనూ .

 2. స్మశాన భూమికి సమీపం లొను .

 3. మలమూత్రాలు విసర్జించు ప్రదేశాలలోను .

 4. ఉప్పు నేలలోను, చవుడు నేలలయందు .

 5. ఎల్లప్పుడు నీటి వుటలు గల ప్రదేశాలలోను .

 6. రాతి భూముల యందు , మిక్కిలి రక్త వర్ణం గల భూమి యందు 

 7. చెరువులను పూడ్చి గృహ నిర్మాణం చేయరాదు అలా చేయడం వలన అనేకములు అయిన పంది జన్మలు ఎత్తి రౌరవాది నరకములు అనుభవించి కష్టాల పాలవుతారు .

👉  ప్రశ్న:  ఏయే గృహాలకి ఎటువంటి శంఖువు ప్రతిష్ట చేయాలి ?

జ. రాతితో కట్టే గృహానికి ఆ రాతితోనే శంఖువు తయారు చేసి శంఖుస్థాపన చేయవలెను . ఇటుకలతో కట్టిన గృహమునకు ఇటుకలతోనే శంఖువు చేసి ప్రతిష్ట చేయవలెను .గోడలు పెట్టక కర్రలతో , నిట్రాట లతో వేయు పాకలకు కర్రతో శంఖువు తయారు చేసి ప్రతిష్ట చేయవలెను . శంఖువును నవరత్న, సువర్ణ, తామ్ర , రజిత నాణేలతో , నవధన్యములతో పూజించి , స్థాపించవలెను . అన్ని రకాల గృహములకు కర్ర శంఖువు ప్రతిష్టించరాదు . కాష్ట శంఖువు భుమిలొ ఎంతకాలం ఉండునో అంతకాలం ఆ గృహం శుబప్రధంగా ఉండును. ఆ తరువాత ఆ గృహములలో నివసించువారికి కష్టాలు కలుగును.కావున కర్రతో చేసిన శంఖువు కంటే రాతితో చేసిన శంఖువు ఉత్తమం అని తెలుస్తుంది.

👉 ప్రశ్న: గృహ నిర్మాణం లొ ఇంటి కిటికీలు, ద్వారాలు ఏ విధంగా అమర్చాలి ?

జ. గృహంలో కిటికీలు, ద్వారములు సమసంఖ్యలో ఉండాలి. వేటికవే విడివిడిగా సమసంఖ్యలొ ఉండాలి. కిటికీలు సరిసంఖ్యలోను , ద్వారాలు సరిసంఖ్యలొను ఉండాలి. అలమారాల గురించి శాస్త్రం లొ ఏమీ చెప్పలేదు. వాటి ఉపయోగాన్ని అనుసరించి సరిసంఖ్యో, బేసి సంఖ్యలొ నో పెట్టుకొవాలి. వాటికి స్థల నిర్ణయం కూడా చెప్పలేదు కిటికీలు , ద్వారాలు సరిసంఖ్యలో ఉన్నా చివరన సున్నా లేకుండా ఉండాలి. అనగా 10,20,30 ఇలా చివరన సున్నా రాకూడదు. అలాగే మొత్తం గృహం లొ ఉన్న ద్వారాలు, కిటికీలు అన్ని లెక్కపెట్టాలి.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

కదిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి

కదిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి కల్యాణం : చుట్టూ ఎత్తైన ప్రాకారాలు, నాలుగువైపులా సమున్నత గోపురాలతో అత్యంత వైభవంగా ఉంటుంది కదిరి నృసింహుని ఆలయ ప్రాంగణం. 'బేట్రాయి సామిదేవుడా! నన్నేలినోడ! కదిరి నరసింహుడా! కాటమరాయడా!' అంటూ జానపదులు ఈ స్వామిని గురించి పాడుకుంటారు. 'ఖ' అంటే విష్ణుపాదము. 'అద్రి' అంటే కొండ. అందుకే ఈ పట్టణానికి 'ఖద్రి' అనే పేరు వచ్చింది. కాలక్రమేణా కదిరిగా రూపాంతరం చెందిందని చెబుతారు. కదిరి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో కొండపై కనిపించే పాదాల గుర్తులను విష్ణుపాదాలని చెబుతారు. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, అర్థమంటపం, రంగమంటపాలు ఉన్నాయి. గర్భగుడిపై ఏకతల విమానాన్ని నాగర శైలిలో నిర్మించారు. ఆలయానికి పశ్చిమాస ఉన్న గోపురంలో వెనుక భాగంలో ఓ కోనేరు ఉంది. దాన్ని భృగుతీర్థమని పిలుస్తారు. కదిరి నృసింహుడు అమృతవల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనమిస్తారు. ఏటా సంక్రాంతి తరవాత ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఫాల్గుణ మాసంలో బహుళ పంచమినాడు జరిగే రథోత్సవం సందర్శకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. వైశాఖంలో నృసింహ జయంతితో పాటు, మల్లెపూల తిరుణాళ్ళు బాగా నిర్వహిస్తారు. అన్ని మతాలవారూ కదిరి నరసింహస్వామిని ఆరాధించడం విశేషం. మార్చి 20న స్వామి కల్యాణోత్సవం జరుగుతుంది.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

శ్రీ విధాత పీఠంలో

భగవత్ బంధువులందరికిీ,

నరగొష  నివారణలో, అనితర సాధ్యమైన పనులను సుసాధ్యం చేయడంలో,  అడ్డంకులు తొలగించడానికి విశేష ఫలితాన్నిచ్చే చండీహోమం శ్రీ విధాత పీఠంలో ప్రతి మాసం లాగే ఈ పౌర్ణమికి 25-3-2024 (సోమవారం)కూడా యధాతదంగా పీఠం లో ఆకాంక్ష గారి గారి ఆధ్వర్యంలో జరుగును.
మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు 516/- ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay   ద్వారా కానీ పంపగలరు

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 096666 02371    `

Wednesday, 20 March 2024

కోరుకొండ తీర్థం :

ఎత్తైన కొండచుట్టూ కోరుకొండ గ్రామంలో ఏవైపు నుంచి చూసినా దేవాలయం కనిపిస్తూ సుందర దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. కొండపైనున్న ఈ ఆలయంలోని స్వయంభు నృసింహుడు పరమ శాంతమూర్తి. లఘుమూర్తిగా రాతి గూడులో ఈ స్వామి దర్శనమిస్తాడు. నేటికీ కొండపైకి ఎటువంటి రవాణా సదుపాయం లేదు. కాలిబాటనే వెళ్లవలసి ఉంటుంది. కోరుకొండ దర్శనానికి కొండ ఎక్కడం మంచి ఆధ్యాత్మిక అనుభవం. ముఖ్యంగా గోదావరి తీరప్రజలకు కోరుకొండ తీర్ధంలో పాల్గొనడం పరమానందదాయకం. కోరుకొండ దేవరకు మొక్కు చెల్లిస్తే ఎటువంటి ఆపదనుంచి అయినా రక్షిస్తాడని ప్రతీతి. పరాశర మహర్షి కారణంగా ఇక్కడ లక్ష్మీసమేతంగా నరసింహస్వామి కొలుపుదీరాడు. అందుకే ఈ కొండను పరాశరగిరి అని పిలుస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్న కోరుకొండ లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని 12వ శతాబ్దంలో రెడ్డిరాజులు అభివృద్ధి చేశారు. ఇక్కడి గోడలపై చెక్కిన శిల్పాలు రమణీయంగా ఉంటాయి. నాయకరాజుల రాజధాని రేకపల్లికి కోరుకొండకి దగ్గరి సంబంధాలుండేవి. ముమ్మడి నాయకులు ఈ ప్రాంతాన్ని 

పరిపాలించారు. వారంతా కోరుకొండ స్వామిని సేవించినవారే!

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

కుంభరాశిలో శని, కుజుడు కలయిక - పరిహారాలు

 1. “ఓం నమో భగవతే రుద్రాయ” అనే మంత్రాన్ని రోజూ 11 సార్లు జపించండి. చాలా చాలా ముఖ్యం

 2. కనీసం 40 రోజుల పాటు ప్రతిరోజూ " ఓం నమః శివాయ" లేదా ఓం నమో నారాయణాయ" వంటి మంత్రాలను లేదా మీకు ఇష్టమైన ఏదైనా మంత్రాలను జపించడానికి ధ్యానం చేయడానికి వ్రాయడానికి నిబద్ధతతో ఉండండి.   కుజుడు క్రమశిక్షణ సూచిస్తుంది మరియు శని నిబద్ధత మరియు మనం విరామం లేకుండా ఎక్కువ కాలం చేసే పనులను సూచిస్తుంది.  ఈ అభ్యాసం అంగారక/శని శక్తిని ముందుకు నడిపించడంలో చేయడంలో సహాయపడుతుంది.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

నైమిశారణ్యం :

ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు సుమారు 150 కి.మీ దూరంలో సీతాపూర్ జిల్లాలో నైమిశారణ్య క్షేత్రం ఉంది.

నైమిశారణ్య ప్రవేశం సమస్త పాతక నాశనం అని కూర్మపురాణం.

నైమిశారణ్య క్షేత్రం గురించి చెప్పాలంటే సూక్ష్మంగా (పూజ్య గురువులు తమ ప్రవచనంలో వివరంగా చెప్పారు) కలియొక్క ప్రభావం లేని ప్రదేశంకోసం మునులు, తాపసులు బ్రహ్మగారిని ప్రార్థించగా దర్భలతోచేసిన చక్రాన్ని బ్రహ్మగారు వదిలారు ఆ చక్రం అంతటా తిరుగుతూ వచ్చి ఈ అరణ్య ప్రాంతంలో తిరుగుతూ ఉండగా దానికున్న నిమి ఊడి చక్రం పడిపోయింది అందువలన ఇది నిమి పడిన క్షేత్రం కాబట్టి నైమిశారణ్యం అయ్యింది.

అంటే పుట్టడం-మరణం-పుట్టడం-మరణం-పుట్టడం అనే చక్రం ఆగి పునరావృత్తి రహిత శాశ్వత మోక్ష సిద్ధి కలగడానికి ఈ జనన మరణ ఆవృత్తి ఆగిపోవాలంటే సంసారమనే నిమి పడిపోయే ప్రదేశమే నైమిశారణ్యం.

నైమిశారణ్యంలో ప్రవేశించిన సాధకులకు భగవత్కృప వలన, సద్గురు వచనం శాస్త్ర వచనం ఆకళింపు చేసుకున్నంత సంసారంలో ఉన్నా సంసారం అంటనివ్వని ప్రదేశమే నైమిశారణ్యం.

అప్పట్నుంచీ ఇక్కడ ఎన్నో వేల మంది ఋషులు, తాపసులు, వారి శిష్యగణాలతో వసించి తపస్యాదులు చేసుకొన్న క్షేత్రం గొప్ప తపోభూమి.

మనోలయం తొందరగా కాగలిగిన క్షేత్రం. అందుచేతనే ఇక్కడ కొన్ని రోజులుండి అతి ప్రాచీన దేవాలయాలు ఎన్నో ఏళ్ళనుంచీ తాపసులు తపస్సు చేస్తున్నారా అన్నట్లుండే పెద్ద పెద్ద కైవారంతో ఉన్న దేవతా వృక్షాలు, గోమతీ నది, శ్రీ చక్ర తీర్థం ఇత్యాది ఎన్నో గొప్ప గొప్ప విశేషాలతో ఉన్న ప్రదేశం గొప్ప సాధనా క్షేత్రం. ఏదో చూసి వెళ్ళిపోదాం అనుక్కునేలాటి క్షేత్రం మాత్రం కాదు.

ఐనా సరే, ఒక్కసారి ఇందులో ప్రవేశిస్తే చాలు "రుజో హరం యస్య రజా పవిత్రం తేజోమయం యస్య తమసా పురస్తాత్..."

నైమిశారణ్యంలోని రజస్సు (ధూళి, మన్ను, మట్టి) తాకగానే సకల పాపాలు హరించుకుపోతాయట, చక్రతీర్థంలో స్నానం చేసిన భక్తులు, అక్కడి జానపదులు తడిబట్టలతో అడుగడుగు దండాలు పెడుతూ చక్రతీర్తానికి ప్రదక్షిణ చేస్తుంటారు...

నైమిశారణ్య క్షేత్రానికి కూడా అరుణాచల గిరి ప్రదక్షిణ లాగ చేస్తారు కానీ అడవి ప్రాంతం కావడం మూలాన అక్కడి వారే చేస్తూంటారు, సింహాచల క్షేత్రప్రదక్షిణోత్సవంలాగా నైమిశారణ్యంలో ఏటా ఫాల్గుణ శుక్ల పంచమి నాడు చేస్తారని అక్కడి వారు చెప్పారు.

సనాతన ధర్మంలో చరించే ప్రతి ఒక్కరూ నైమిశారణ్య క్షేత్రానికి వచ్చి చక్ర తీర్థంలో మునకలు వేయవలసిందే, చక్ర స్నానం చేసి ఒడ్డున ఉన్న యజ్ఞవరాహస్వామిని దర్శించాలి అందువల్ల అపార పాప హరం, కలిదోష హరం, యజ్ఞఫలితమూ కలుగుతాయని పెద్దల వాక్కు. ఈ దివ్య ధామానికి వచ్చి ప్రతి ఒక్కరూ కనీసంలో కనీసం ఒకరోజైనా నిద్ర చేసి అనుష్ఠానాదులు చేసుకొని, ప్రత్యేక దీక్షలు, మంత్రాలు ఉంటే ఇక్కడ సాధన చేసుకోవలసిందే ఎందుకంటే ఇది సిద్ధ క్షేత్రం.

అందుకే వ్యాసులు కలి స్సాధుః అన్నారు ఇందువల్లనే కదా మనకి నైమిశారణ్యమనే గొప్ప క్షేత్రం దొరికింది.

గోస్వామి తులసీదాసు గారి మాటలలో “తీర్థ వర నైమిశ్ విఖ్యాతా! అతి పునీత్ సాధక్ సిద్ధిధాతా!!” అని అన్నారు. భూమండలంలో ఉన్న అన్ని తీర్థాలూ క్షేత్రాలుకలిసి పెళ్ళివారి ఊరేగింపుగా కదిలి వస్తే అందులో ముఖ్యమైనదీ మధ్యలో ఉండి అందరూ చూడాలనుక్కునేదీ ఐన వరుని స్థానంలో ఉండేది నైమిశారణ్యం.

ఇది అతి పునీతమైనది సమస్త సాధకులకీ సిద్ధినొనరించే క్షేత్రముగా విరాజిల్లుతోంది.

వ్యాస, శుక, సూత, శౌనకాది మహర్షులు 88వేల మంది వారి వారి శిష్యగణాలు, అందులో శౌనకాదులు కులపతులు (11 వేల మంది శిష్యులను పోషిస్తూ వేదవేదాంగాలను బోధించేవారిని కులపతి అంటారు) దీర్ఘ సత్ర యాగం (1000 సంవత్సరాలు) చేసిన స్థలం అందునా యాగం జరిగిన చోట అన్ని వేల మందికీ అన్నదానం జరిగిన ప్రదేశం.

అంత గొప్ప గొప్ప మునులు మహర్షులు, రాజర్షులు నడయాడిన ప్రదేశం దేవతలు మెచ్చి దర్శనమిచ్చే ప్రదేశం నైమిశారణ్యం.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

అన్నం పరబ్రహ్మ స్వరూపం

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం.

దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు.

ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు.

అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు.

అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తారు. దీనికి సంబంధించి ఒక కథనాన్ని కూడా చెప్తారు.

మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఏంలాభం...! కర్ణుడికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టుండడంలేదు. సంతృప్తిఅనేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికర్థం కావడంలేదు.

ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, “నీవు అనేక దానాలు చేసావని, అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు. మరి.. ఎప్పుడైనా అన్నదానం చేసావా?” అనడిగాడు. 

దానికి సమాధానంగా “లేదు.. నేనెన్నో దానాలు చేసాను గాని అన్నదానం మాత్రం చేయలేదు!” అన్నాడు కర్ణుడు.

“పోనీ అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా?” అనడిగాడు దేవేంద్రుడు.

కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు- “అవును. ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అపుడు నేను ఏదో ధ్యాసలో ఉండి, నాకు అవకాశం లేదు గానీ... అక్కడ ఆ ఇంటికి వెళ్ళు! అని ఒక ఇంటిని చూపించాను!” 

”నీవుఅన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిను నోట్లో పెట్టుకో!” అన్నాడు ఇంద్రుడు. 

సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు.

ఒక్క గుటక వేసాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకూ ఉన్న అసంతృప్తి మటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది.

ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్మ్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది.

’నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులనుండి, ఇక్కట్ల నుండి బయటపడడానికి చక్కటి రెమిడీగా పనిచేస్తుంది అన్నదానం!’ అని చెప్తారు పండితులు.

అన్నదానం వలన అధిక ఆదాయం!

అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారమవుతాయని చెప్తారు.

అన్నదానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం ఇస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని ప్రతీతి. 

కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం, దానికితోడు విపరీతమైన ఖర్చులతో సతమతమవడం జరుగుతుంది.

అలాంటివారు అన్నంతో లడ్డు పెట్టి, తాంబూల సహితంగా దానం ఇస్తే అధిక ఆదాయం పొందడంతో పాటు శ్రీమంతులయే అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. 

ఇక అనారోగ్యంతో బాధపడుతూ వున్నవారు, దీర్ఘ రోగాలతో సతమతమవుతున్నవారు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. 

చిత్రాన్నం  దానం:

కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతుంటాయి. అటువంటప్పుడు చిత్రాన్నంతోపాటు వడ దానం చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్ర, తంత్ర సంబంధమైన దోషాలైనా తొలగిపోతాయి.

బెల్లం అన్నం దానం:

బెల్లం అన్నం దానం  చేస్తే శ్రీమంతులవుతారు. భోజనం చేసేముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో, ఇతర పక్షులకో, ప్రాణులకో పెడతారు. ఇలా చేయడంవలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది.

ఇక అన్నం తినేముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దోషాలనుంచి బయటపడవచ్చని కూడా చెప్తారు.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

సామెతలు

మన సామెతలు

 సామెతలు మన తెలుగు భాషకు ఒక ప్రత్యేకమైన వరం .ఇవి ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు.

అ ఆలు రావు గాని అగ్రతాంబూలం కావాలట .

అండలు ఉంటే కొండలు దాటవచ్చు .

అంతా తెలిసిన వాడు లేడు. ఏమీ తెలియని వాడు లేడు.

అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు.

అందని మాని పండ్లకు అర్రులు సాచినట్లు!

అందరిని మెప్పించడం కాని పని!

అందరూ అందలం ఎక్కితే మోసే వారెవరురా?

అక్క చెల్లెళ్లకు అన్నం పెట్టి లెక్క వ్రాసినట్లు.

అక్కరకు రాని చుట్టము ఎందుకు?

అవసరానికి ఆదుకునే వాడే అయినవాడు.

అగ్గి చూపితే వెన్న అడక్కుండా కరుగుతుంది.

అచ్చు వచ్చిన భూమి అడుగైనా చాలు.

అచ్చోసిన ఆబోతు లాగా!

అటుకులు బొక్కే నోరు ఆడిపోసుకునే నోరు ఊరుకోవు.

అడిగితే చిరాకు అడగకపోతే పరాకు

అడిగే వాడికి చెప్పేవాడు లోకువ

అడుక్కునే తినే వాళ్లకు అరవై ఊళ్ళు

అడుసు తొక్కనేల కాళ్లు కడగనేల?

అతికించిన కోరమీసం అట్టే నిలుస్తుందా?

అతి వినయం ధూర్త లక్షణం

అదృష్టం పండితే ఆరు నూరు అవుతాయి

అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాక్కెళ్ళిందట

అదృష్టం చెప్పి రాదు దురదృష్టం చెప్పి పోదు

అద్దెకు వచ్చిన గుర్రాలు అగడ్తలు దాటుతాయా?

అనగా అనగా రాగం తినగా తినగా రోగం

అనువు గాని చోట అధికులమనరాదు

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

సిద్దేశ్వరయానం - 20 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 భైరవనాథుడు 🏵

వాసుకి, ఐరావతుడు, ధృతరాష్ట్రుడు, తక్షకుడు మొదలైన నాగ రాజులు రాక్షసులతో సంగ్రామాలు చేసి నాగజాతిని రక్షించారు. అసురజాతులు, వారిదేశాలు ఉండగా భారతదేశంలో భువర్లోకంలోని రాక్షసులు, పూర్వం ఇక్కడ ఉన్నవారు పునర్జన్మతీసుకొన్నారు. వారిలో చాలామందిని కృష్ణదేవుడు సంహరించాడు. భారత యుద్ధంలో నాశనం చేయించాడు. అయినా వారింకా వస్తూనే ఉన్నారు. వారిలో కొందరు భయంకర తామస సాధనలు చేసి తీవ్రశక్తులు సాధించారు. హిమాలయ పర్వతప్రాంతాలలో ఉత్తర భారతంలోని కొన్ని రాజ్యలలో వారి సంచారం ఎక్కువగా ఉంది.

యువ: గురుదేవా! భూమిమీద అసురజాతులు, మ్లేచ్ఛులు, నాస్తికులు ఉన్నారు. భువర్లోకంలో రాక్షసులున్నారు. వారూ వీరూ ఒకరేనా?

వామ: దీని నేపధ్యం చాలా ఉంది. భూమి జలంనుండి బయటకు వచ్చి సృష్టి ప్రారంభైనప్పుడు ఊర్ధ్వలోకాలలోని దేవతలు, ఇక్కడికి వచ్చి ఈ ప్రకృతి సౌందర్యానికి పరవశించి నివాసాలు ఏర్పరచుకొన్నారు. దేవికా నదీతీరం వారి ప్రథమ నివాసం. మొదట్లో రాకపోకలెక్కువగా ఉండేవి. భూలోకపు అణువులు వారి శరీరాలలో ప్రవేశించి దివ్య లోక గమనశక్తి పోయింది. అయినా ఆ దేవమానవులంటే దివ్యలోక వాసులకు ఇష్టం. తమ జాతివారు గనుక అవసరమైన సమయంలో వచ్చి సహాయం చేస్తుంటారు. అలానే భువర్లోకవాసులైన విద్యాధరులు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, సిద్ధులు భూలోకవాసులైనారు. రాక్షసులు తమ జాతివారిని మానవలోకంలోని వారిని ప్రేరేపించి ధర్మపరులైన దేవజాతి మానవులతో యుద్ధాలు చేయిస్తుంటారు. ఈ లోకమంతా తమ చేతిలో ఉండాలని అందరూ తమ జాతి బానిసలుగా ఉండాలని ప్రపంచంలోని ఐశ్వర్యము అధికారము రాజ్యములు స్త్రీలు తమ వశంలో ఉండాలని కోరే స్వార్ధపరులువారు. 

తపస్సులు చేసి తీవ్రసాధనలు చేసి సైన్యములు కూర్చుకొని సర్వదేశాలను ఆక్రమించి ధర్మవినాశనం చేస్తుంటారు. దుర్మార్గులను శిక్షించటానికి అప్పుడప్పుడు మహాదేవతలు అవతరిస్తుంటారు. హిమాలయ సిద్ధాశ్రమంలోని యోగులు దివ్యలోకాలలో ఉండే దేవతల, సిద్ధుల కరుణవల్ల ధర్మరక్షణ కోసం కృషి చేస్తుంటారు. వారు మహర్షులు, యోగీశ్వరుల ప్రణాళిక ననుసరించి అవసరాన్ని బట్టి, జన్మలు తీసుకొంటారు. కొందరు యోగ్యులైన మానవులలో ప్రవేశించి ప్రేరణ నిచ్చి మహాకార్యములు చేయించి కొన్ని శక్తులు ప్రదర్శించి కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంటారు. వారు వెళ్ళిన తర్వాత ఆ మానవులు సామాన్యులవుతారు. దివ్యశక్తులుండవు. కాకుంటే ఒకప్పుడు దేవతలెన్ను కొన్నవారు గనుక ఉత్తమ సంస్కారంతో మిగిలిన జీవిత భాగం గడుపుతారు.

నీవు క్రూరశక్తులు సాధించిన మంత్ర సిద్ధులతో పోరాడవలసి ఉంటుంది. వారు ధనవంతులను రాజులను వశం చేసుకొని తమ మతాలను ప్రచారం చేసుకొని వేదమార్గీయులను తమ మతంలోకి మారుస్తారు. కాముకులై స్త్రీలను వశం చేసుకుంటారు. పతివ్రతలను పాడుచేస్తారు. అప్రతిహతమైన వారి మంత్రశక్తి ముందు ఎవరూ నిలవలేరు. దానిని ఎదుర్కోగల మహాశక్తిని నీవు సాధించాలి.

యువ : గురుదేవా ! నేనేం చేయాలో ఎలా చేయాలో ఆదేశించండి!

వామ : నాగభైరవా ! నేను పూర్వయుగంలో ఒక కన్య చేత తీవ్రసాధన చేయించిన పద్ధతి చెపుతాను. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. అతని కుమారుడు బలి. రాక్షసరాజు. అతని కథ భాగవతంలో ఉంది. ప్రసిద్ధమైనది. విరోచనుని కొక కూతురున్నది. అందరూ ఆమెను వైరోచని అనేవారు. చాలా సౌందర్యవతి. విద్యావతి. వినయశీల. ఆమె నా ఆశ్రమానికి వచ్చి పోతూ ఉండేది. ఆమె ఒకరోజు నన్ను ప్రార్ధించింది. "గురువుగారూ! మీరు మహర్షులు. మీ తపశ్శక్తి అసామాన్యమైనది. మా పూర్వుల చరిత్రలు - వారి తపస్సులు జగద్విదితములు, హిరణ్యాక్ష హిరణ్యకశిపుల దేవద్వేషము స్వార్ధము వారిని నాశనము చేసినవి. మా తాతగారు ప్రహ్లాదులవారు మహనీయులు. దేవకార్యంకోసం వైకుంఠవాసి, విష్ణువు అనుచరుడు అయిన శంకుకర్ణుడనే వ్యక్తి జన్మతీసుకొని హిరణ్యకశిపుని తన సాత్వికశక్తితో ఓడించాడని పెద్దలు చెప్పగా విన్నాను. మా తండ్రి మహావీరుడు. ఆయనను యుద్ధంలో గెలువలేక ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి యాచిస్తే తన ప్రాణములనే దానం చేసిన మహానీయుడతడు. 

నాకు అందరివలె పెండ్లి చేసుకొని పిల్లలను కని జీవితం గడపాలని లేదు. తపస్సు చేసి దివ్యత్వాన్ని సాధించాలని ఉంది. మా ముత్తాతల వలె ఘోర సాధన చేయలేను. సులభపద్ధతి అడగను. కానీ శీఘ్రంగా ఇష్టసిద్ధిని పొందే మార్గం ఉపదేశించమని ప్రార్థిస్తున్నాను. "నేను కొంత సేపు ఆలోచించి మా ఆశ్రమం ఏ కొండ క్రింద ఉన్నదో ఆ కొండమీది గుహలోకి ఆ అమ్మాయిని తీసుకు వెళ్ళాను.

అది నా గుహ. దానిలోనికి ఎవరికీ ప్రవేశం లేదు. మొదటిసారి ఈమెకు అనుమతి ఇచ్చాను. ఆ గుహలో లోపలికి పోతే ఒక విగ్రహం భయంకరంగా ఉంది. అది ఛిన్నమస్తా విగ్రహం. ఒక చేతిలో ఖడ్గము, ఒక చేతిలో నరకబడిన తనతల రతిమన్మధాసనం మీద నిలబడిన దిగంబర, ముక్తకేశ, కపాల మాలాధర - అటు ఇటు చెలకత్తెలు వర్ణిని, డాకిని. కంఠంలో నుండి ఎగజిమ్మే మూడు రక్తధారలు మధ్య ధార తన శిరస్సుతో తానే పానం చేస్తున్నది. మిగతా రెండు రక్తధారలను చెలికత్తెలు త్రాగుతున్నారు. "అమ్మా! యీ దేవత ఛిన్నమస్త - వజ్రవైరోచని ఈమెను హిరణ్యాక్షుడుపాసించాడు. సాక్షాత్కారించిన ఆ దేవతను అమరత్వం ఇమ్మని ప్రార్థించాడు. అది తప్ప ఇంకేదైనా కోరుకోమన్నది దేవత. అతడు "అమ్మా! నీవు తప్ప నన్నింకెవడూ చంపగూడదు" అన్నాడు. ఆమె దానికి తథాస్తు అన్నది. మళ్ళీ “నీవు కూడా నన్ను చంపకూడదు" అన్నాడు. దానికి కూడా తథాస్తు అన్నది. వరగర్వంతో అతడు దుష్కార్యములు చేశాడు. వజ్రేశ్వరి శిరస్సు మీది కిరీటం మీద వరాహ చిహ్నం ఉంటుంది. అందువల్ల ఆమెను వజ్రవారాహి అన్నారు. వరాహముఖిగా కూడా కొందరు దర్శించారు. ఆ దేవత పురుష రూపంలో శ్వేత వరాహమూర్తియై హిరణ్యాక్షుని సంహరించింది. ఆమె యొక్క పురుష రూపం గనుక ఆమె చంపినట్లే. అయితే ఆమె స్త్రీగా చంపలేదు గనుక చంపినట్లూ కాదు. అలా అతని కథ ముగిసింది. ఆ దేవతను నేనుపాసించాను. బలులులేవు. పంచాగ్ని మధ్యంలోనో కంఠదఘ్నజలంలోనో ఉండి తపస్సు చేయటం లేదు.ఆ దేవత అనుగ్రహించింది.

( సశేషం )

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

ద్వారకా నగరంలోని ద్వారకాదీసుని కి మంగళహారతి

నిత్య రాశి ఫలాలు

21/మార్చి /2️⃣0️⃣2️⃣4️⃣బృహస్పతివాసరే ( గురువారం )

🐐 మేష రాశిఫలితములు.

అశ్వని 1, 2, 3, 4, పాదములు (చూ, చే, చో, లా)

భరణి 1, 2, 3, 4 పాదములు (లీ, లూ,లే, లో)

కృత్తిక 1వ పాదము (ఆ).

      మీకుమీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకొండి. అది మీలో విశ్వాసాన్ని , సరళతను పెంచుతుంది. కానీ అదేసమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ ద్వేషం వంటివాటిని విసర్జించ డానికి సిద్ధపరచాలి. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి, ధనం తాజాగా ప్రవహి చగలదు. మీకుటుంబంతో కలిసి ఒక చక్కని క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ చక్కగా ఆనందించండి, ప్రత్యేకమయిన రోజుగా చేసుకొండి. ఈ రోజు మీ ప్రేమైక జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది. ఎవరైతే చాలారోజులనుండి తీరికలేకుండా గడుపుతున్నారో మొతానికి వారికి సమయము దొరుకుతుంది మరియు వారిఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు. అది మిమ్మల్ని అప్ సెట్ చేస్తుంది. పాటలు పాడటం,నృత్యం మిమ్ములను అనేకఒత్తిడులనుండి దూరంచేస్తుంది మరియు మీరు దీనిని ఆచరణలో పెట్టండి.

      లక్కీ సంఖ్య: 7

🐃 వృషభ రాశిఫలితములు.

కృత్తిక 2,3,4 పాదములు (ఈ,ఊ,ఏ)

రోహిణి 1,2,3,4 పాదములు (ఓ,వా,వీ,వూ)

మృగశిర 1,2 పాదములు (వే,వో).

     అదృష్టం పైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే, అదృష్ట దేవత బద్ధకంగల దేవత. ఈరోజు మీరు మీతల్లితండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువమొత్తంలో ఖర్చుచేయవలసి ఉంటుంది.ఇది మీయొక్క ఆర్థికస్థితి దెబ్బతీసినప్పటికీ మీయొక్క సంబంధంమాత్రం దృఢపడుతుంది. మీ కుటుంబసభ్యులకి సహాయం చెయ్యడానికి మీకున్న ఖాళీ సమయాన్ని కేటాయించండి. మీ జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరగనుంది. ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. ఈరోజు, మీరు ఖాళిసమయములో ఆధ్యాత్మికకార్యక్రమాలను చేయాలనుకుంటారు.ఈసమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. అసలు బంధుత్వాలనే వదులుకుందాము అనేటంత తగాదాలు తరుచు అవుతుంటాయి- ఏమైనా అంత సులువుగా ఆ పని చెయ్యరు. మీరు మీయొక్క ఫోటోగ్రఫీ ప్రతిభాపాటవాలను బయటకుతీస్తారు,మంచి మంచి ఫోటోలను మీరుతీస్తారు.

లక్కీ సంఖ్య: 7

👬 మిథున రాశిఫలితములు.

మృగశిర 3,4 పాదములు (కా,కి)

ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ,ఖం,ఙఙ్గ, చ్ఛ)

పునర్వసు 1,2,3 పా|| (కే, కో, హా).

       సరదాకోసం బయటకు వెళ్ళేవారికోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్) పొందుతారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురిఅయితే ,మీరు ఆర్ధికసమస్యలను ఎదురుకుంటారు.మీరుఈసమయంలో డబ్బుకంటే మీకుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. కుటుంబంతో సామాజిక గెట్-టుగెదర్, ప్రతిఒక్కరినీ మంచి మూడ్ లో ఉంచుతుంది. మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించే ఆలోచిస్తారు. మీరు శరీరాన్ని ఉత్తేజంగా,దృఢంగా ఉంచుకోడానికి రూపకల్పనలు చేస్తారు,కానీ మిగినలరోజులలాగే మీరు వాటిని అమలుపరచటంలో విఫలము చెందుతారు. వానకు రొమాన్స్ తో విడదీయలేని బంధముంది. ఈ రోజు అలాంటి అద్భుతానుభూతిని రోజుంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభూతి చెందనున్నారు. కస్టపడి పనిచేసి,పార్టీ చేసుకోండి.ఇది అధునాతన జీవనమంత్రము,కాని అతిగా పార్టీల్లో పాల్గొనుట ఆరోగ్యానికి మంచిదికాదు.

      లక్కీ సంఖ్య: 5

🦀 కర్కాటక రాశిఫలితములు.

పునర్వసు 4వ పాదము (హి)

పుష్యమి 1, 2, 3, పాదములు (హు, హె, హో, డా)

ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు (డీ, డు, డే, డో).

      మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకం. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. నిబ్బరం కోల్పోకండి. వైఫల్యాలు చాలా సహజం, అవే జీవన సౌందర్యం. మీరు మీయొక్క ఖాళీసమయాన్ని మిఅమ్మగారి అవసరాలకొరకు వినియోగించుకోవాలి అనుకుంటారు,కానీ కొన్ని అత్యవసర విషయాలు రావటమువలన మీరు సమయము కేటాయించలేరు.ఇదిమిమ్ములను ఇబ్బంది పెడుతుంది. మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది. మీరు పూర్తిచేయగల్గిన పనులను మీరువాయిదా వేయకపోవటం మంచిది.

లక్కీ సంఖ్య: 8

 🐯 సింహ రాశిఫలితములు.

మఘ 1,2,3,4 పాదములు (మా,మీ,మూ,మే)

పుబ్బ 1,2,3,4 పాదములు (మో,టా,టీ,టు)

ఉత్తర 1వ పాదము (టే).

       సంకల్ప బలం లేకపోవడం వలన మీరు భావోద్వేగం మరియు, మానసిక ఉద్వేగానికి గురిఅవుతారు. తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యండి. పిల్లలు మీకు రోజుగడవడం కష్టతరం చేవచ్చును. వారి అభిరుచిని నిలపడానికిగాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన వత్తిడిని దూరంగా ఉంచండి. గుర్తుంచుకొండి, ప్రేమిస్తేనే, ప్రేమను పొందగలరు. సాయంత్రం కోసంగాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చెయ్యండి. ఆవిధంగా దానిని వీలైనంత రొమాంటిక్ గా చెయ్యడానికి ప్రయత్నించండి. ఈరోజు, మీకుటుంబసభ్యులతో కూర్చుని మీరు జీవితంలోని ముఖ్యవిషయాలగురించి చర్చిస్తారు.ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బందిపెడతాయి.కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షరసత్యాలనీ ఈ రోజు మీకు తెలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి. మీరుమనస్సులో ఏమనుకుంటున్నారో అది చెప్పటంకూడా చాలాముఖ్యము,ఇది ప్రేమను మరింత పెంచుతుంది.

      లక్కీ సంఖ్య: 7

💃 కన్యా రాశిఫలితములు.

ఉత్తర 2,3,4 పాదములు (టో,పా,పి)

హస్త 1,2,3,4 పాదములు (పూ,షం,ణా,ఢ)

చిత్త 1,2 పాదములు (పే,పో).

       ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈరోజు మీరు డబ్బుఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చుపెట్టటమువలన మీయొక్క భవిష్యత్తుమీద ఎలాంటి ప్రతికూలప్రభావము చూపుతుందో తెలుసుకుంటారు. మీకు సహాయపడేందుకు ప్రయత్నించగలరు గలరు అనుకునే పెద్దమనుషులకి, మీ ఆకాంక్షల గురించి తెలియచేయండి. మీ ప్రియమైన వారి సహకారం లేకపోతే మీరు ఖాళీ... మీకుఎదురైన ప్రతివారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులను చేసే ఆకర్షణయొక్క కిటుకు, మీసన్నిహిత వ్యక్తులు అతికొద్ది మందికే తెలుస్తుంది. మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరఫు బంధువులు పాడుచేయవచ్చు. మీఆరోగ్యముకొరకు మంచివిషయము నిద్ర.మీరుఈరోజు మంచిగా నిద్రపోతారు.

లక్కీ సంఖ్య: 5

 ⚖️ తుల రాశిఫలితములు.

చిత్త 3,4 పాదములు (రా,రి)

స్వాతి 1,2,3,4 పాదములు (రూ,రే,రో,తా)

విశాఖ 1,2,3 పాదములు (తీ,తూ,తే).

     అవాంఛనీయ ఆలోచనలు వచ్చి, మిమ్మలని కలతపెడతాయి. అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి. ఖాళీగా ఉన్న మనసు దయ్యాల నిలయం కదా! ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్నచిన్న వస్తువులమీద ఖర్చుచేస్తారు.ఇది మీయొక్క ఒత్తిడిని తగ్గ్గిస్తుంది. మీ సంతానానికి చెందిన ఒకసన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు, మీ ఆశలమేరకు ఎదిగి, మీకలలను నిజం చేసే అవకాశం ఉన్నది. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోను, పూవులతోను నిండిపోతుంది. కుటుంబంలోని ఒకరు వారికి సమయము కేటాయించామని ఒత్తిడితెస్తారు.మీరు ఒప్పుకున్నప్పటికీ ,ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది. మీకో విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్! నమ్మరా? కాస్త గమనించండి. ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలిసిరావడం ఖాయం. కుటుంబ సభ్యుడితో కొంత టిఫ్ తర్వాత ఇంట్లో కొంత అసమ్మతి ఏర్పడుతుంది. కానీ, మీరు మీరే శాంతింపజేయడానికి మరియు ఓపికగా ఉండటానికి ప్రయత్నిస్తే మీరు అందరి మనోభావాలను ఎత్తివేయవచ్చు.

      లక్కీ సంఖ్య: 7

🦂 వృశ్చిక రాశి.

వృశ్చిక రాశి ఫలితములు.

అనూరాధ 1,2,3,4 పాదములు (నా,నీ,నూ,నే)

జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో,యా,యీ,యు)..

        ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, ఔట్ డోర్ అంటే, ఇంటిలోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. ఆర్థిక సంబంధమయిన విషయాలకు సంబంధించి, మీకుతెలిసిన ఒకరు అతిగా స్పందించి, ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. మీభాగస్వామి మిగూర్చి బాగా ఆలోచిస్తారు,దీనివలన వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు.మీరుతిరిగి కోప్పడకుండా వారినిఅర్ధంచేసుకుని,కోపానికిగల కారణాలు తెలుసుకోండి. ఈరాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కాలవటముకంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు.మీరు ఖాళి సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోడానికి కేటాయిస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తుండటం ఈ రోజు మిమ్మల్ని బాగా కుంగదీసి ఒత్తిడిపాలు చేయవచ్చు. సహోఉద్యోగులతో ఎక్కువసమయము గడపటమువలన మీరు కుటుంబసబ్యుల కోపానికి బాధితుడు అవుతారు,కాబాట్టి సాధ్యమైంతవరకు నియంత్రించండి. 

లక్కీ సంఖ్య: 9

🏹ధనూరాశి ఫలితములు.

మూల 1,2,3,4 పాదములు (యే,యో,బా,బి)

పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (భూ,ధ,భా,ఢ)

ఉత్తరాషాఢ 1వ పాదము (భే).

      మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశమున్నది మీరు ఈరోజు ఎవరిని పరిగణంలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వొద్దు,లేనిచో ఇదిమీభవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. పూర్వీకుల వారసత్వపు ఆస్తి కబురు మీ కుటుంబమంతటినీ ఆనందపరుస్తుంది. మీ రొమాంటిచ్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి, గాలిలో ప్రయాణించనివ్వకండి. ఈరోజు, సామాజిక మరియు మతపరమయిన వేడుకలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారు. దాంతో ఆమె/అతను మీతో గొడవ పడతారు. ఎవరి సన్నిహిత్యము లేకుండా మీరుఈరోజుని ఆనందంగా గడుపుతారు.

      లక్కీ సంఖ్య: 6

🐊మకర రాశి ఫలితములు.

ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (భో,జా,జి)

శ్రవణము 1,2,3,4 పాదములు (జూ,జె,జో,ఖ).

      ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈరోజు మీసంతానము నుండి మీరు ఆర్ధికప్రయోజనాలను పొందగలరు.ఇది మీయొక్క ఆనందానికి కారణము అవుతుంది. ఇల్లుమారడం ఎంతో శుభకరం కాగలదు. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన ఈ రోజు మీ సరసం సరదాలను నాశనం చేస్తుంది. మీరు శరీరాన్ని ఉత్తేజంగా,దృఢంగా ఉంచుకోడానికి రూపకల్పనలు చేస్తారు,కానీ మిగినలరోజులలాగే మీరు వాటిని అమలుపరచటంలో విఫలము చెందుతారు. ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ కావచ్చు. మీరు వివాహితులుఅయితే , మీపిల్లలమీద అభియోగాలను వింటారు.ఇదిమీకు విచారాన్నికలిగిస్తుంది. 

లక్కీ సంఖ్య: 6

🏺కుంభ రాశి ఫలితములు.

ధనిష్ఠ 3,4 పాదములు (గూ,గే)

శతభిషం 1,2,3,4 పాదములు (గో,సా,సీ,సూ)

పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే,సో,దా).

     స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఈరాశివారు ఈరోజు ధనాన్ని స్థిరాస్తికి సంబంధించిన సమస్యలమీద ఖర్చుచేస్తారు. మనుషులు మీకు బోలెడు ఆశలు కలలు కలిగించవచ్చును- కానీ మీ పరిశ్రమ పైనే అంతా ఆధారపడి ఉంటుంది. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది. మీరు మీయొక్క చదువులకోసము లేక ఉద్యోగులకోసము ఇంటికి దూరంగా ఉంటునట్టుఅయితే, మీయొక్క ఖాళిసమయాన్ని మీకుటుంబసభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి.మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు చెప్పలేనంత మూడ్ లో ఉన్నారు. ఈ రోజును మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజుగా మార్చుకోవడానికి మీరు చేయాల్సిందల్లా కేవలం అతనికి/ఆమెకు సాయపడటమే. మీలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా మీరు ఈ రోజు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటకు వెళ్లవచ్చు మరియు మీరు కూడా పరిష్కారం కనుగొనలేరు. 

      లక్కీ సంఖ్య: 4

🐬మీన రాశి ఫలితములు.

పూర్వాభాద్ర 4వ పాదం (దీ)

ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దూ,ఞం,ఝ,థా)

రేవతీ 1,2,3,4 పాదములు (దే,దో,చా,చి)..

       ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసికస్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మ విశ్వాసంతో ఉందేలాగ చేస్తుంది. మీరు మీభాగస్వామియొక్క అనారోగ్యము కొరకు ధనాన్ని ఖర్చుపెడతారు.,అయినప్పటికీ మీరు దిగులుచెందాల్సిన పనిలేదు,ఎప్పటినుండో పొదుపుచేస్తున ధనము ఈరోజు మీచేతికి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది. మీ ప్రియమైన వ్యక్తి, మీరు సంతోషంగా ఉండడం కోసమ్ పనులు చేస్తారు. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు. మినక్షత్ర గోచారము మీరు మీస్నేహితులతో ఆనందిస్తారుఅని తెలుపుతున్నది,కానీ కొంతవరకే బాగుంటుందని గుర్తుంచుకోండి 

లక్కీ సంఖ్య: 1

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

పంచాంగం

శ్రీ గురుభ్యోనమః🙏🏻

గురువారం,మార్చి 21,2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం

తిథి:ద్వాదశి తె5.36 వరకు

వారం:గురువారం(బృహస్పతివాసరే) 

నక్షత్రం:ఆశ్రేష రా2.30 వరకు

యోగం:సుకర్మ రా7.02 వరకు

కరణం:బవ సా4.51 వరకు తదుపరి బాలువ తె5.36 వరకు

వర్జ్యం:మ2.22 - 4.06

దుర్ముహూర్తము:ఉ10.07 - 10.55 మరల మ2.55 - 3.43

అమృతకాలం:రా12.46 - 2.30

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30

సూర్యరాశి:మీనం

చంద్రరాశి:కర్కాటకం

సూర్యోదయం:6.10

సూర్యాస్తమయం:6.06

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

శ్రీ విధాత పీఠంలో

భగవత్ బంధువులందరికిీ,

నరగొష  నివారణలో, అనితర సాధ్యమైన పనులను సుసాధ్యం చేయడంలో,  అడ్డంకులు తొలగించడానికి విశేష ఫలితాన్నిచ్చే చండీహోమం శ్రీ విధాత పీఠంలో ప్రతి మాసం లాగే ఈ పౌర్ణమికి 25-3-2024 (సోమవారం)కూడా యధాతదంగా పీఠం లో ఆకాంక్ష గారి గారి ఆధ్వర్యంలో జరుగును.
మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు 516/- ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay   ద్వారా కానీ పంపగలరు

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 096666 02371    `

 సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Tuesday, 19 March 2024

రామానుజుల వారి జనన రహస్యం..

       మహీధరాయ 

  ద్వాపరయుగం అంత్య దశలో భూలోకంలో దుష్టుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆ దుర్మార్గుల అరాచకాన్ని, భారాన్ని మోయలేక భూదేవి తల్లడిల్లి పోయినది.

దేవతల సహాయం ఆశించి భూదేవి          గో రూపం లో బ్రహ్మ వద్దకి వెళ్ళి ప్రార్ధించినది.

అప్పుడు బ్రహ్మదేవుడు "భూమి భారాన్ని తగ్గించే శక్తి మహావిష్ణువుకే వుంది" అని గో రూపంలోని భూదేవిని, దేవతలని  తన వెంట రమ్మని పాలకడలి వెళ్ళాడు. అక్కడ ఆదిశేషునిపైన పవళించిన మహావిష్ణువు దగ్గర భూదేవి బాధలను బ్రహ్మదేవుడు దేవతలు వినిపించి భూభారం తగ్గించి అనుగ్రహించమని ప్రార్ధించారు.

అప్పుడు మహావిష్ణువు "భూదేవి.. భయపడకు! గో రూపంలో వచ్చి ప్రార్ధన చేసిన నీకు గోవులను కాసే గోపాలునిగా అవతరించి నీ బాధలు తీర్చి ధర్మరక్షణ చేస్తాను!" అని వాగ్దానం చేశాడు.

ఆవిధంగానే మహావిష్ణువు కృష్ణుని గా అవతరించి కంసుని, శిశుపాలుని, దంతవక్త్రుని, జరాసంధుడిని, కౌరవులను, నరకాసురుని మొదలైన అనేకమంది దుష్టులను సంహరించాడు.  భూమి భారాన్ని తగ్గించి తిరిగి వైకుంఠానికి వెళ్ళాడు.

శ్రీ కృష్ణుడు తన అవతారం చాలించి వెళ్ళినంతనే భూలోకంలో ద్వాపరయుగం  గతించి కలియుగం ఆరంభమైనది.

 కలి ప్రభావంతో తిరిగి దుర్మార్గాలు అధికమయ్యాయి. ద్వాపరయుగంలో కన్నా కలియుగంలో దుర్మార్గాలు మరింత ఎక్కువగా అయ్యాయి. అది చూసి మహావిష్ణువు మహాలక్ష్మితో...   "దేవీ భూమి మీద దుర్మార్గుల దౌర్జన్యాలు మితిమీరిపోయాయి.ఇప్పుడు మరల నేను అవతారం దాల్చి దుర్మార్గాన్ని మొత్తంగా అణచివేసే సమయం ఆసన్నమయింది!" అని అన్నాడు. 

అందుకు మహాలక్ష్మి…"స్వామీ ..మీరు  అవతారం దాల్చి దుష్టులను నిర్మూలిస్తే భూలోకంలో ఎనభైశాతం ప్రజలను నిర్మూలించవలసి వుంటుంది. కొంచెం ఆలోచించండి. ఈ కార్యానికి ఈసారి మీకు బదులుగా  ఆ బాధ్యతను ఆదిశేషువు కు అప్పగించండి!” అని సలహా ఇచ్చింది.

”ఆదిశేషువు మాత్రం వెళ్ళి భూలోకంలో దుర్జన నిర్మూలన చేసి భూభారం తగ్గించగలడా?"  అని అడిగాడు మహావిష్ణువు.

అందుకు మహాలక్ష్మి"స్వామీ.. దుష్టులు పెరగడం భూమికి భారం కానీ సజ్జనులు  భూమికి భారంకాదు.   కృష్ణావతారంలో  దుష్టులను మాత్రం సంహరించి భూదేవి భారం తగ్గించారు. కాని కలియుగం లో అది అసాధ్యం. అందువలన ఆదిశేషువుని ఒక ఆచార్యునిగా అవతరింపచేసి ఆయన ద్వారా లోకానికి మంచి ఉపదేశాలను బోధించి దుర్మార్గులనందరిని సన్మార్గంలో పెట్టడానికి తీవ్రంగా కృషిచేస్తే, ప్రజలంతా సజ్జనులై సన్మార్గ మార్గాన జీవిస్తే భూమికి భారం తగ్గినట్లే!" అన్నది మహాలక్ష్మి.

"పాటించ తగిన ఆలోచన" అని ఆదిశేవుని పిలిచి.. “నీవు భూలోకంలో అవతరించి సకల వేద, ధర్మ శాస్త్రాలను, ఉపనిషత్తులను  పామరులకు కూడా అర్ధమయ్యేలాగ ఉపదేశించి, ప్రజలను సన్మార్గులుగా  తీర్చిదిద్ది రమ్మని ఆదేశించాడు మహావిష్ణువు.

పరమాత్మ ఆజ్ఞానుబద్దుడై ఆదిశేషువు రామానుజాచార్యులుగా అవతరించి వేదార్ధ, ఉపనిషత్తుల సారాంశాన్ని ధర్మనిరతిని పాటిస్తూ   పామరులకు కూడా అర్ధమయ్యేలాగా ఉపదేశించి అనేకమందిని సజ్జనులుగాను, పండితులుగాను, ఆధ్యాత్మికా తత్పరులుగానూ మార్చగలిగాడు. అందువలన భూమికి కొంత భారం తగ్గినది.

రామానుజుల వారి అవతారం గురించి, ఆ ఆచార్యుని బోధలు కలియుగంలో మంచి మార్పులు తెస్తుందని ‘మణవాళ మాముని’ ముందుగానే సూచించారు.

ఈవిధంగా మహావిష్ణువు తానో లేక, ఆదిశేషువు వంటి తన భక్తదాసుల ద్వారానో, భూభారాన్ని తగ్గిస్తూ  భూమిని కాపాడుతున్నందున నారాయణుడు "మహీధరః"  పిలువబడుతున్నాడు.

ఈ నామమే అనంతుని వేయినామాలలో 371వ నామము.

"మహీధరాయ నమః"

నిత్యం జపించే భక్తులను కాపాడుతూ రజో,తమోగుణ ప్రధానులైన దుర్మార్గులను మహావిష్ణువు నిర్మూలించి అనుగ్రహం ప్రసాదిస్తాడు...