Wednesday, 23 September 2020

సెప్టెంబర్ 24, 2020 నేటి రాశిఫలాలు :

 


మేషరాశి

ఈ రోజు మంచి మనస్సుతో చేసే పనులు త్వరగా నెరవేరుతాయి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. అష్టమంలో చంద్ర దోషం ఉంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం. 

వృషభరాశి

ఈ రోజు బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది. 

మిథునరాశి

ఈ రోజు శుభప్రదమైన కాలం నడుస్తోంది. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. సమర్ధంగా బాధ్యతలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. ఇష్టదేవతా ఆరాధన శుభాన్ని కలిగిస్తుంది.

కర్కాటకరాశి

ఈ రోజు చేపట్టే పనిలో ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. తోటివారిని కలుపుకొని పోవడం ఉత్తమం. మానసిక అశాంతి ఉంటుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం. చీమలకు చక్కర వెయ్యండి.

సింహరాశి 

ఈ రోజు మిశ్రమకాలం. సొంత నిర్ణయాలు పనిచేయవు. సంకుచిత విమర్శలను పట్టించుకోకండి. మంచి ఆలోచనావిధానంతో ముందుకు సాగండి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మంచిది. .


కన్య రాశి
ఈ రోజు అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో ఒకటీ రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శివారాధన వల్ల మంచి జరుగుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి.

తులరాశి
ఈ రోజు శ్రమ అధికం అవుతుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మనసు పెట్టి పని చేస్తే విజయం మీదే. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుక్కలకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి 

వృశ్చికరాశి 
ఈ రోజు విశేషమైన శుభఫలితాలు ఉన్నాయి. శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు నవీకరించుకుని గొప్ప ఫలితాలు పొందుతారు. అవసరమైన వాటిపై దృష్టి సంకల్పసిద్ధి ఉంది. ఇష్ట దైవారాధన శుభం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనస్సు రాశి
ఈ రోజు చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులను ప్రసన్నం చేసుకునేలా ముందుకు సాగండి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం. 
మకరరాశి 
ఈ రోజు మనోధైర్యంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. నూతన వస్తువులు కొంటారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. శివారాధన మేలు చేస్తుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

కుంభరాశి
ఈ రోజు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వర్తించి అందరి ప్రశంసలు పొందుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. లక్ష్మి దేవి ఆరాధన చేయండి .

మీనరాశి
ఈ రోజు శ్రమ పెరుగుతుంది. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. ఆర్థికాంశాల్లో జాగ్రత్త. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విష్ణు అష్టోత్తర శతనామావళి చదివితే సమస్యలు తొలగుతాయి. పశువులకు  ఆహారంగా పచ్చగడ్డి వెయ్యండి.


సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


follow us :

plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)


శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
















No comments:

Post a Comment