మేషం:
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి సహాయం అందుతుంది. అదనపు ఆదాయం సమకూరి అప్పులు తీరతాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అనుకోని లాభాలు. పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగుతాయి.
వృషభం:
మీ శ్రమ ఫలించే సమయం. కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. అనుకున్న కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వివాహ , ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి.
మిథునం:
మొదట్లో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ అనుకూలిస్తుంది. రాబడి అనూహ్యంగా పెరిగి అప్పులు తీరుస్తారు. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు అనుకూల మార్పులు.
కర్కాటకం:
ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అందరిలోనూ ప్రత్యేకత సాధిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆదాయం ఆశాజనకమే. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి.
సింహం:
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యం కుదుటపడి ఉపశమనం పొందుతారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కే అవకాశం.
కన్య:
కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. భూ, వాహనయోగాలు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు సమస్యలు తీరి ఒడ్డునపడతారు.
తుల:
కొన్ని సమస్యలు తీరి ప్రశాంతత చేకూరుతుంది. పాత విషయాలు నెమరువేసుకుంటారు. కార్యజయం. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారులకు అధిక లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు సంభవం.
వృశ్చికం:
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి.
ధనుస్సు:
ఆదాయం మెరుగుపడుతుంది. కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కే అవకాశం.
మకరం:
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఆదాయానికి లోటు ఉండదు. వ్యాపారులకు ఊహించని లాభాలు అందుతాయి, ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.
కుంభం: ఆదాయం ఆశించినంతగా లేక అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు పనిభారం.పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి.
మీనం: కొత్త విషయాలు తెలుస్తాయి. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు. అందరిలోనూ పరపతి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు అధికలాభాలు లభించే వీలుంది. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
like and share
facebook page
https://www.facebook.com/vidhathaastornumerology/?view_public_for=1712439968969888
Printerest
https://in.pinterest.com/vastronumerology/sree-vidhatha-peetam/
Twitter
https://twitter.com/VidhathaAstrolo
Instagram
https://www.instagram.com/sreevidhathapeetam/
Blog
https://vidhaathaastronumerology.blogspot.com/
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment