నష్టజాతక ప్రశ్న అంటే పుట్టిన తేదీ, పుట్టిన సమయం తెలియని వారికి, వారి యొక్క జన్మించిన తేదీ, సమయం లగ్నం తెలుసుకుని జాతకచక్రమును రూపొందించే జ్యోతిష్య శాస్త్ర విధానం. ప్రజలకు తాము జన్మించిన సమయం, పుట్టిన తేదీ వివరాలు గుర్తుంచుకోకపోవడం వల్ల తరువాతి కాలంలో ఆ వ్యక్తి గ్రహదోషాల రీత్యా అవయోగాలు సమస్యలు ఎదురయినపుడు గ్రహదోషాలకు పరిహారములు ఏమిటో ఏ గ్రహదోషాలు ఉన్నయో తెలియక తికమక పడతారు. పుట్టిన పేరును బట్టి, మొదటి అక్షరాన్ని బట్టి, రాశిని నిర్ణయించుకొని మనకు మన రాశి తెలిసింది అని సంతృప్తి పడదామని ప్రయత్నిస్తారు. కాని అది సరైన విధానం కాదు. ఎందుకంటే మీ పేరును, మీరు జన్మించిన నక్షత్రానికి సంబంధించి పెట్టి ఉండకపోవచ్చు. అప్పుడు మీకు మీ రాశి ఖచ్చితంగా తెలియకపోవచ్చు. రాశి మాత్రమే తెలుసుకోవడం వల్ల జాతకచక్రం రూపొందించలేము. రాశి వల్ల ఒక వ్యక్తి యొక్క గుణగణాలు మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు ప్రశ్న, గుణగణాలు తెలుసుకోవడం కాదు గదా. జన్మకుండలిలో గ్రహాల దోషాల అవయోగాల వల్ల జాతకులు ఎదుర్కొంటున్న దుష్పరిణామాలు సమస్యలకు గ్రహదోష పరిహారాలు తెలియాలి.
నష్ట జాతక ప్రశ్నము అనే జ్యోతిష్య విధానం ద్వారా మీ చేత ప్రశ్న వేయించి, మీ యొక్క పుట్టినతేది, పుట్టిన సమయం, లగ్నం తెలుసుకొని మీ జాతకచక్రమును రూపొందించటం జరుగుతుంది.
మన పూర్వీకులైన మహర్షులు ఎంతో తపశ్శక్తితో దైవానుగ్రహం పొంది, ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని సిద్ధి పొంది జ్యోతిష్య శాస్త్రంలో నష్టజాతకాధ్యాయమును తాళపత్రముల ద్వారా మనకు అందజేయటం జరిగింది.ద్వారా మీ జాతక చక్రమును రూపొందించుకోవచ్చు. మీలో ఎవరికైనా జన్మతేదీ, సమయం తెలియని వారు జాతకచక్రమును పొందదలచిన వారు,అందరూ దైవనుగ్రహం, గురుదేవుల అనుగ్రహం పొందాలని సదా కోరుకుంటున్నాము.మీ యొక్క జాతకచక్రమును పొందగోరు వారు గురూజిని ప్రశ్న అడగాలి.
ప్రశ్న- గురూజీ! మా పుట్టిన తేదీ వివరాలు మాకు తెలియవు. నా యొక్క జాతకచక్రమును తెలియజేయండి అని అడగాలి.
ప్రశ్న అడిగే ముందు శుచి శుభ్రతలు చరించి, ఇష్టదైవాన్ని ప్రార్థించి, సంపూర్ణ విశ్వాసంతో అడగాలి.
మీ జాతకచక్రమును నిర్మించి మీకు కలిగే యోగాలు, అవయోగాలు వాటికి గ్రహదోష పరిహారాలతో సహా గురూజీ మీకు తెలియజేయడం జరుగుతుంది.
బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో బహు కొద్దిమంది ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు తెలుసుకొనుటకు సంప్రదించండి.
సర్వే జనాః సుఖినో భవంతు,
No comments:
Post a Comment