Tuesday 22 September 2020

జ్యోతిష పాఠములు 9- గ్రహముల నక్షత్రములు వాటి అధిపతులు

 





 భారతీయ జ్యోతిష శాస్త్రం తొమ్మిది గ్రహాలని జాతక విశ్లేషణ కొరకు ఉపయోగించింది. 
1. సూర్యుడు 
2. చంద్రుడు 
3. కుజుడు
 4. బుధుడు
 5. గురువు 
6. శుక్రుడు 
7. శని 
8. రాహువు
9. కేతువు 

ఆధునిక జ్యోతిష్కులు మరో మూడు గ్రహాల్ని గుర్తించారు, అవి. 
1. యురేనస్‌ 
2. నెప్ట్యూన్‌ 
3. ప్లూటో 

రవి సింహరాశికి అధిపతి. 
చంద్రుడు కర్కాటకరాశికి, 
బుధుడు మిథున, కన్యలకు, 
కుజుడు మేష, వృశ్చికాలకు, 
శుక్రుడు వృషభ, తులలకు, 
గురువు ధనుర్మీనాలకు, 
శని మకర, కుంభాలకు అధిపతి. 

రాహు,కేతువులు ఛాయాగ్రహాలవటం మూలాన వీటికి ప్రత్యేక గృహాలు లేవు.
 ఏ రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి ఫలాల్ని, ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ ఫలాల్ని వీరు ఇస్తారు. 

పరాశరుడు 27 నక్షత్రాలకు ఈ తొమ్మిది గ్రహాల్ని అధిపతులుగా చెప్తూ వాటికి సంబంధించిన దశాసంవత్సరాల్ని ఈ విధంగా కేటాయించాడు.

 అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు కేతువు అధిపతి.
ఈ నక్షత్రాల్లో ఎవరు జన్మించినా వారి జన్మదశ కేతుమహర్దశ అవుతుంది.

భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలకు శుక్రుడు అధిపతి.

కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలకు రవి అధిపతి.

రోహిణి, హస్త, శ్రవణంలకు చంద్రుడు అధిపతి.

మృగశిర, చిత్త, ధనిష్టా నక్షత్రాలకు కుజుడు అధిపతి.

ఆరుద్ర, స్వాతి, శతభిషంలకు రాహువధిపతి.

పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు గురువు అధిపతి.

పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు శని అధిపతి.

ఆశ్రేషా, జ్యేష్టా, రేవతి నక్షత్రాలకు బుధుడు అధిపతి.




సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


follow us :

plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)


శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371






No comments:

Post a Comment