Saturday 19 September 2020

వారఫలితాలు :సెప్టెంబర్ తేదీ 20 నుండి 26 , 2020 వరకు :

 


మేష రాశి 

కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయిఈ వారం వ్యాపారస్తులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో కొంత ఊరట. పారిశ్రామికవర్గాల ప్రయత్నాలలో కదలికలు ఉంటాయి. మీ ప్రతిభ, పనితీరుకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో అభిప్రాయభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బంధుమిత్రుల వల్ల ఖర్చులు పెరుగుతాయి. . ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారానికి నోచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి తెలుపు పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.బీదలకు అన్నదానం చెయ్యండి

వృషభ రాశి

ఆర్థికంగా మరింత పుంజుకుంటాయి. పాతబాకీలు కూడా వసూలవుతాయి. ఈ వారం వ్యాపారాలు కొంతమేర విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. రాజకీయవర్గాలకు కార్యసిద్ధి. మానసిక సౌఖ్యం ఉంటుంది. కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఇంతకాలం ఎదురైన సమస్యలు క్రమేపీ తీరతాయి. కుటుంబంలో కొద్దిపాటి వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.కుక్కలకు తీపి రొట్టెలు పెట్టండి.

మిథున రాశి 

ఇంటి నిర్మాణాల్లో కొంత జాప్యం తప్పదు.ఈ వారం ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడులు. కళారంగం వారికి అవకాశాలు నిరుత్సాహపరుస్తాయి. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితం అంతగా కనిపించదు. ప్రయాణాలలో అవాంతరాలు. కొన్ని పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. కుటుంబసభ్యులు మీ అభిప్రాయాలతో విభేదిస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి.  వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఆహ్వానాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి చిత్రవర్ణం గల  పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.పిట్టలకు జొన్నలు,సబ్జలు ఆహారంగా ఇవ్వండి.


కర్కాటక రాశి 

ఆలయాలు సందర్శిస్తారు.ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు విజయాలు వరిస్తాయి. శ్రమ పెరిగినప్పటికీ సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు వస్తాయి. ఇంటి నిర్మాణాలపై ప్రణాళిక మార్చుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది.  వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి వయొలెట్ రంగు పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.గుడ్డివారికి సహాయం చెయ్యండి.

సింహరాశి

కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమాధిక్యం.ఈ వారం వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యక్తులు పరిచయమవుతారు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు పోటీదారుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సాయం చేసేవారున్నారు. కొన్ని విషయాల్లో మీరు అనుకున్నదానికంటే ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. ఎవరితోనూ విభేదించకండి. ఏ పని చేపట్టినా పూర్తి చేసేవరకూ విశ్రమించవద్దు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి పింక్ రంగు పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.యజ్ఞశాల వంటి శుభ స్థలాలలో పూలా మొక్కలు నాటండి

కన్యారాశి

వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. విద్యార్థులకు కొంత అనుకూలమనే చెప్పాలి. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి.ఈ వారం వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.గోవుకి నానపెట్టిన బొబ్బర్లు తినిపించండి.పూజలు,శుభ కార్యాలలో తీపి ప్రసాదం చెయ్యడానికి డొనేట్ చెయ్యండి.


తులా రాశి: 

ఈ వారం నిరుద్యోగులకు ఆశలు ఫలిస్తాయి. వ్యాపారాలు కొంతమేర విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళారంగం వారికి క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీపట్ల అధికారుల వైఖరి మిశ్రమంగా ఉంటుంది. నూతనోత్సాహంతో పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు మరింత అనుకూలిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. ఆరోగ్యభంగం జాగ్రత్తలు వహించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి నీలిరంగు పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.వీలయినన్ని మొక్కలు నాటండి.వేరే వాళ్ళు నాటడానికి మొక్కలు గిఫ్ట్ చెయ్యండి.

వృశ్చికరాశి 

ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన రీతిలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. ఈ వారం వ్యాపారాలు మరింత లాభిస్తాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులు కొంత నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు అధిగమిస్తారు. ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వాహన, గృహయోగాలు. కొన్ని నిర్ణయాలను మార్చుకుంటారు. వారం ప్రారంభంలో సోదరులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి తెలుపు పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.గురువుకి స్వీట్ ఇవ్వండి.

ధనుస్సురాశి 

ఈ వారం సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కృషి, పట్టుదలతో కొన్ని సమస్యలు అధిగమిస్తారు. వ్యాపారాలు విస్తరించడంలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధిస్తారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. మీ సొంత విషయాలపై ఇతరుల ప్రభావం పడకుండా చూసుకోవాలి. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలో మీమాటకు ఎదురుండదు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఆరంజ్ రంగు పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి 

ముఖ్యమైన పనులు వేగం తగ్గినా చివరికి పూర్తి చేస్తారు.ఈ వారం స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాల బాట పడతారు. ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది. కళారంగం వారికి ఆహ్వానాలు అందుతుంది. చేపట్టిన పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. . ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. కొత్త వ్యక్తుల పరిచయం. సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి పసుపు పూలతో పూజించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.బీదవారికి కూరగాయలు,సరుకులు డొనేట్ చెయ్యండి.


కుంభరాశి

 ఉద్యోగాలలో సహచరుల సహాయం లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ఈతిబాధలు తొలగుతాయి. ఒక శుభవార్త వింటారు.ఈ వారం వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఒక వ్యవహారంలో మీకు సాయం అందుతుంది. కీలక విషయాల్లో చురుగ్గా పనిచేస్తారు. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన విషయాల్లో నిర్లక్ష్యం చేయకూడదు. కొత్త పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలపై చర్చిస్తారు. ఆలోచనలు కలసివచ్చి ఉత్సాహంగా సాగుతారు. ఆర్థిక పరిస్థితి చక్కబడి ఊరట చెందుతారు. ఒక మరపురాని సంఘటన ఎదురవుతుంది. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు ఎదురవుతాయి. స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.హ్గురువుకి రాగి పాత్ర దానం ఇవ్వండి.


మీన రాశి 

మీ నిర్ణయాలను అందరూ స్వాగతిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు చేపట్టి వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రమ కొంతమేర ఫలిస్తుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటుంది. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ధన లేదా ఆస్తిలాభ సూచనలు. మిత్రులతో వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు.  వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తులవుతారు. కళారంగం వారి యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.గురువుని పూల మాలతో సత్కరించండి.

సర్వేజనా సుఖినోభవంతు.

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment